మాణిక్యం (కెంపు)
మాణిక్యం స్పటిక ఆమ్ల జాతికి చెందిన రత్నం. అత్యంత విలువైన ఈ రత్నాన్ని పద్మరాగమణి, మాణిక్యం, కెంపు అని కూడా అంటారు. మాణిక్యమణిని సూర్యగ్రహానికి ప్రతిరూపంగా చెబుతారు. బృహత్సంహితలో మాణిక్యమణి మూడు రకాలుగా లభిస్తుందని తెలియజేయబడింది. గంధకం, కురువిందం, స్పటికాలలో ఉద్భవిస్తుందని చెప్పబడింది. గంధకం నుండి పుట్టినవి పెళుసుగాను, కురువిందం నుండి పుట్టినవి కాంతిహీనంగాను, స్పటికం నుండి పుట్టినవి స్వచ్చంగా, కాంతివంతంగా ఉంటాయని చెప్పటం జరిగింది. మాణిక్యమణిని అత్యదిక వేడి వద్ద వేడి చేసినను ఆకుపచ్చరంగులోకి మారి చల్లారిన తరువాత సహజ సిద్ధమైన రంగులోకి మారుతాయి. రత్నపరీక్ష గ్రంధం ఆదారంగా మనకు ప్రకృతిలో ఆరు రకాల కెంపులు లభ్యమవుతాయి.