21, ఏప్రిల్ 2015, మంగళవారం

అనంత కాలసర్పదోషం

అనంత కాలసర్పదోషం.

అనంత కాలసర్పదోషం రాహువు లగ్నంలో కేతువు సప్తమంలో గ్రహాలన్నీ రాహు కేతువుల మద్య ఉంటే అనంత కాలసర్పదోషం అంటారు.

జ్యోతిష్య విద్వాంసులైతే మొత్తం 288 రకాల కాలసర్పదోషాలను వర్ణించిచెప్పాడు.వీటిలో కాలసర్పభావాల ప్రకారం 12 ముఖ్యమైనవి .

అనంత, కులిక, వాసుకి, శంఖ, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, మహాశంఖ, పతాక, విషధర, శేషనాగ అని 12 రకాల కాలసర్పయోగాల గురించి పూర్వీకులు వివరించారు. 


ఈ దోషాల పలితాలను గుర్తించేటప్పుడు మనం అనేక జ్యోతిశాస్త్ర నియమాలను కూడ పరిగణలోకి తీసుకోవాలి.
ఈ దోషం ఉన్నవారు సొంత మనుషులను కూడ నిర్ధాక్షణ్యంగా మోసం చేస్తారు.మాటను మనసులోనే ఉంచుకొని సమయం వచ్చినప్పుడు మార్చేస్తారు.ఈ దోషం ఉన్నవారు మాటలకు చేతలకు పొంతన ఉండదు.చెప్పేదొకటి చేసే దొకటి . ఈ దోషం ఉన్నవారు ఎప్పుడు ఇతరులను ఇబ్బంది పెట్టి ఆనందిస్తుంటారు.

ఇతరులను నిందిస్తూ ఉంటారు.ఆఖరికి తను చేసిన తప్పులు కూడ ఇతరులపై వేసి నిందిస్తుంటారు.చెడు వ్యామోహాలకు తొందరగా లొంగిపోతారు.ఈ దోషం ఉన్నవారు కులాంతర వివాహం చేసుకొనే అవకాశాలు ఎక్కువ.చిత్ర విచిత్రమైన కోరికలు కలిగి ఉంటారు.ఈ దోషం ఉన్నవారి వైవాహిక జీవితం సుఖవంతంగా ఉండదు.ఈ దోషం ఉన్నవారికి కామకోరికలు ఎక్కువ ఉంటాయి.ఈ దోషం ఉన్నవారు ఆత్మగౌరవాన్ని ,కీర్తిని కోల్పోతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...