12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

శుక్రహోర

శుక్రహోర

శుక్ర హోరకు అథిపతి శుక్రుడు.శుక్ర వారము లేదా చంద్రుడు భరణి,పూర్వ ఫల్గుణి,పూ ర్వాషాఢ నక్షత్రములలో సంచరిస్తున్నప్పుడు శుక్రహోరా సమయములో శుక్రుని ప్రభావము చాలా అథికముగా ఉంటుంది.
శుక్రవారం శుక్రహోరలో కఠిన హృదయాలు సైతం కరుణ,ప్రేమతో నిండే సమయము.ఎవరైనా కోపిష్టి. మూర్ఖుడు, కఠినుడు అయిన వ్యక్తిని కలవడానికి శుక్రహోరను ఎన్నుకోండి.ఆ సమయములో మీరు చెప్పిన విషయాన్ని స హనముతో వింటారు.మీకు శాంతముగా సమాథానము ఇస్తాడు.

పెళ్ళి చూపులకు శుక్రహోర సమయము ఉత్తమమైనది.నగలు,పట్టు చీరలు,రత్నాలు, గంథము,గ్లాసు,సుగంథ ద్రవ్యములు,అలంకరణ వస్తువులు కొనడానికి మంచి సమయము.అలా గే విలాసవంతమైన వస్తువులు, వాహనము కొనడానికి,సినిమా థియేటర్లు,స్టూడియోలు,సంగీత కళాశాలలు.పాఠశాలలు,కళాశాలలు శుక్రవారముశుక్రహోరలో ప్రారంభించుట శుభదాయకము.


తోళ్ళు,చర్మముతో కూడిన పరిశ్రమలు లేదా సంస్థలు,అనాథ సంక్షేమ గృహాలుమొదల గునవి ప్రారంభించుటకు శనివారం శుక్రహోర చాలా అనుకూలమైన కాలము.
పాడి పరిశ్రమ (మిల్క్ డైరీ) ప్రారంభించుటకు సోమవారం శుక్రహోర చాలా అను కూల మైన సమయము.
బియ్యము,ధాన్యము,వ్యాపారానికి మంగళవారం శుక్రహోర శుభసమయము.

బిస్కట్లు,చాక్లెట్లు,పండ్లు,పూలు,కూరగాయలు,పండ్లు,పూలు,పట్టు,సిల్కుచీరలు,స్త్రీల అ లంకరణసామగ్రి,మందుల వ్యాపారాలు ప్రారంభించుటకు,హనీమూనుకు,శృంగార సల్లాపములకు బుథవారం శుక్రహోర చాలా అనుకూలమైన,ఆనందకరమైన సమయము.

తల్లీ పిల్లల హస్పిటల్,పశువుల ఆసుపత్రి, ఆదాయ పన్నుశాఖ,న్యాయము,కోర్టు వంటి వాటికి సంబంథించిన ఆఫీసులను ప్రారంభించటానికి లేదా ఆయా శాఖలలో ఉద్యోగములో చేరడా నికి గురువారము శుక్రహోర శుభ సమయము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...