14, జులై 2017, శుక్రవారం

షష్ట్యంశ వర్గచక్ర విశ్లేషణ



షష్ట్యంశ వర్గచక్ర విశ్లేషణ

      షష్ట్యంశ కాల వ్యవధి 30 నిమిషాలు. ప్రతిభావాన్ని అరవై భాగాలు చేయగా 0 -30 నిమిషాల ప్రమాణం ఉంటుంది. ఒక షష్ట్యంశ బేసిరాశులలో 0 నుండి 60 వరకు, సరి రాశులలో 60 నుండి 0 వరకు లెక్కించటం జరుగుతుంది. రాశిలో ఉన్న గ్రహ స్ఫుటాన్ని 2 పెట్టి గుణించి, నిమిషాలను వదలివేసి, డిగ్రీలను 12 పెట్టి భాగించి శేషానికి 1 కలపాలి. వచ్చిన మొత్తాన్ని ఆ గ్రహం ఉన్న రాశి నుండి లెక్కించాలి. 2 నిమిషాల కాల వ్యవదిలో షష్ట్యంశ వర్గ చక్రంలో గ్రహాలు మార్పు చెందుతాయి కావున కవలల విషయంలో షష్ట్యంశ వర్గ చక్రం విశ్లేషణ అత్యంత ప్రాముఖ్యమైనది.

   షష్ట్యంశ ద్వారా సమస్త విషయాలు తెలుసుకోవచ్చును. పూర్వజన్మ విషయాలు తెలుసుకోవచ్చును. కవలల పిల్లల విశ్లేషణకు, ముహూర్త విషయంలో, ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.

    గురుగ్రహం మృదంశలో ఉంటే గురుగ్రహ అనుగ్రహం లభించినట్టే. బేసిరాశులలో 19 వది, సరిరాశులలో 42 వది మృదంశ అవుతుంది. 



బేసి రాశులలో మృదంశ డిగ్రీలు -9°-0' నుండి 9°-30'   
సరి రాశులలో మృదంశ డిగ్రీలు - 20°-30' నుండి 21°-00'

    బేసిరాశులలో మిధున, తుల, ధనస్సు మంచివి. సరిరాశులలో వృషభ, కర్కాటకం, మీనం మంచివి. సర్వోత్తమ స్దితి మీనరాశిలో రేవతి నక్షత్రంలో గురువు ఉండటం మంచిది. పై స్ధితులలో గురువు ఉన్న ఇబ్బంది పడుతున్నారంటే దాని అర్ధం ఈ జన్మలో గురుదోషం ఉందని అర్ధం.

లగ్నం గాని, గ్రహం గాని శుభ  షష్ట్యంశలలో ఉంటే శుభ ఫలితాలను, పాప షష్ట్యంశలలో ఉంటే అశుభ ఫలితాలను ఇస్తాయి. 60 షష్ట్యంశలలో 60 మంది దేవతలు ఉంటారు.


షష్ట్యంశ దేవతలు 

ఘోరశ్చ రాక్షశో దేవః కుబేరో యక్షకిన్నరౌ ।
భ్రష్టః కులఘ్నో గరలో వహ్నిర్మాయా పురీషకః ॥

అపామ్పతిర్మరుత్వాంశ్చ కాలః సర్పామృతేన్దుకాః ।
మృదుః కోమలహేరమ్బబ్రహ్మవిష్ణుమహేశ్వరాః ॥

దేవార్ద్రౌ కలినాశశ్చ క్షితీశకమలాకరౌ ।
గులికో మృత్యుకాలశ్చ దావాగ్నిర్ఘోరసంజ్ఞకః ॥

యమశ్చ కణ్టకసుధాఽమృతౌ పూర్ణనిశాకరః ।
విషదగ్ధకులాన్తశ్చ ముఖ్యో వంశక్షయస్తథా ॥

ఉత్పాతకాలసౌమ్యాఖ్యాః కోమలః శీతలాభిధః ।
కరాలదంష్ట్రచన్ద్రాస్యౌ ప్రవీణః కాలపావకః ॥

దణ్డభృన్నిర్మలః సౌమ్యః క్రూరోఽతిశీతలోఽమృతః ।
పయోధిభ్రమణాఖ్యౌ చ చన్ద్రరేఖా త్వయుగ్మపాః ॥

సమే భే వ్యత్యయాజ్జ్ఞేయాః షష్ట్యంశేశాః ప్రకీర్తితాః ।
షష్ట్యాంశస్వామినస్త్వోజే తదీశాదవ్యత్పయః సమే ॥

శుభషష్టయంశసంయుక్తా గ్రహాః శుభఫలప్రదాః ।
క్రూరషష్ట్యంశాసంయుక్తా నాశయన్తి ఖచారిణః ॥


1) ఘోరాంశ (అశుభం), 2) రాక్షసాంశ (అశుభం), 3) దేవాంశ (శుభం), 4) కుభేరాంశ (శుభం), 5) యక్షాంశ (అశుభం), 6) కిన్నెరాంశ (శుభం), 7) భ్రష్టాంశ (అశుభం), 8) కులజ్ఞాంశ (అశుభం), 9) గరళాంశ (అశుభం), 10) అగ్నింశ (అశుభం), 11) మాయాంశ (శుభం), 12) పురీశాంశ (అశుభం), 13) అపంపత్యంశ (శుభం), 14) మరుత్యంశ (శుభం), 15) కలాంశ (శుభం), 16) సర్పాంశ (అశుభం), 17) అమృతాంశ (శుభం), 18) చంద్రాంశ (శుభం), 19) మృదుంశ (శుభం), 20) కోమలాంశ (శుభం), 21) హేరంభాంశ (శుభం), 22) బ్రహ్మాంశ (శుభం), 23) విష్ణాంశ (శుభం), 24) దిగంబరాంశ (అశుభం), 25) దేవాంశ (శుభం), 26) ఇంద్రాంశ (శుభం), 27) కలినాశనాంశ (శుభం), 28) క్షితీశ్వరాంశ (శుభం), 29) కమలాకరాంశ (శుభం), 30) గుళికాంశ (అశుభం), 31) మృత్యుకరాంశ (అశుభం), 32) కళాంశ (అశుభం), 33) దావాగ్నింశ (అశుభం), 34) ఘోరాంశ (అశుభం), 35) యమాంశ (అశుభం), 36) కంటకాంశ (అశుభం), 37) సుధాంశ (శుభం), 38) అమృతాంశ (శుభం), 39) పూర్ణచంద్రాంశ (శుభం), 40) విషదగ్ధాంశ (అశుభం), 41) కులనాసంశ (అశుభం), 42) వంశక్షయాంశ (అశుభం), 43) ఉత్పాతకాంశ (అశుభం), 44) కాలరూపాంశ (అశుభం), 45) సౌమ్యాంశ (శుభం), 46) కోమలాంశ (శుభం), 47) సీతలాంశ (శుభం), 48) దంష్ట్రాకరలాంశ (అశుభం), 49) ఇంద్రముఖాంశ (శుభం), 50) ప్రవీణాంశ (శుభం), 51) కాలాగ్నింశ (అశుభం), 52) దండాయుధాంశ (అశుభం), 53) నిర్మాలాంశ (శుభం), 54) సౌమ్యాంశ (శుభం), 55) క్రూరాంశ (అశుభం), 56) అతిశీతలాంశ (శుభం), 57) అమృతాంశ (శుభం), 58) ప్రయోదాంశ (శుభం), 59) బ్రమణాంశ (అశుభం), 60) ఇందురేఖాంశ (శుభం).  బేసి రాశులకు వరుసగా వచ్చును. సరి రాశులకు వ్యతిరేకముగా అనగా ఇందురేఖ, బ్రహ్మాణాంశ లు వరుసగా వచ్చును.           

ఉదాహరణ జాతకచక్రంలోని గ్రహ స్ఫుటాల ఆధారంగా షష్ట్యంశ వర్గచక్ర నిర్మాణం


రాశిచక్రంలో కన్యా లగ్నం స్ఫుటం -25°-14' నిమిషాలను 2 చేత గుణించగా 50°-28' లను నిమిషాలను వదలి 50° లను 12 చేత భాగించగా శేషం 2 వచ్చిన దానికి 1 కలుపగా 3 వచ్చును. రాశి చక్రంలోని కన్యా లగ్నానికి మూడవ స్ధానం వృశ్చికం కావున  షష్ట్యంశ వర్గచక్ర లగ్నం వృశ్చిక లగ్నం అవుతుంది.

రాశి చక్రంలోని కన్యా లగ్నంలోని రవిగ్రహ స్ఫుటం 18°-52' నిమిషాలను 2 చేత గుణించగా 37°-04' లను నిమిషాలను వదలి 37° లను 12 చేత భాగించగా శేషం 1 వచ్చిన దానికి 1 కలుపగా 2 వచ్చును. రాశి చక్రంలోని కన్యా లగ్నానికి రెండవ స్ధానం తులారాశి కావున షష్ట్యంశ వర్గచక్రంలో రవి తులారాశిలో ఉంటాడు.

రాశి చక్రంలోని వృశ్చిక రాశి లోని చంద్ర గ్రహ స్ఫుటం 05°-14' నిమిషాలను 2 చేత గుణించగా 10°-28' లను నిమిషాలను వదలి 10° లను 12 చేత భాగించలేము కనుక  10° లకు 1 కలుపగా 11 వచ్చును. రాశి చక్రంలోని వృశ్చిక రాశికి 11 స్ధానం కన్యా రాశి కావున షష్ట్యంశ వర్గచక్రంలో చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు.

రాశిచక్రంలోని తులారాశిలోని కుజ గ్రహ స్ఫుటం 17°-26' నిమిషాలను 2 చేత గుణించగా 34°-52' లను నిమిషాలను వదలి 34° లను 12 చేత భాగించగా శేషం 10 వచ్చిన దానికి 1 కలుపగా 11 వచ్చును. రాశి చక్రంలోని తులారాశికి 11 స్ధానం సింహారాశి కావున షష్ట్యంశ వర్గచక్రంలో కుజుడు సింహారాశిలో ఉంటాడు.

ఈ విధంగా రాశి చక్రంలోని గ్రహా స్ఫుటాలను ఆదారంగా చేసుకొని షష్ట్యంశ వర్గచక్రం నిర్మాణం ఎవరికి వారే వారి జాతక చక్రాలను తయారు చేసుకోవచ్చును.

2 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...