27, ఏప్రిల్ 2015, సోమవారం

పరివర్తన యోగం

జాతకచక్రంలో పరివర్తన యోగం:-

పరివర్తన యోగం అంటే జాతకచక్రంలో రెండు గ్రహాలు ఆదిపత్యం వహించే రాశుల మద్య జరిగే పరివర్తననే పరివర్తన యోగం అంటారు.

ఉదా:- కన్యా రాశికి అధిపతి బుధుడు,మీన రాశికి అధిపతి గురువు, కన్యా రాశిలో గురువు,మీనరాశిలో బుదుడు ఉండటం వలన ఒకరి ఆదిపత్య రాశిలో ఇంకొకరు ఉండటం జరిగింది.దీనినే పరివర్తన యోగం అంటారు.

ఇక్కడ మీన రాశిలో బుదుడికి నీచ స్ధానం ,మరియు శత్రు క్షేత్రం అయిన కూడ బుధుడు ఆస్ధానానికి సంబందించినంతవరకు అశుభ పలితాన్ని ఇవ్వలేడు.ఎలాగంటే బుదుడు గురువు ఆదిపత్యం వహించే ఇంటిని చెడగొడితే గురువు బుధుడు ఆదిపత్యం వహించే ఇంటిని చెడగొడతాడు కాబట్టి రెండు గ్రహాలు పరివర్తన యోగం వల్ల ఆస్ధానాలలో అశుభ పలితాన్ని ఇవ్వలేవు.

,1,2,3,4,5,7,9,10,11 వీటిని శుభ స్ధానాలు అంటారు.6,8,12 అశుభ స్ధానాలు అంటారు.శుభ స్ధానాలలో పరివర్తన జరిగితే శుభ పరివర్తన కలుగుతుంది.అశుభ స్ధానాలలో పరివర్తన జరిగితే విపరీత రాజయోగం కలుగుతుంది.

1,4,7,10 కేంద్ర స్ధానాలలో పరివర్తన ,1,5,9 కోణ స్ధానాలలో పరివర్తన,2,11 ధన స్ధానాల మద్య పరివర్తన మంచి శుభాన్ని కలిగిస్తుంది.

అలాగే అగ్నితత్వ,పురుష గ్రహాలైన రవి,కుజుల మద్య, స్త్రీ గ్రహాలైన చంద్ర,శుక్ర మద్య,మరియు బుధ గురువుల మద్య పరివర్తన వస్తే మంచి శుభ పలితాన్ని ఇస్తాయి.

త్రిక స్ధానాలైన 6,8,12 రాశుల మద్య పరివర్తన వస్తే విపరీత రాజయోగం కలుగుతుంది.అయితే విపరీత రాజయోగాని కంటే ముందు ఒక అశుభం కూడ జరుగుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...