23, మార్చి 2016, బుధవారం

కుబేర దీపం

కుబేర దీపం

జాతకచక్రంలో బుధుడు మీనరాశిలో నీచలో ఉన్న, అస్తంగత్వం చెందిన, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న శుభగ్రహ దృష్టి లేని శత్రు స్ధానాలలో ఉన్న తెలివితేటలు తక్కువగా ఉండటం, చదువులో రాణించలేక పోవటం, వ్యాపారంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కోవటం, తన మనసులోని భావాలను బయటకు వ్యక్త పరచలేక పోవటం, ఇతరుల దగ్గర ఏది మాట్లాడిన తప్పుగా అర్ధం చేసుకోవటం. బుద్ధి నిలకడ లేకపోవటం, చర్మవ్యాదులు, ఫిట్స్, నరాల బలహీనత, చెవుడు, నపుంశకత్వం, నిద్ర పట్టక పోవటం జరుగుతుంది. ఇలాంటి వారు పచ్చ కర్పూరంతో కుబేర దీపాన్ని వెలిగిస్తే బుధగ్రహ దోషాలను తొలగించుకోవచ్చును.

వాస్తు శాస్త్రం రీత్యా ఉత్తరం దిక్కు బుధుడికి చెందిన దిక్కు అని, ఉత్తరం కుబేర స్ధానంగా భావిస్తారు. ఉత్తర దిక్కు వాస్తు దోషాలు ఉన్నవారికి ఎప్పుడు చేతిలో డబ్బు నిలవక పోవటం, మానసికంగా ఎప్పుడు సమస్యలను ఎదుర్కోవటం జరుగుతుంది. డబ్బు లేక దుర్భర పరిస్ధితి అనుభవిస్తున్న వారు పచ్చ కర్పూరంతో కుబేర దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించాలి.

గ్రహ గతులు సమగ్ర పరిశీలన

గ్రహ గతులు సమగ్ర పరిశీలన

భూమి పైన ఉండి గ్రహాలను పరిశీలించినప్పుడు కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన గతులు (చలనాలు) ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చలనాలు అన్నీ తారాగ్రహాలకు మాత్రమే ఉంటాయి. తారాగ్రహాలంటే తారల్లాగా కనబడే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శనిగ్రహాలు. రవి, చంద్ర గ్రహాలు బింబగ్రహాలు. వీటికి ఋజుగతి మాత్రమే ఉంటుంది. రాహు, కేతువులు ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటాయి. మిగిలిన ఐదు తారాగ్రహాలకు మాత్రమే ప్రత్యేకమైన గతులు ఉంటాయి.

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

గృహారంభ సమయం, భూపరీక్షా విధానం

గృహారంభ సమయం, భూపరీక్షా విధానం

మత్స్య పురాణంలో గృహ నిర్మాణాలు ఏ మాసంలో చేస్తే ఏ ఫలితమో కూడా సూతుడు పేర్కొన్నాడు.

గృహారంభానికి చైత్ర మాసం వ్యాధి ప్రదం; వైశాఖ మాసం ధన, రత్న ప్రదం; జ్యేష్ఠం మృత్యుకరం; ఆషాఢం భృత్య, రత్న, పశువృద్ధికరం; శ్రావణం భృత్య, లాభం; భాద్రపదం హానికరం; ఆశ్వయుజం పత్నీ నాశకరం; కార్తీకం ధన, ధాన్య వృద్ధికరం; మార్గశిరం అన్న వృద్ధికరం; పుష్యం చోర భయప్రదం; మాఘం బహులాభ దాయకం; ఫాల్గుణం కాంచన బహుపుత్ర ప్రధమని సూతుడు చెప్పాడు.

18, ఫిబ్రవరి 2016, గురువారం

జాతకచక్రంలో సంతాన స్ఫుట నిర్ణయం



జాతకచక్రంలో సంతాన స్ఫుట నిర్ణయం 


సంతాన కలుగక సమస్యలు అనుభవిస్తున్న దంపతుల జాతకాలను పరిశీలించి వారికి సంతానం సమస్యలు ఉన్నది లేనిది  సంతాన స్ఫుటం ద్వారా నిర్ణయించవచ్చును. దంపతుల జాతకచక్రములలోని గ్రహ స్ఫుటాలను వేరు వేరుగా తీసుకోవాలి. స్త్రీ జాతకచక్రం ఆధారంగా వేసే స్ఫుట నిర్ణయాన్ని “క్షేత్రస్ఫుటం” అంటారు. పురుష జాతకచక్రం ఆధారంగా వేసే స్ఫుట నిర్ణయాన్ని “బీజస్ఫుటం” అంటారు. స్ఫుటం 360° డిగ్రీల కంటే ఎక్కువ వస్తే వచ్చిన స్ఫుటం నుండి 360° తీసివేయాలి. క్షేత్రస్ఫుటం లో క్షేత్రం అనగా “గర్భం” నిలిచి ఉండే స్ధానం. బీజ స్ఫుటంలో బీజం అనగా “వీర్యం” అంటారు. బీజ, క్షేత్ర స్ఫుటములపైన, బీజ, క్షేత్ర స్ఫుట స్ధానముల నుండి పంచమ స్ధానం పైన పాపగ్రహాల, నపుంసక గ్రహాల దృష్టి ,యుతి లేక పోవటం మంచిది. బీజ, క్షేత్ర స్ఫుటములపైన గురుదృష్టి,,యుతి. ఉండటం మంచిది. గోచారంలో బీజ, క్షేత్ర స్ఫుటములపైన గురు సంచారం గాని, దృష్టి గాని ఉన్నప్పుడు సంతానం కలగటానికి మంచి సమయంగా గుర్తించాలి.

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

భృగుషట్క దోషము

భృగుషట్కదోషము

జన్మలగ్నాత్తు శుక్రుడు ఆరవస్థానములో ఉంటే దానిని భృగుషట్కదోషము అంటారు.ఈ భృగుషట్కదోషము వలన శుక్రుడు సత్ఫలితములు ఇవ్వలేడు.

మర్మావయవములకు సంబంథించిన వ్యాథులు,భార్యతో సుఖించ లేకపోవడం, సంసారములో అన్యోన్యత లేక పోవడము,సంసార విషయాలు రచ్చకెక్కడం, నలుగురికి తెలియడము,అవమానాలు పాలుకావడం, తీర్పులు, పంచాయితీలు, ఇందువల్ల మరిన్ని కష్టాలు ఏర్పడుట సంభవించును.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...