కుజగ్రహ దోష నివారణకు “బగళాముఖి యంత్రం”
జాతకంలో కుజ గ్రహ దోష నివారణకు తాంత్రిక దేవతాధిపతిగా బగళాముఖిని పూజిస్తారు. శత్రు పీడలు, ఋణబాధలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు బగళాముఖి యంత్రం ఉన్న కార్డును మొదటిసారి మంగళవారం రోజు పూజా మందిరంలో ఉంచి పూజ చేసిన పిదప వాహనంలో గాని, ముఖ్యమైన పనుల్లో విజయాల కోసం దగ్గర ఉంచుకొని వెళ్ళటం ద్వారా బగళా దేవి అనుగ్రహం లభించి వాహన ప్రమాదాల నుండి రక్షణ మరియు అన్ని పనుల్లోనూ విజయం సాధించవచ్చును.
జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ధైర్యం లేక పోవుటం, అన్నదమ్ములతో సఖ్యత నశించుట, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, అనవసరమైనతగాదాల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధింపులు, అప్పులు తీరకపోవుట, ఋణదాతల నుండి ఒత్తిడి, రక్త సంబంధించిన వ్యాధులు, శృంగారం నందు ఆసక్తి లేకపోవడం, కండరాల బలహీనత, రక్తహీనత సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలుగుచున్నప్పుడు కుజగ్రహ దోషముగా గుర్తించి కుజగ్రహాను గ్రహం కొరకు మంగళవారం రోజున నియమంగా బగళా ముఖి యంత్రాన్ని పూజ చేస్తూ బగళాముఖి స్తోత్రము పఠించటం వలన కుజగ్రహ బాధల నుండి విముక్తి కలుగుతుంది.
దశ మహా విద్యలలో బగళాముఖి ఎనిమిదవ రూపం. కుటుంబ పరంగాను, ఆధ్యాత్మికంగాను, దేశంలోను, సమాజంలోను వికాసానికి అడ్డంకులుగా ఉన్న అరిష్టాలను రూపుమాపడానికి, శత్రువులను అణగత్రోక్కడానికి బగళాముఖిని ఆరాధిస్తారు. పసుపు వర్ణంతో ప్రకాశించే బగళా ముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన దేవత బగళాముఖి. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.
బగళాముఖీ దేవి తన దుడ్డు కర్రతో భక్తుని దురభిప్రాయాలు మరియు భ్రమలు (లేదా భక్తుని యొక్క శత్రువులను) నాశనం చేస్తుంది. ఆమెను ఉత్తర భారతదేశంలో పీతాంబరీ దేవి అని పిలుస్తారు. బగళాముఖీ దేవి బంగారు సింహసనంపై, చేతులో పసుపు కమలతో సముద్రం మద్యలో ఉంటుంది. ఆమె అర్ధచంద్రాకార తల కలిగి ఉంటుంది. కొన్ని చోట్ల రెండు చేతులు, మరి కోన్ని చోట్ల నాలుగు చేతులు కలవు అని ఉన్నాయి. విశ్వాసంతో నమ్మి లోకోత్తర కార్యక్రమాలకు ఆపదలు సంభవించినపుడు బగళాదేవిని ధ్యానించి పూజించడం ద్వారా ఫలితం ఉంటుంది. బగళాముఖీ దేవి కోర్టు కేసుల నుండి మరియు అప్పుల నుండి బయట పడవేసె దేవత. లాయర్లు ప్రతి రోజు పూజించ వలసిన దేవత.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి