17, జూన్ 2018, ఆదివారం

వాస్తుదోష నివారణకు “సూర్య శంఖం”

వాస్తుదోష నివారణకు “సూర్య శంఖం”

ఇంటిలో గాని, ఆపీసుల్లో, వ్యాపారస్ధలంలో వాస్తు దోషాలు ఉన్నవారు సూర్య శంఖాన్ని పూజా మందిరంలో బియ్యం పైన ఉంచి ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదివిన వాస్తు దోష నివారణ జరుగుతుంది.


తూర్పుదిక్కుకి అధిపతి సూర్యుడు. తూర్పుదిక్కు వాస్తుదోషం ఉన్నవారికి అనారోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అపవాదులు, అధికారుల ఒత్తిడి, కంటి సమస్యలు వస్తాయి. ఇల్లాంటి వాస్తు దోషాలు ఉన్నవారు సూర్య శంఖాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించి ఆదిత్య హృదయం పారాయణం చేసినచో కొంతవరకు వాస్తు దోష నివారణ జరుగుతుంది.

తూర్పు దిక్కున గాలి, వెలుతురు ప్రసరించే విధంగా తగినంత ఖాళీ వదలి నిర్మాణం చేపట్టాలి. కాంతి, వెలుగు ఇంట్లో చక్కగా ప్రసరించడం చాలా అవసరం. క్రిమి కీటకాలు, సరీ సృపాలు (పాము మొ) చీకటిని ఆశ్రయించి ఉంటాయి. ప్రమాదాలకు కారణమవుతాయి. అందుకే ఇంట్లో వెలుగు బాగా ప్రసరిస్తూ ఉండాలి.

పగటి వెలుగు సూర్యుని నుండి, రాత్రి వెలుగు అగ్నినుండి వస్తుంది. అందుకే సూర్యునికి దినకరుడు అని పేరు. ఆధునికమైన విద్యుద్దీపాలలో కూడా అంతర్లీనంగా అగ్ని నిక్షిప్తమై వుంటుంది. కాంతిని భౌతిక శాస్త్రం ఇలా నిర్వచించింది- ‘‘స్వయం ప్రకాశకాల నుండి వెలువడి మనకు దృశ్యానుభవం కలిగించే భౌతిక రాశిని కాంతి’ అన్నారు. అంటే మనిషి కన్నుకు ఎంత దృశ్యానుభవ శక్తి ఉంటుందో అంత ప్రమాణంలోనే కాంతి ఇంట్లో ప్రసరించాలి. అంతకంటే ఎక్కువగా ప్రసరిస్తే అది వేధగా మారి బాధిస్తుంది. దానినే కాంతి వేధ అన్నది వాస్తు శాస్త్రం. కాంతివేధ దోషం ఉన్నవారు,  సూర్య కాంతి ఇంట్లో సరిగా ప్రసరించని వారు తూర్పు దిక్కున సూర్య శంఖాన్ని ఉంచిన వేధ దోషాలు, వాస్తు దోషాలు ఉండవు.

సూర్యరశ్మి గృహాంగణాలలో బాగా ప్రసరించి దాని పరావర్తన కాంతి ఇంట్లోకి రావాలి అంతేకాని మొత్తంగా సూర్యరశ్మి సూటిగా ఇంట్లో ప్రసరించకూడదు. భౌతిక నేత్రాలతో సూర్యుని సూటిగా చూడడం కూడా హానికరమే. వైద్య శాస్త్ర రీత్యా ఉదయ సూర్యకాంతి (ఎండ) కంటే సూర్యాస్తమయ సమయంలోని పడమటి ఎండ మంచిదని చెబుతోంది.


బాలార్కో ప్రేత ధూమంచ, రాత్రౌదధ్యాన్న భుక్తిశ్చ ఆయుః క్షీణం దినే దినే-వృద్ధార్కో హోమధూమంచ, రాత్రౌ క్షీరాన్న భోజనం ఆయుర్వువృద్ధిః దినే దినే- అని అందుకే పడమరనుండి సూర్యకాంతి, తూర్పునుండి (రాత్రివేళ) చంద్రకాంతి (వెన్నెల) ఇంట్లో ప్రాంగణాలలో బాగా ప్రసరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...