8, సెప్టెంబర్ 2016, గురువారం

ద్వాదశాంశ వర్గ చక్ర విశ్లేషణ



ద్వాదశాంశ వర్గ చక్ర విశ్లేషణ

రాశిచక్రంలో ఒక్కొక్కరాశిని 12 భాగాలు చేయగా వచ్చు ఒక్కొక్క భాగమును ద్వాదశాంశ అంటారు. ద్వాదశాంశ ప్రమాణం 2°- 30' నిమిషాలు. మొత్తం 144 ద్వాదశాంశలు ఉంటాయి. ఏ రాశికి ఆ రాశి నుండే గణన ప్రారంభమవుతుంది. ద్వాదశాంశ ద్వారా తల్లి తండ్రులకు సంబందించిన విషయాలు, తల్లిదండ్రుల మధ్య వ్యత్యాసాలు, వారి కారకత్వాలను తెలియజేస్తుంది. వంశ వృక్షాన్ని సూచిస్తుంది. తల్లిదండ్రులతో వ్యక్తి సంబంధాలు ఎలా ఉంటాయో సూచించును. వంశపారంపర్య వ్యాధులు, తల్లిదండ్రుల క్షేమ సమాచారం, తల్లిదండ్రుల కష్టాలు, మరణాలకు సంబందించిన కారణాలు తెలుసుకోవచ్చును. క్రితం జన్మ మరియు రాబోవు జన్మ స్మృతులను, జ్ఞాపకాలను తెలుసుకోవటం లేదా గుర్తుకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. 


గణేష ద్వాదశాంశ :- గణేష ద్వాదశాంశలో గ్రహాలు ఉంటే (0°- 0' నుండి 2°- 30' మద్యలో గ్రహాలు ఉన్న; 10°-00'  నుండి 12°-30' మద్యలో గ్రహాలు ఉన్న; 20°-00' నుండి 22°- 30' మద్యలో) ఆధ్యాత్మిక విజ్ఞానం, ఆధ్యాత్మిక అభివృద్ధి, శారీరక ఇబ్బందులు, మంచి విద్య, తల్లిదండ్రుల సహాకారాల గురించి తెలుసుకోవచ్చును. 

అశ్వనికుమార ద్వాదశాంశ :- అశ్వనికుమార ద్వాదశాంశలో గ్రహాలు ఉంటే (2°-30' నుండి 5°- 00' మద్యలో గ్రహాలు ఉన్న; 12°-30'  నుండి 15°-00' మద్యలో గ్రహాలు ఉన్న; 22°-30' నుండి 25°- 00' మద్యలో) తల్లిదండ్రుల క్షేమ సమాచారాలు, వారి రక్షణ అంశాలను సూచిస్తుంది. ఈ ద్వాదశాంశలో ఏదైన గ్రహం ఉంటే తల్లిదండ్రులకు శుభాన్ని ఇస్తుంది.  

యమ ద్వాదశాంశ :- యమ ద్వాదశాంశలో గ్రహాలు ఉంటే (5°-00' నుండి 7°- 30' మద్యలో గ్రహాలు ఉన్న; 15°-00'  నుండి 17°-30' మద్యలో గ్రహాలు ఉన్న; 25°-00' నుండి 27°- 30' మద్యలో) తల్లిదండ్రులు, బంధువులు దూరం కావటం లేదా పోగొట్టుకోవటం సూచించును. శ్రాద్ధ కర్మలను కూడా సూచించును. తల్లిదండ్రుల, పూర్వీకుల కర్మలను తెలియజేస్తుంది.

సర్ప ద్వాదశాంశ :- సర్ప ద్వాదశాంశలో గ్రహాలు ఉంటే (7°-30' నుండి 10°- 00' మద్యలో గ్రహాలు ఉన్న; 17°-30'  నుండి 20°-00' మద్యలో గ్రహాలు ఉన్న; 27°-30' నుండి 30°- 00' మద్యలో) విషప్రయోగాలు, పాముకాటుకు సంబంధించిన విషయాలు, తనకుతాను నాశనం కావటం, ఎల్లప్పుడు అన్నీ విషయాలలో తప్పులు చేయుట సూచించును. 

ద్వాదశాంశ వర్గ చక్రంలోని నవమాధిపతికి, రాశి చక్రములోని లగ్నాధిపతికి సంబంధాన్ని బట్టి జాతకుడికి తండ్రికి గల అన్యోన్య సంబంధమును తెలుసుకోవచ్చును. 

ద్వాదశాంశ వర్గ చక్రంలోని చతుర్ధాధిపతికి, రాశి చక్రములోని లగ్నాధిపతికి సంబంధాన్ని బట్టి జాతకుడికి తల్లికి గల అన్యోన్న సంబంధమును, ప్రేమాభిమానాలను తెలుసుకోవచ్చును. 

ద్వాదశాంశ వర్గ చక్రంలోని లగ్నాధిపతికి, రాశి చక్రములోని లగ్నాధిపతికి సంబంధాన్ని బట్టి జాతకుడు తల్లిదండ్రులపైనా చూపించే మర్యాద, ప్రవర్తన, జాలి, కరుణ, మొదలగు విషయాలు తెలుసుకోవచ్చును. 

 ద్వాదశాంశ వర్గ చక్రంలోని ద్వితీయ, సప్తమ, అష్టమాధిపతుల దశ, అంతర్ధశలలో తల్లిదండ్రులకు శస్త్రచికిత్స జరుగు అవకాశం ఉంటుంది. రాహువు ద్వాదశాంశ వర్గ చక్రంలోని నవమస్ధానం, లేదా చతుర్ధస్ధానం పైన సంచరిస్తున్నప్పుడు తల్లికి లేదా తండ్రికి మరణతుల్య కష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. 

ద్వాదశాంశ వర్గ చక్రంలోని షష్ఠాధిపతికి కుజ సంబంధం ఉండి నవమాధిపతి లేదా రవితో సంబంధం ఉన్న, చతుర్ధాధిపతి లేదా చంద్రునితో సంబంధం ఉన్న వాటి యొక్క దశ అంతర్దశలలో తల్లిదండ్రులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 

రాశిచక్రంలోని నవమాధిపతికి, ద్వాదశాంశ వర్గచక్రంలోని నవమాధిపతికి ద్వాదశాంశ వర్గచక్రంలో ఉన్న సంబంధాన్ని బట్టి తండ్రి యొక్క ధైవభక్తి, పుణ్యబలం, ఆచారాలు మొదలగు విషయాలు తెలుసుకోవచ్చును. 

 రాశిచక్రంలోని లగ్నాధిపతి, పంచమాధిపతుల సంబంధం ద్వాదశాంశ వర్గచక్రంలో ఉంటే తండ్రిద్వారా మంత్రోపదేశము స్వీకరించవలెను మరియు సలహాలు తీసుకోవలెను. 

 రాశిచక్రంలోని నవమాధిపతి, ద్వాదశాంశ వర్గచక్రంలోని నవమాధిపతికి ద్వాదశాంశ వర్గచక్రంలో సంబంధం ఉంటే జాతకుడు గురువు ద్వారా మంత్రోపదేశము స్వీకరించవలెను.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...