13, అక్టోబర్ 2012, శనివారం

హతాజోడి (HATHA JODI)

హతాజోడి
                         హతాజోడి మడచిన చేతుల ఆకారంలో వున్న చాలా అరుదైన మొక్క యొక్క వేరు(మూలం).ఈ మొక్క ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్ కొండలలోను మరియు నేపాల్ లుంబిని లోయలోను ఎక్కువగా కనబడుతుంది.ఈ మొక్క నీలం రంగుతో తెల్లని పుష్పాలను కలిగి ఉంటుంది.ఇది ఉమ్మెత్త మొక్కను పోలి ఉంటుంది.హాతాజోడి మూలాన్ని నువ్వుల నూనెలో ఉంచితే ఒక నెలలో కిలోన్నర దాక నూనెని స్వీకరిస్తుంది
                      .హతాజోడి వేరు చుట్టు కొంత కొవ్వు కలిగి పెద్ద సైజులో ఉంటుంది.నూనెలో వేసిన తరువాత నూనెను పీల్చి చిన్న సైజులోకి వస్తుంది.హతాజోడి వేరుని ప్రత్యేకమైన అమావాస్య ఆదివారం ,లేదా ప్రత్యేకమైన యోగ సమయాలలో సేకరిస్తారు.మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు వాడుదురు. ఈ మొక్క కాండాన్ని కలిగి ఉంటే దుష్ట శక్తులు వెళ్ళిపోతాయని, చాముండేశ్వరీ దేవి స్వరూపమని, అది ఇంట్లో ఉంటే అదృష్టమని కొందరు భావిస్తారు. అలాగే తాంత్రికులు ఈ మొక్క వేరుని రెండు చేతులు నమస్కారం పెట్టినట్లుగా తయారుచేసి మార్కెట్టులో "హతాజోడి" అనే పేరుతో అమ్ముతారు.


పూజా విధానము
పూజకు కావలసినవి
  1)హతాజోడి                  7)యాలకులు,లవంగాలు
  2)కర్పూరం                   8)జవ్వాజి,కస్తూరి
  3)ఎర్రచందనం                9)జపమాల(తావళం)
  4)సింధురం                  10)ఎరుపు రంగు పుష్పాలు
  5)సాంబ్రాణి                  11)శ్రీ యంత్రం గాని అష్టలక్ష్మి పీటం గాని 
  6)పసుపు,కుంకుమ    12)పునుగు
         పూజకు ముందుగ హొమ పాత్రని గాని,మట్టితో హొమ పాత్రని గాని సిద్దం చేసుకోవాలి. ఉదయం స్నానం చేసిన తరువాత హతాజోడిని శ్రీ యంత్రం మీద చేతులు మనవైపుకు చూస్తున్నట్టుగా పెట్టి పసుపుతో,సింధూరం కొద్ది గంగాజలం వాటర్ తో కలిపి హతాజోడికి పూయాలి.కుంకుమతో బొట్ట్లు పెట్టాలి.కర్పూరం,సాంబ్రాణితో ధూపం చూపిస్తూ జపమాలతో 108లలితా సహస్త్ర నామాలతో "ఓం చాముండాయై నమః" అనే మంత్రంతో గాని "ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయైనమః "అనే మంత్రంతో గాని ,ఎర్రని పుష్పాల తో,జవ్వాజి,కస్తూరితో హతాజోడిని తడపకుండా చిలకరిస్తు పూజ చేయాలి.యాలుకులు,లవంగాలతో నైవేద్యం పెట్టాలి.
         చాముండేశ్వరీ మంత్రోచ్చారణ ప్రారంబించే ముందు "ఓం సర్వమంగళ మాంగళ్యే శివేసర్వార్ధసాదకే శరణ్యేత్రయంబికే దేవీ నారాయణ నమోస్తుతే"అను మంత్రాన్ని మూడు సార్లు జపించాలి.
     హతాజోడీ ఉపయోగాలు 
1)హాతాజోడీ ఉన్న ఇంటిలో ఏటువంటి తాంత్రిక ప్రయోగాలు పనిచేయవు,నరధృష్టి ప్రభావాలు పనిచేయవు.
2)రాజకీయాలలో గుర్తింపు,జన సహాకారం,మంచి వాక్ శుద్ధి ఉంటాయి.
3)అప్పుల భాదలు,కోర్టు సమస్యల నుండి విముక్తి కలుగుతుంది.
4)ధనాభివృద్ధి,అదృష్టం కలసివస్తాయి.
5)శత్రువులపై విజయాలు,ఇంటిలో పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తారు.
6)జాతకంలో ఎదురయ్యే గ్రహా భాదల నుండి విముక్తి ముఖ్యంగా శని,కుజ గ్రహాల భాదల నుండి ఉపశమన కలుగుతాయి.
7)హతాజోడీ ఉన్న ఇంటిలో అందరికి మానసిక ప్రశాంతత,అందరి మద్య ఎటువంటి కలతలు,గొడవలు ఉండవు.
8)కొన్ని సమయాలలో ఎంత సంపాదించిన సమయానికి చేతిలో డబ్బులు ఉండవు.అలాంటి సమయాలలో హతాజోడిని పూజ చేసి బీరువాలో గాని లాకర్ లో గాని పెట్టుకుంటే సమయానికి డబ్బు సమకూరుతుంది.
9) దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్న వారు హతాజోడిని పూజ చేసి ఇంటిలో పెట్టుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుంది.
    

19 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఇవి ఎక్కడ లభిస్తుంది దీని రేట్ ఎంత

    రిప్లయితొలగించండి
  3. ఇవి ఎక్కడ లభిస్తుంది దీని రేట్ ఎంత

    రిప్లయితొలగించండి
  4. హతాజోడి ఒరిజినల్ ఎక్కడదొరుతుంది అడ్రస్ తెలుపగలరు

    రిప్లయితొలగించండి
  5. హత జోడి ఎక్కడ దొరుకుతుంది

    రిప్లయితొలగించండి
  6. Online లో దోరికేవి నకిళివ హాతాజోడి లు, Orginal ఎక్కడా లాభిస్తాయి అడ్రస్ చెప్పగలరా!

    రిప్లయితొలగించండి
  7. ఒరిజినల్ అతని ఎక్కడ దొరుకుతుంది హత జోడి

    రిప్లయితొలగించండి
  8. If u want to original Hath jodi contact this Number 8333093429

    రిప్లయితొలగించండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...