Crystal Items by Nerella Rajasekhar on Scribd
24, నవంబర్ 2016, గురువారం
8, నవంబర్ 2016, మంగళవారం
జ్యోతిష శాస్త్ర చిట్కాలు (Techniques In Astrology)
జన్మలగ్నం
చరరాశియై లగ్న భాగ్యాధిపతులు చరరాశిలో ఉంటే జాతకుడు తండ్రిని విడిచి చాలా
దూరప్రదేశాలకు పోవును.
చతుర్ధమున
శని,
దశమమున చంద్రుడు సప్తమమున కుజుడు ఉంటే అంగవైకల్యం కలుగుతుంది.
లగ్న
యమకంఠక స్ఫుటములను ఏకం చేయగా వచ్చు రాశి, నవాంశలు మిధున, సింహం, తుల, వృశ్చిక, కుంబ రాశులలో పడి శుభగ్రహ సంబంధం ఉంటే సంతానం చిన్న
వయస్సులోనే కలుగుతుంది. ఈ స్ఫుటమునకు శని సంబంధముంటే సంతానం ఆలస్యమవుతుంది. ఈ
స్ఫుటమునకు శని, రాహువుల సంబంధముంటే సంతానం కొరకు చాలా
ప్రయత్నములు చేసి చివరకు దత్తత గాని వేరే పిల్లలను పెంచుకోవటం గాని జరగచ్చు.
5, నవంబర్ 2016, శనివారం
రుద్రాక్ష ధారణ వాటి ఫలితాలు
"రుద్రాక్ష" పరమేశ్వరుని కనుల నుండి జాలువారిన కన్నీళ్ళే భూమిపైన రుద్రాక్షలుగా ఉద్భవించాయి. రుద్రాక్ష పుట్టుక గురించి పురాణాలలో అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. పురాణ శాస్త్ర ప్రకారం శివుడు రాక్షసులతో పోరాడి మూడు పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారిస్తాడు. అలా శివుడు విచారించినప్పుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారతాయి. వాటి నుంచి పుట్టినవే “రుద్రాక్షలు”.
శివుని కుడికన్ను అయిన ‘సూర్యనేత్రం’ నుండి పన్నెండురకాల రుద్రాక్షలు, ఎడమకన్ను అయిన ‘చంద్రనేత్రం’ నుండి పదహారు రకాల రుద్రాక్షలు, మూడవ కన్ను అయిన ‘అగ్నినేత్రం’ నుండి పది రకాల రుద్రాక్షలు వచ్చాయని శాస్త్ర వచనం. సూర్యుని నుండి వచ్చినవి ‘ఎర్ర’గాను, చంద్రుని నుండి వచ్చినవి‘తెల్ల’గాను,అగ్ని నుండి వచ్చినవి ‘నల్ల’ గాను ఉంటాయని దేవీ భాగవతంలో తెలియజేయబడింది. రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.
4, నవంబర్ 2016, శుక్రవారం
జ్యోతిష శాస్త్ర చిట్కాలు
జాతకచక్రంలో
ఎక్కువ డిగ్రీలు నడచిన గ్రహం నవాంశలో చంద్రుడు ఉండే రాశిలో పడుతుందో వారు గొప్ప
గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. లేదా చంద్రుడు ఆత్మకారకుడైన చాలు కీర్తి ప్రతిష్టలు పొందుతారు.
రాశిచక్రంలో
చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి లగ్నాన్ని, చంద్రుడిని రెండిటినీ చూస్తూ ఉన్న గ్రహం 10, 11
భావాలకు సంబంధించిన లేదా ఆరుద్ర, పుష్యమి, మఖ, శ్రవణ, రేవతి నక్షత్రాలలో
ఉన్న గ్రహం పాప గ్రహం ఐన మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ గ్రహ దశలో పేరు ప్రతిష్టలు, ప్రమోషన్స్, ఆర్ధిక లాభం,
శుభకార్యాలు జరగటం కలుగుతాయి.
3, నవంబర్ 2016, గురువారం
విపరీత రాజయోగాలు
ఉత్తర
కాలామృతం ప్రకారం 6-8-12 అధిపతులు నైసర్గికత్వంతో సంబంధం లేకుండానే అంటే శుభులైన, పాపులైన 6-8-12
భావాలలో ఉంటే రాజయోగాన్నిస్తారు. 6-8-12 భావాధిపతులు అందరు కలసి గాని, విడివిడిగాగాను 6-8-12 రాశులలో ఎక్కడ ఉన్న విపరీత రాజయోగం పడుతుంది. వీరి
కలయిక కూడా శుభమే. ఆదిపత్య విషయంలోనూ, శత్రు, మిత్ర రాశులలో ఉన్నారా అనేది చూడనక్కరలేదు. జాతకచక్రంలో విపరీత
రాజయోగాన్ని పొందిన జాతకుడు 6-8-12 భావాధిపతుల దశ,
అంతర్ధశలలో ఉద్యోగంలో ఉన్నతి, గొప్ప పేరు ప్రతిష్ఠలు,
ప్రభుత్వంలో మంచి పలుకుబడి, సౌఖ్యాలు పొందుతాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)




