ఏలినాటి
శని ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోవాలంటే ప్రతిరోజూ అన్నం తినేముందు
కొంత భాగం కాకులకు వేయండి. ఇనుము, పెనం, సారాయి, నూనె దానం చెయ్యండి.
రొట్టెముక్కల మీద నువ్వులనూనె వేసి, వీధి కుక్కలకు రాత్రిపూట ఆహారంగా
పెడుతుంటే శనిగ్రహ దోషాలకు నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు
అంటున్నారు.
ఏ లగ్నంవారికైనా, శనిగ్రహస్థితి బాగాలేకపోతే ప్రతినిత్యం మూడుసార్లు అంటే ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో కాలభైరవ స్తోత్రం పఠించాలి. పూర్తిగా నల్లని రంగు గల గుర్రం కాలికి కట్టిన నాడా తీసికొచ్చి, నువ్వులనూనెతో అభిషేకం చేసి శనిస్తోత్ర పఠనం చేసి, ఇంటి గుమ్మానికి కాని, తలుపుకుకానీ కొట్టడం శనిగ్రహ ప్రభావాన్ని తప్పిస్తుంది.
నల్ల నువ్వులు 8 సంఖ్య కొలత గల ఇనుము లేదా స్టీలు అరిటాకులో పోసి దక్షిణ తాంబూలాలు పెట్టి శనిగ్రహాన్ని విధివిధానంగా పూజించి, మధ్యాహ్నం ఒక గంటా, ఒక గంటా 3 నిమిషాల మధ్య నడివయస్సు బ్రాహ్మణుని ఆహ్వానించి పాద ప్రక్షాళ చేసి నమస్కరించి, పశ్చిమదిక్కుకు తిరిగి దానం చేయండి.
అలాగే నువ్వుండలు పిల్లలకు పంచడం, ఆవాలు కలిపిన గేదె పెరుగన్నం పెట్టడం కూడా శనిగ్రహ దోష నివారణలో ఒకటి. కాగా, శనిగ్రహానికి అధిష్టాన దైవం శ్రీ వేంకటేశ్వరుడు. శనివార నియమం పాటిస్తూ.. ప్రతిదినం ఆ స్వామిపూజ అభిషేకం చేయడం వల్ల శనిగ్రహదోశ నివారణ జరుగును.
ఇకపోతే.. ఇనుము లేదా స్టీల్ బిందెతో శుద్ధ జలాన్ని నింపి, అందులో నల్లనువ్వులు, మినుములు, నల్ల ఉమ్మెత్త వేర్లు, దర్భలు జమ్మి ఆకులు వేసి ఉంచాలి. ధనురాకారపు ముగ్గువేసి దానిపై దర్భలు పరచి ఈ బిందెలుంచాలి.
ఓం ఐం హ్రీం శ్రీ శనైశ్చరాయ నమః
ఓం భ్రాం భ్రీం భ్రౌం సః శనయే నమః
అనే శనిగ్రహస్తోత్ర మంత్రాన్ని పఠించి, ఈ బిందెలోని నీళ్ళతో శిరఃస్నానం చేయాలి. ప్రతి శనివారం ఇలా చేస్తే శనిగ్రహదోష నివారణ జరుగుతుంది. అలాగే శనిబాధా నివారణకు దగ్గర్లో గల ఆంజనేయుని దేవాలయాల్లో ప్రదక్షిణలు హనుమాన్ చాలీసా పఠనం, విఘ్నేశ్వరుని శరణువేడినా శనిబాధ పటాపంచలు కావడం తథ్యం.
ప్రతి శనివారం గరికెతో గణపతిని పూజించడం కూడా మంచిది. ఇంకా ప్రతి శనివారం సాయంసంధ్య వేళలో రాగి ప్రమిదలో ఆవునెయ్యి, ఆముదం, నువ్వుల నూనెల మిశ్రమంతో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి నమస్కరించినా శనిగ్రహ దోషాల నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి