20, జనవరి 2017, శుక్రవారం

బ్రహ్మ నారీకేళం (Brahma Swaroopa Coconut)

బ్రహ్మ నారీకేళం

బ్రహ్మ హిందువుల దేవుడు. త్రిమూర్తులలో ఒకరు. విష్ణు, శివుడు, బ్రహ్మ.. ఈ ముగ్గురిని త్రిమూర్తులు అని పిలుస్తారు. బ్రహ్మ సృష్టికర్త కూడా. బ్రహ్మ పురాణం ప్రకారం మను తండ్రి బ్రహ్మ. మను అంటే.. మనుల వారసులుగా మనుషులు పుట్టారని తెలుస్తోంది. బ్రహ్మదేవుడికి ముగ్గురు భార్యలు ఉన్నట్టు చెబుతారు. సరస్వతి, సావిత్రి, గాయత్రి. ఈ ముగ్గురు భార్యలనూ.. వేదమాతలుగా గౌరవిస్తారు. వేదమాత అంటే.. వేదాలకు తల్లి అని అర్థం. బ్రహ్మదేవుడిని ప్రజాపతి, వేద దేవుడు అని పిలుస్తారు. సుదర్శన చక్రం ఎలా పుట్టింది ? ఆ చక్రం విష్ణువుకే ఎందుకు ? ఈ విశ్వ సృష్టికర్తగా బ్రహ్మను పేర్కొంటారు. నాలుగు తలలు కలిగి దేవుడిగా బ్రహ్మను చెబుతారు. కానీ.. వాస్తవానికి బ్రహ్మకు ఐదు తలలు ఉండేవని బ్రహ్మ పురాణం చెబుతోంది. ఈ కథ ప్రకారం.. విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో బ్రహ్మ ఒక తలని కోల్పోయాడని తెలుస్తంది. అసలు బ్రహ్మకు ఎన్ని తలలు ? బ్రహ్మ తలల వెనక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


నాలుగు తలలతో కనిపించే బ్రహ్మకు వాస్తవానికి ఉండేది ఐదు తలలట. బ్రహ్మ పురాణం ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో.. శతరూప అనే దేవతను సృష్టించి.. ఆమెపై తీవ్ర మోహాన్ని పెంచుకున్నారు బ్రహ్మ.

బ్రహ్మను వ్యతిరేకిస్తూ.. శతరూప అన్ని వైపులకూ పరుగుపెట్టింది. అలా ఆమె వెనక పరుగెత్తే సమయంలో బ్రహ్మ ఒక్కో వైపు ఒక్కో తల ఏర్పరచుకున్నాడు. అదే సమయంలో బ్రహ్మను కంట్రోల్ చేసే యత్నంలో శిశుడు బ్రహ్మకు చెందిన పై తలను నరికేశాడు. అంతేకాదు శివుడు శతరూపను బ్రహ్మ కూతురిగా భావించాడు. తన ద్వారా రూపొందిన ఆమె బ్రహ్మకు కూతురవుతుందని భావించాడు. అందుకే ఆమెతో అలా ప్రవర్తించడం సరికాదని... నిర్ణయించుకుని.. తల నరికేశాడు. బ్రహ్మ తలను నరికేసిన తర్వాత బ్రహ్మను ఏ దేవాలయాల్లోనూ పూజించకూడదని.. శివుడు సూచించాడు.

 అందుకే కేవలం శివుడు, విష్ణువులను మాత్రమే పూజిస్తున్నాం. దాదాపు బ్రహ్మను పూజించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే శివాలయాలు, వైష్ణవాలయాలు ఉన్నాయి కానీ.. బ్రహ్మకు ఆలయం లేదు. మరో కథనం ప్రకారం బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్పవాళ్లని ఒకరికొకరు వాదించుకుంటున్న సమయంలో.. శివుడు బ్రహ్మ తల నరికేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వేదాలు చదవడం ద్వారా శివుడే.. త్రిమూర్తులలో మహోన్నతమైనవాడని గుర్తించారు. బ్రహ్మ శివుడి గురించి అవమానకరంగా మాట్లాడటం వల్ల ఆగ్రహానికి లోనైన శివుడు.. బ్రహ్మ తలను నరికేయడంతో.. బ్రహ్మకు నాలుగు తలలే కలిగి ఉన్నాడని మరో కథనం చెబుతోంది. సాధారణంగా శివుడి ఫోటోలలో ఆయన చేతిలో పట్టుకుని వెళ్లే పుర్రె బ్రహ్మ ఐదో తల అని చెబుతారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో శివుడు పుర్రెను నీళ్లు తాగడానికి ఉపయోగిస్తాడట. అలాగే పుర్రెలతో తయారు చేసిన మాల ధరిస్తాడట. ఆ పుర్రెనే శివుడు నరికిన బ్రహ్మ తలగా వివరిస్తారు. బ్రహ్మ నారీకేళ ఆవిర్భావం గురించి తెలుసుకుందాం.

 చతుర్ముఖ బ్రహ్మ ద్యాన ముద్రలో ఉండగా శిరోభాగం నుండి తేజస్సు పుట్టింది. ఆ తేజస్సు శిరో ముండనం చేయబడిన శిరస్సుగా రూపాంతరం చెందింది. దాని పైన నాలుగు నేత్రములతో నాలుగు రంధ్రాలు ఉన్నాయి. బ్రహ్మ ఆత్మజ్యోతి కిరణం ఒక రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి స్ధాపితమైంది. బ్రహ్మ నేత్రం నుండి కాలాగ్ని కిరణమొకటి ఉద్భవించి కన్నుగా స్ధాపితమైంది. శివుని ఆత్మజ్యోతి కిరణం ఒక రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి స్ధాపితమైంది. శివుని పాలభాగ నేత్రం నుండి కాలాగ్ని కిరణమొకటి మధ్య రంధ్రం పై “కన్ను”గా ఉద్భవించింది. మహావిష్ణు ఆత్మజ్యోతి కిరణం ఆ శిరస్సు ధక్షిణభాగ రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి లోపల స్ధాపితమైంది. శివుని సూర్య నేత్రం నుండి కిరణం ఒకటి అవతరించి దక్షిణ భాగ రంధ్రం పై “కన్ను”గా స్ధాపితమైంది.

 శివుని చంద్ర నేత్రం నుండి కిరణం ఒకటి అవతరించి వామభాగ రంధ్రం పై “కన్ను” గా స్ధాపితమైంది. శాకంబరీ దేవి ఆత్మకిరణం వామ రంధ్రం ద్వారా లోపలకి ప్రవేశించి తెల్లని తియ్యని భక్ష్యంగా రూపొందింది. ఆ పధార్ధం మధ్యన పవిత్ర గంగాజలం ఉద్భవించింది. బ్రహ్మ, శివ, విష్ణు, శక్తిల ఆత్మతేజం  చతుర్ముఖ ముద్రలతో గంగాజలంతో నింపబడిన శిరోఫలం బ్రహ్మ నారికేళంగా అవతరించింది. ఈవిధంగా నారీకేళం ఉద్భవించింది

 బ్రహ్మ  నారికేళం పరమ పవిత్రం. దీని దర్శనం సామాన్యులకు దుర్లభం. దీని స్పర్శ మూడులకు భక్తి హీనులకు కడు దుర్లభం. సర్వవర్గముల వారు, సర్వ జాతుల, వర్ణముల వారు “బ్రహ్మ నారికేళాన్ని” నైవేద్యఫలంగాను, పూజా పునస్కారమందు ఏర్పరచే కలశము నందు దేవతా రూపంగా ఉపయోగపడే సర్వశ్రేష్ఠ ఫలంగా “బ్రహ్మ నారికేళాన్ని” పూజించి, పూజా మందిరంలో పూజించుకునే వారికి త్రిమూర్తుల అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం త్రిమూర్తుల రక్షణ, వ్యవహార విజయం, ఐశ్వర్య, ధాన్య, సంతాన, సౌభాగ్య సంపదలు సమకూరేలా వరాన్ని అనుగ్రహిస్తారు.

బ్రహ్మ నారికేళం సాక్షాత్ బ్రహ్మ స్వరూపం. శివుని శాప కారణంగా బ్రహ్మకు దేవాలయాలు ఉండవు. ఆలయాలు లేని కారణంగా బ్రహ్మను పూజించే అవకాశం తక్కువగా ఉండేది. ఇలాంటి అవకాశం లేని కారణంగా చతురాక్షిగా నారికేళం ఉద్భవించింది. శివుని శాప కారణంగా ఐ బ్రహ్మ నారీకేళాలు చాలా అరుదుగా లభిస్తాయి.

 ఉదయాన్నే స్నానం చేసిన తరువాత బ్రహ్మ నారికేళాన్ని శుభ్రమైన నీటితో గాని, గంగా జలంతో గాని కడిగి పసుపు, కుంకుమ, చందనములతో నారికేళాన్ని అలంకరించాలి. రాగి పాత్ర(చెంబు) గాని, అష్టలక్ష్మి పాత్ర గాని తీసుకొని బియ్యముతో ఆపాత్రని నింపి నారికేళానికి పలుచటి పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని చుట్టి పాత్రపైన ప్రతిష్టించాలి. బ్రహ్మనారికేళానికి పూలు, అక్షింతలతో విష్ణు సహాస్త్రనామంతోను, లలిత సహాస్త్రనామంతోను పూజ చేయాలి. ఈ పూజలో శివలింగాలు, సాలగ్రామాలకు కూడ పూజ చేయవచ్చు. బ్రహ్మ  నారికేళాన్ని సోమవారం  గాని, మహాశివరాత్రి రోజులలో గాని, అమావాస్య, పౌర్ణమి, గ్రహణం రోజున గ్రహణ సమయంలో  దీపావళి రోజులలో గాని విశిష్ట పూజ చేస్తే అద్భుత ఫలితాలు పొందుతారు. 

 శ్రీ బ్రహ్మ గాయత్రి మంత్రం "ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ దీమహి తన్నో బ్రహ్మ: ప్రచోదయాత్" అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ బ్రహ్మ నారికేళాన్ని పూజించేవారికి బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.

బ్రహ్మ జ్ఞానం కలగటం అనేది చాలా కష్టమైన పని. అట్లా అంత కష్టపడి సాధించాల్సిన అవసరం ఏముంది అనే సందేహం రావచ్చు. ఎందుకు బ్రహ్మ జ్ఞానం కావాలి, దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఈ మంత్రం తెలుపుతుంది.

 స పర్యగా చ్ఛుక్రమకాయ మవ్రణమ్

అస్నావీరమ్ శుద్ధమపాపవిద్ధమ్ |

కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూః

యాథాతథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః ||

 ఎవడైతే బ్రహ్మ జ్ఞానం పొందుతాడో వాడు బ్రహ్మన్(పరమాత్మ) స్థాయికి చేరుతాడు. ఆ స్థితి ఎలా ఉంటుందో తెలుపుతుంది ఈ మంత్రం. బ్రహ్మన్ అంటే పరమాత్మ, ఆయన "చ్ఛుక్రమ్"- పరిశుద్ధమైనవాడు, స్వచ్చమైన వాడు. జీవుడు ముక్తి పొందాక కర్మ తొలగి ఇలాంటి స్థితిని పొందుతాడు. పరమాత్మ దయ వల్లే ఇది లభించాలి తప్ప మరొక మార్గం లేదు. "అకాయమ్" - ఆయన దేహం లేనివాడు, అంటే మన వంటి మురికి స్రవించే పాంచభౌతిక దేహం కాదు, ఆయనది పంచ ఉపషణ్మయ దివ్య మంగళ విగ్రహం . "అవ్రణమ్" - రోగాలు, వ్యాదులు అంటని శరీరం. "అస్నావీరమ్"- ప్రేగులు నరాలు ఉండే దేహం కాదు. కనుక "శుద్ధమపాపవిద్ధమ్" ఆయన దేహం పాప పుణ్యాలకు అతీతమైనది. పరమాత్మ తత్త్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడూ అట్లాంటి స్థితినే పొందుతాడు. వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు దర్శించగలుగుతాడు. కర్మ తొలగుతుంది కాబట్టి అట్లాంటి స్థితి ఏర్పడుతుంది, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరానికి హద్దులు ఎన్నో. మనం కంటితో అన్నింటినీ గుర్తించగలమా ? మన ఇంద్రియాలకు, ఊహకు ఉన్న శక్తి సంకుచితమైనది. ముక్తి పొందిన జీవుడికీ పరమాత్మ వలె జ్ఞానం అంతటా విస్తరించి ఉంటుంది. సూక్షమైన జ్ఞానం కలిగి ఉంటాడు. వాడు జ్ఞానం కోసం తపిస్తూనే ఉంటాడు. వాడి మనస్సు పూర్తి నియంత్రణలో ఉంటుంది.  వాడికీ కోరికలు ఉంటాయి, కానీ అవి పరమాత్మ మయమై ఉంటాయి. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంటుంది. వాడికీ కోపం ఉంటుంది, ఇతరత్రమైన విషయాల యందు. అట్లాంటి వాడికి మరణం అనేది ఉండదు, ఆ స్థితినుండి దిగజారడం అనేది ఉండదు. కర్మ బంధాలు తొలగి భగవత్ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు.

 బ్రహ్మ నారీకేళం ఉన్న ఇళ్లలోని కుటుంబంపై భూత ప్రేత పిశాచాల వంటి  ఎటువంటి తాంత్రిక దుష్ప్రభావాలు పనిచేయవు. నిరంతర ఐశ్వర్యం, ఆనందం, సిరిసంపదలు కలుగుతాయి. రోగాలు, కష్టాలు దూరమవుతాయి. శివాలయంలో గాని, విష్ణు ఆలయంలోగాని బ్రహ్మ నారీకేళాన్ని దానం చేసిన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.   చదువులో వెనుకబడిన వారికి బ్రహ్మ నారికేళాన్ని శుభ్రమైన  నీటిలో ఉంచి   ఆ నీటిని త్రాగించటం  వలన అపారమైన జ్ఞానం కలుగుతుంది. ఆయువృద్ధికి, ఐశ్వర్య వృద్ధికి హేతువు ఈ బ్రహ్మ నారికేళం.  బ్రహ్మ నారికేళం ఉన్న చోట సర్వవిదాల అభివృద్ధి, సర్వకార్యసిద్ధి, జనాకర్షణ కలుగుతాయి. ఆధ్యాత్మిక దైవిక వస్తువులలో ప్రత్యేక స్ధానం పొందిన “బ్రహ్మనారి కేళాన్ని” పూజా గృహంలో ఉంచుకొని పూజించిన వారికి సర్వ సౌభాగ్యాలు మరియు ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...