13, ఆగస్టు 2014, బుధవారం

పాదరస దుర్గాదేవి(Parad Durgadevi)

పాదరస దుర్గాదేవి

పాదరస విగ్రహాల పూజ ఇతర విగ్రహాల పూజల కంటే 1000 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి.జాతకచక్రంలో బుధ,రాహు గ్రహా దోషాలు ఉన్నవారు పాదరస దుర్గాదేవిని పూజించిన ఉపశమనం కలుగుతుంది.


పాదరస దుర్గాదేవి విగ్రహాన్ని పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రం పరిచి దానిపైన పాదరస దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్టింపచేయాలి.ఎరుపు రంగు పూలతో దుర్గాదేవి విగ్రహాన్ని అలంకరించాలి.


పాదరస దుర్గాదేవిని రాగి,ఇత్తడి,వెండి,బంగారం ప్లేట్లపై ప్రతిష్టించేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని ఆ ప్లేట్లపై తప్పనిసరిగా ఉంచాలి.లేనిచో పాదరసం ఆ ప్లేటు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

నేతి దీపంతో దీపారాధన చేస్తే చాలా మంచిది.అగరబత్తీతో దూపం చూపించాలి.పాదరస దుర్గాదేవి విగ్రహానికి "దుర్గాసప్తశ్లోకి " చదువుతూ  కుంకుమార్చన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.

"ఓం హ్రీం దుర్గే పారదేశ్వరీ సర్వార్ధ సిద్ధం" అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించాలి. 

పాదరస దుర్గాదేవిని పూజించిన వారికి దురదృష్టకర ప్రమాదాల బారినుండి రక్షింపబడతారు.
శత్రుభాధల నుండి విముక్తి కలుగుతుంది.
చెడుకలలు రాకుండా ఉంటాయి.మోసం,భ్రమ,అత్యాశ,దుఃఖము మొదలగు వాటివలన కలుగు ఇబ్బందులను తొలగిస్తుంది.
చెడుదృష్టి,దీర్ఘకాల అనారోగ్యం,రాహుగ్రహా భాధల నుండి విముక్తి కలుగుతుంది.

ఇంటిలో నైరుతి దిక్కు దోషాలు ఉన్నవారు పాదరస దుర్గాదేవిని పూజించిన ఆ దిక్కు దోషాల వలన కలుగు ఇబ్బందులు తొలుగుతాయి.
పాదరస దుర్గాదేవిని పూజించిన రుణభాదలు తొలిగి ధనాభివృద్ధి కలుగుతుంది.పాదరస దుర్గాదేవిని వ్యాపారస్ధలంలో ఉంచి పూజించిన వ్యాపారాభివృద్ధి,ధనాభివృద్ధి,గౌరవాలు లభిస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...