9, సెప్టెంబర్ 2014, మంగళవారం

స్పటిక శ్రీయంత్రం(Crystal Sri Yantram)

స్పటిక శ్రీయంత్రం

"స్పటిక శ్రీయంత్రం" అన్ని యంత్రాల్లోకి అత్యంత శక్తి వంతమైన శ్రీ యంత్రం తనని పూజించిన వారిని ఓ రక్షా కవచంలా కాపాడుతూ వుంటుంది. దీని మహిమలను గురించి ఎన్నో ధర్మశాస్త్ర గ్రంధాలు ప్రస్తావించడం జరిగింది.
 ఈ 'శ్రీ'యంత్రాన్ని ఇంట్లో స్థాపన చేయడం వలన ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి ...


అకాల మృత్యువు బారి నుంచి అనుక్షణం రక్షణ లభిస్తుంది. అయితే ఎంతో నియమ నిష్టలను పాటించవలసి వుంటుంది. లక్ష్మీ దేవికి ఎరుపు రంగు ... శ్రీ మహా విష్ణువుకు పసుపు రంగు అంటే ప్రీతి. అందువలన స్పటిక శ్రీ యంత్ర స్థాపన కోసం, పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి. ఆ వస్త్రంలో తమలపాకులు వుంచి, వాటిపై పాలతో అభిషేకించిన స్పటిక శ్రీ యంత్రాన్ని ఉంచాలి.

పసుపు ... కుంకుమ ... అక్షితలు ... గులాబీ పూలు ... కొన్ని బియ్యం ... నీటితో నింపిన కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీనారాయణుడిని మనసారా స్మరించుకుని 2,816 మంది దేవతలు నివసించే స్పటిక శ్రీయంత్రాన్ని పూజించి, ఆ తరువాత పెరుగు - బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. 'తొమ్మిది ముఖాలు' కలిగి ఉండే ఈ స్పటిక శ్రీ యంత్రం మూడు భాగాలుగా వుంటుంది. భూపురం నుంచి అష్టదళం వరకూ ఉండేది 'సృష్టి చక్రం' ... చతుర్దశ నుంచి అంతర్దశ వరకూ వుండేది 'స్థితి చక్రం' ... అష్టార్దశ నుంచి బిందువు వరకూ వుండేది 'సంహార చక్రం' ఈ మూడు చక్రాలను కలిపి 'త్రిపుర' అంటారు ... ఆమే శ్రీ మహా త్రిపుర సుందరి.

స్పటిక శ్రీ యంత్రాన్ని దీపావళి రోజు రాత్రి పూజా మందిరంలో వుంచి 108 దీపాలు వెలిగించాలి. తామర విత్తుల మాలతో 108 సార్లు ''ఓం శ్రీం హ్రీం శ్రీ కమలవాసిన్యౌ నమః'' అనే మంత్రాన్ని పటించాలి. ఆ తరువాత ఆ యంత్రాన్ని డబ్బు పెట్టే చోట ఉంచితే ఆర్ధిక పరిస్థితి వెంటనే మెరుగు పడుతుంది.

ఇక మహిమాన్వితమైన ఈ స్పటిక శ్రీ యంత్రాన్ని పూజించడానికి .. పంచమి .. సప్తమి .. ద్వాదశి .. త్రయోదశి .. పౌర్ణమి .. తిధులు, బుధ .. గురు .. శుక్రవారాలు .., పుష్యమి .. హస్త .. ఉత్తర .. ఫల్గుణి .. స్వాతి .. రేవతి .. నక్షత్రాలు మంచివని శాస్త్రం చెబుతోంది.

 స్పటిక శ్రీయంత్రం:-200.00 To 1000.00

 పై స్పటిక శ్రీయంత్రం  కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.


Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...