2, సెప్టెంబర్ 2014, మంగళవారం

కుజదోష నివారణకు “విఘ్నహస్త ప్రవాళ గణపతి”

కుజదోష నివారణకు “విఘ్నహస్త ప్రవాళ గణపతి”

సంస్కృతంలో ప్రవాళం అంటే పగడం.పగడపు గణపతిని కుజదోషం ఉన్నవారు పూజించిన కొంతవరకు కుజదోష ప్రభావాన్ని తట్టుకునే శక్తి వస్తుంది.పగడపు గణపతిని రింగులో కుడిచేతి చూపుడు వేలుకి ధరించవచ్చును.
ప్రవాళ గణపతిని మొదటిసారిగా మంగళవారం రోజు పసుపు నీళ్ళతో శుద్దిచేసి గణపతి లేదా సుబ్రమణ్య లేదా మంగళ యంత్రం మీద గాని ప్రతిష్ఠించి “విఘ్నహర్త ప్రవాళ గణపతి ప్రీత్యర్ధం”అంటూ ఆచమనీయం,అభిషేకం,శుద్దోదక స్నానం తదితర పూజ చేస్తే కుజ దోష నివారణ జరుగుతుంది. 

ఓం గం గణపతయే సర్వ విఘ్నహరాయ సర్వాయ
సర్వ గురవే లండోదరాయ హ్రీం గం నమః

అనే మంత్రాన్ని జపించి ప్రవాళ గణపతికి ఉద్వాసన పలికి నిత్యం పూజమందిరంలో స్ధాపించుకొని పూజ చేసుకోవచ్చును.


నిజానికి – శాస్త్రప్రకారము – అన్ని లగ్నాలకీ ఈ కుజ దోషం వర్తించదు. ఇది ప్రతి సామాన్యుడు తెలిసికోవలసిన విషయం.
లగ్నమనగా శరీరము, చంద్రు డనగా మనస్సుకి సంభంధించినది. శుక్రుడు కళత్ర (భార్య)కారకుడు. అనగా భార్య కు సంభంధించిన విషయము.
ఒక జాతకంలో లగ్నం నుంచి మరియు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడనుంచీ
అలాగే శుక్రుడు ఎక్కడ వున్నా అక్కడనించి ( ఈ మూడూ వేరువేరుగా చూడాలి)
లెక్క చూడగా 1,2,4,7,8,12 గదులలో ( రాసులలో) కనుక కుజుడు ఉన్నచో ఆజాతకం లో కుజ దోషం ఉంది అనవచ్చు.


ఇందులో కొన్ని సవరణలు వున్నాయి.
పిల్లవాడిజాతకం లోనూ పిల్ల జాతకం లోనూ కుజదోషం ఉన్నప్పుడు అనగా ఒకరి జాతకంలో లగ్నం నింఛి మరొకరి జాతకం లో శుక్రుడు నించి కాని మరి ఏ ఇతర ( పైన చెప్పిన ప్రకారం) రకాలుగావున్నా కుజ దోషం సమసిపోయినట్లే! అనగా దోషం లేదు.

కర్కాటక, మీనం, ధనుస్సు, సింహం, మేషం, వృశ్చికం, మరియు మకర లగ్నాలకి అసలు కుజ దోషం పట్టింపు లేదు, కుజుడు ఉన్న రాశి లోనే గురుడు వున్నా గురుడు వున్న రాశిలో కుజుడు వున్నా – ఆ జాతకానికి కుజ దోషం లేనట్లే.

“ద్వితీయే భౌమదోషన్తు యుగ్న కన్యక యోర్వినా” అని చెప్పిన శ్లోకం దేవ కేరళ గ్రంథము నుండి పరిశీలిస్తే మిదున కన్యా లగ్నములలో పుట్టిన వారికి రెండవ ఇంటిలో కుజుడు ఉంటే దోషం ఉండదు. 

వృషభం తులలో పుట్టిన వారికి పన్నెండవ ఇంట కుజుడు ఉంటే కుజదోషం ఉండదు. మేష వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి నాల్గవ ఇంట కుజుడు వున్న దోషం ఉండదు. 

మకర కుంభ లగ్నంలో పుట్టిన వారికి సప్తమంలో కుజుడు వున్న దోషం ఉండదు. ధనస్సు మీన లగ్నంలో పుట్టిన వారికి అష్టమంలో కుజుడు వున్న దోషం ఉండదు. సింహం కుంభం లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు అని దేవకేరళ అనే గ్రంథమందలి విశేషం. 

మేష వృశ్చికములు కుజుడికి స్వక్షేత్రములు. మకరము ఉచ్ఛ కనుక ఈ లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. మృగశిర, ధనిష్ఠ, చిత్త నక్షత్రములు కుజ ఆధిపత్యం వున్న నక్షత్రములు అందువలన ఈ నక్షత్రములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. 

పుట్టిన సమయానికి కుజదశ వెళ్లిపోయినా వైవాహిక జీవిత కాలంలో కుజ మహాదశ రాదు అనినా కుజదోషం పరిధిలోకి తీసుకోనవసరం లేదు. చంద్ర మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. గురు మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. కుజుడు నీచంలో ఉంటే కుజదోషం ప్రభావం అతితక్కువ.

కుజుడు దోషంగా ఉంటే పెళ్లి కాకుండా చేయడు. కలహకారుడు కుజుడు. వైవాహిక జీవితంలో కలహాలు తెస్తాడు. కళత్ర కారకుడు శుక్రుడు, కలహకారుడు కుజుడు పది డిగ్రీలలో కలిస్తే కుజదోషం ఉండదు. కానీ అటువంటి జాతకులకు వైవాహిక జీవితంలో కలహ కాపురం తప్పదు. ఒకవేళ వివాహమైన తరువాత ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి విషయంగా కుజదోషం లేకపోతే వారు " విఘ్నహస్త ప్రవాళ గణపతి" ఆరాధనలు నిత్యం చేస్తే కుజదోష ప్రభావం తట్టుకునే శక్తి వస్తుంది.

 విఘ్నహస్త ప్రవాళ గణపతి:-150.00 To 1000.00

 పై స్వస్తిక్ కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.
Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...