8, ఏప్రిల్ 2021, గురువారం

నామ నక్షత్రం తెలుసుకునే పద్దతి

నామ నక్షత్రం తెలుసుకునే పద్దతి

జ్యోతిష ఫలితాలకొరకు సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు.. ఎవరిది ఏ నక్షత్రము. ఏరాశి అని అడుగు తుంటారు. ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోడానికి రెండు పద్దతులున్నాయి.

1. జన్మ నక్షత్రము. 2. నామ నక్షత్రము. జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసు కోవడము. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి. ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి.

శ్లోకము:-దేశజ్వరే గ్రామ గృహ ప్రవేశే, సేవాను, యుడ్డె, వ్వవహార, కారయే ద్యూతేషు, దానేషుచ నామ రాశిః యాత్రా వివాహ దిషు జన్మ రాశిః||

అనగా దేశ సంభందమైన, అనారోగ్య విషయం, గ్రామ ప్రవేశము, గృహ ప్రవేశము, యుద్ధ ప్రారంభానికి మొదలగు విషయాలకు నామ నక్షత్రాన్ని, యాత్రలకు వెళ్ళేటప్పుడు, వివాహము మొదలగు విషయములలో జన్మ నక్షత్రాన్ని చూడాలని పై శ్లోకంలో నిర్దేశించారు.

1, జనవరి 2020, బుధవారం

ఆధ్యాత్మిక దైవిక వస్తువులు గ్రంధం

ఆధ్యాత్మిక దైవిక వస్తువులు గ్రంధం 

అదృష్టం, ఆరోగ్యం, అభివృద్ధి, ఐశ్వర్యం, కీర్తిపతిష్టలను అనుగ్రహించే “ఆధ్యాత్మిక దైవిక వస్తువులు” శ్రీ "షిర్డి సాయినాధుని" కృపాకటాక్షాలతో, ఆశీర్వచనాలతో, రచయితలను గౌరవాలతో మంత్ర ముగ్ధులను చేసే "మోహన్ పబ్లిషర్స్" అధినేత ఆకుల రామచంద్రరావు గారి సహకారంతో "నేరెళ్ళ రాజశేఖర్" అను నేను శ్రీ సాయి జ్యోతిష కేంద్రం అనే మా సంస్ధ తరుపున అనేక గ్రంధాలలో దాగి ఉన్న, అనుభవ పూర్వకంగా తెలుసుకున్న “ఆధ్యాత్మిక దైవిక వస్తువులు” అనే దైవిక వస్తువుల రహస్యాలను విశదీకరించు గ్రంధం రచించటం జరిగింది. 

మన నిత్య జీవితంలో కలిగే ఇబ్బందులకు జ్యోతిష శాస్త్ర, వాస్తు శాస్త్రాల పరంగా గ్రహాలు, పరిసరాలు కలిగించు దోషాలకు నివారణోపాయ రహస్యాలను తెలియజేయు అమూల్యమైన గ్రంధం “ఆధ్యాత్మిక దైవిక వస్తువులు”. ఆధ్యాత్మిక దైవిక వస్తువుల గ్రంధం నందు 330 పైగా అరుదైన వస్తువులు మరియు పరిహారాలను పొందుపరచటం జరిగింది. ఆధ్యాత్మిక దైవిక వస్తువుల గ్రంధంతో పాటు “వైజయంతి మాల” మరియు సుమారు 25 పేజీల జాతకచక్రం పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. సామాన్యులను సైతం అదృష్టవంతులను చేయగలిగే ఆధ్యాత్మిక దైవిక వస్తువులను ప్రతి ఒక్కరూ తమకు తగిన విధంగా వినియోగించుకొని అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో అదృష్ట వంతులు కాగలరని ఆశిస్తూ నా యొక్క ఈ గ్రంధ రచన పాఠకులైన మీకు ఏ మాత్రం సంతృప్తి కలిగించిన నా పరిశ్రమ సార్ధకమైనట్లే. 

“ఆధ్యాత్మిక దైవిక వస్తువులు” గ్రంధం పెద్దలు, సద్గురువులు, పాఠకుల సహకారంతో, ఆశీర్వచనాలతో వెలుగులోకి రావాలని ఆశిస్తున్నాను. 

                                                      ఇట్లు 
                                                        మీ 
                                              నేరెళ్ళ రాజశేఖర్ 
గమనిక:-ఆధ్యాత్మిక దైవిక వస్తువులు గ్రంధం కావలసిన వారు “శ్రీ సాయి జ్యోతిష కేంద్రం” అను మా సంస్ధకు సంబందించిన బ్యాంక్ అక్కౌంట్ నందు 250-00 మరియు కొరియర్ ఛార్జీలు 50.00 (Ap & TS) మొత్తం 300-00 జమ చేసిన కొరియర్ ద్వారా గ్రంధం పంపగలం. ఆధ్యాత్మిక దైవిక వస్తువుల గ్రంధంతో పాటు “వైజయంతి మాల"ను తప్పకుండా పొందగలరు.

7, జూన్ 2019, శుక్రవారం

నవ మాసాలు – నవ గ్రహాలు

నవ మాసాలు – నవ గ్రహాలు

పిండోత్పత్తి ప్రారంభమయిన దగ్గర నుండి శిశు జననం వరకు తల్లి గర్భములో పిండం ప్రతి మాసం మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ మార్పుల ఆధారంగా ప్రతి మాసమునకు ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు.

2, ఫిబ్రవరి 2019, శనివారం

బుధ గ్రహ దోష నివారణకు మరకతం(పచ్చ)

        రత్నశాస్త్ర గ్రంధం నందు పచ్చలను మరకత మణి, గారుడం, హరిన్మణి, తృణగ్రాహి, పన్నా అని కూడా అంటారు. పెగ్మటైట్ పొరల యందు, ఖనిజ పొరల యందు, ప్రవాహములకు కొట్టుకువచ్చే గుళక రాళ్ళ యందు నెమలి కాంతం రంగులో, నాచు వలె, గరిక వలె, మిణుగురు పురుగులా మెరుస్తాయని చిలక రెక్కలవలె, వివిధ రకాలైన పచ్చలు లభిస్తాయని రత్న శాస్త్ర గ్రంధాలలో వివరించబడింది. దోషాలు లేని, మచ్చలేని పచ్చ దొరకటం కష్టం. పచ్చలకు ఎక్కడైనా కొంచమైన మచ్చలు లేకుండా లభ్యం కాదు. “అత్తలేని కోడలు, మచ్చ లేని పచ్చ” ఉండదని లోకోక్తి. బీటలు, మచ్చలు కనబడకుండా ఒక రకమైన తైలం రాస్తారు. 
          ప్రపంచంలో చారిత్రాత్మక ప్రాదాన్యత సంతరించుకున్న పచ్చలు ఈజిప్ట్ గనుల నుండి లభ్యమవుతాయి. దక్షిణాఫ్రికా, రష్యా, ఇండియాలో ఉదయపూర్, ఆజ్మీర్, ఆప్రికాలోని కొలంబియాలలో పచ్చలు లభ్యమగును. పచ్చని ఎండలో సూర్యునికి ఎదురుగా పెట్టిన మంచి ఆకు పచ్చని కాంతితో మెరుస్తూ బంగారం, తెల్లని వస్త్రం పై పెట్టినప్పుడు ఆకు పచ్చని కాంతిని ప్రసరించును కనుక ‘గరుడ పచ్చ’ అని పేర్కొనటం జరిగింది. అధిక వేడి తగిలిన బరువు లో 99 %తగ్గుతుంది. రాపిడి వల్ల విద్యుచ్చక్తి వస్తుంది.
        గరుడ పురాణంలో పచ్చల పుట్టుక గురుంచి ఒక కధ ఉంది. సర్ప రాజు వాసుకి అనే సర్పం, బకాసురుడనే రాక్షసుని యొక్క  చేదు కట్టని (పిత్త కోశం) సంగ్రహించి ఆకాశంలో ఎగిరిపోతుండగా వాసుకిని చూసిన గరుత్మంతుడు ఆ జన్మ శతృత్వం వలన ఆకాశంలో ఎగురుచున్న ఆ సర్పారాజుని డీకొని యుద్దం చేయగా గరుత్మంతుని దాటికి వాసుకి నిలవలేక మలయ పర్వత ప్రాంతములలో ఆ చేదు కట్టని విడిచింది. విడిచిన సమయంలో దేదీప్యమానంగా పచ్చదనంతో వెలిగిపోతున్న ఆ చేదుకట్టలో కొంత భాగం గరుత్మంతుడు త్రాగుతాడు. అదియే మరకతం. త్రాగిన కొంతసేపటికి మూర్ఛ కలిగి, పిదప కొంత బైటికి వదిలి వేయగా అదిపడిన ప్రదేశంలో పుట్టిన పచ్చలను గరుడ పచ్చలని పేరు.గరుడ పచ్చ గరుత్మంతునిచే జనియించి నందున విషమును హరింపజేయు శక్తి కలిగి ఉంటుంది.
        మరొక కధ ప్రకారం నలమహారాజు శనిగ్రహ పీడా విముక్తికి విష్ణుమూర్తిని ప్రార్ధించి శివలింగంను ప్రసాదించమని కోరగా మరకత లింగమును ప్రసాదించాడు. నలుడు ప్రతిష్టించిన మరకత లింగం పాండిచ్చేరి రాష్ట్రంలో కలదు. శ్రీకృష్ణ దేవరాయలు సింహాచలంలో  స్వామి వారికి శ్రేష్ఠమైన పచ్చలను ఇవ్వటం జరిగింది. గరుత్మంతుని ద్వారా ఉద్భవించిన గరుడ పచ్చలు అమిత శక్తి వంతమైనవి.
        చిన్న చిన్న గుంటలుగా ఉన్న పుప్పి దోషం ఉన్న, కాంతిహీనమైన గార దోషం ఉన్న.తెల్లని తెట్టవలే ఉన్న కర్క దోషం ఉన్న పచ్చలను ధరించరాదు. పచ్చను వస్త్రంపైన పెట్టి సూర్య కిరణాలకు ఎదురుగా ఉంచినట్లయితే కాంతి నలుమూలల ప్రకాశిస్తూ వస్త్రం పచ్చగా ప్రకా శించును. పచ్చపైన సున్నపు పొర వేసిన పొరలో నుండి కూడా ప్రకాశించు పచ్చలను ధరించటం ఉత్తమం.
        ఆయుర్వేద శాస్త్రం ప్రకారం  నేల వంకాయ రసంలో గాని, కొండ పిండి వేళ్ళ రసంలో గాని ఒక రోజు నానబెట్టి పచ్చను భస్మం చేసి వాడిన ఛాతీ, నరాల, మెదడు, నోరు, చర్మ వ్యాదులను, జీర్ణ వ్యవస్ధలోని లోపాలను, మందబుద్ధి, పిచ్చిని తగ్గించును. రసాయన శాస్త్రం ప్రకారం ఇది బేరీలియమ్, సిలికేట్ ల సమ్మేళనం వేడికి మార్పు చెందని క్రోమియం ఆక్సైడ్ ఉన్నందున ఈ రత్నాలకు పచ్చ రంగు వచ్చింది. పచ్చ బుద గ్రహానికి సంబందించినది కావున జ్ఞాన శక్తికి, మానసిక ప్రశాంతతకు, వ్యాపారా భివృద్ధికి, ఉన్నత విద్యలను అభ్యసించుటకు విష్ణుమూర్తి ప్రతి రూపమైన పచ్చను ధరించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించును. వేదాంతులు, పండితశ్రేష్టులు, సివిల్ ఇంజనీర్స్, పురోహితులు, జ్యోతిష్యులు, ఆడిటర్స్, ఉపాన్యాసకులు, కాలేజీ,స్కూల్స్ నడిపేవారు, పుస్తక వ్యాపారులు, లలితా కళాకారులు, చిత్రా లేఖనం చేసేవారు, న్యాయ వాదులు, రత్న పరీక్ష, హోమియో, అల్లోపతి, ఫిజీషియన్స్ తప్పని సరిగా మోక్షాన్ని కలిగించే పచ్చ రత్నాన్ని ధరించాలి. పచ్చను ధరించిన గణిత శాస్త్రం పైన పట్టు సాధించవచ్చును.పచ్చను ధరించిన క్రీడలలో నైపుణ్యాన్ని, తెలివి తేటలను తడుముకోకుండా వ్యక్త పరచటం, అవతలి వ్యక్తులు ఏది చెబితే విని అర్ధం చేసుకోగలరో అది చెప్పగలిగే వాక్ శుద్ధిని కలిగిస్తుంది. మంచి తెలివితేటలతో వాదోపవాదనలు చేయగలరు. రావణాసురుడు పెద్ద మరకత మణి పైన కూర్చోని భగవంతుని ద్యానం చేసేవాడట.
         జాతకచక్రంలో బుధుడు మీనరాశిలో నీచలో ఉన్న, వక్రించి ఉన్న లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, శత్రు స్ధానాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న, బుధ దశా అంతర్ధశలలో ఆశ్లేష, జ్యేష్ట, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారు, విద్యలో ఆటంకాలు ఉన్నవారు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు, మంధ బుద్ధి కలవారు మరకతమణిని ధరించాలి. మరకతమణి ధరించేటప్పుడు “మహాదేవచ్చ విద్మహే విష్ణు పత్నేచ్చ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్”అనే మంత్రాన్ని జపిస్తూ 3 క్యారెట్స్ కలిగిన పచ్చను చిటికిన వ్రేలుకు గాని, ఉంగరపు వేలుకు గాని బుధవారం రోజు బుదహోరలో పచ్చ పెసర్లను ఒక కిలో పావు దానం చేస్తూ ధరించాలి. 

30, నవంబర్ 2018, శుక్రవారం

శనిగ్రహ దోష నివారణకు "Evil Eye"


శనిగ్రహ దోష నివారణకు "Evil Eye"

జాతకచక్రంలో శనిగ్రహ దోష నివారణకు “Evil Eye” బాగా ఉపయోగపడుతుంది. “Evil Eye” నరఘోష నివారణకు ఇంటికి గాని, వ్యాపార సంస్ధలలో గాని, ఆపీసులకు గాని బయటపక్కన తగిలిస్తే ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు. జాతకంలో నీచశని, జన్మ శని, ఎల్నాటిశని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని దశలు నడిచే వారు “Evil Eye” ఇంటికి గాని, గదికి గాని పశ్చిమ దిక్కు ఉంచి ప్రతి శనివారం ధూపం వేసిన శనిగ్రహ భాదల నుండి విముక్తి కలుగుతుంది. శని వాయు తత్త్వము కలిగి పడమర దిక్కును సూచించును.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...