5, మే 2016, గురువారం

గురువింద గింజలు

గురువింద గింజలు

గురువింద గింజలను “గౌడియ వైష్ణవులు” రాధా రాణి మొక్క పాద ముద్రలుగా పూజించేవారు. వీరు ఈ గింజలను “సాలగ్రామ” పూజలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. తమిళ సిద్ధులు గురువింద గింజలను పాలల్లో మరగబెట్టిన తరువాత అధిక ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు దానిలో ఉన్న విష లక్షణాలు కలిగించే ప్రోటీన్స్ గుణాన్ని కోల్పోయే విధంగా చేసి ఉపయోగించేవారు. గొప్పలు చెప్పుకొని ఎదుటి వాళ్ళను అవమానించే వాళ్ళను గురువింద గింజలతో పోలుస్తారు.

గురువింద గింజ తన కింద నలుపు ఎరుగదని శాస్త్రం. పూర్వ కాలంలో గురువింద గింజలను బంగారం తూకం వేయటానికి ఉపయోగించేవారు.

29, ఏప్రిల్ 2016, శుక్రవారం

హీరా శంఖు

హీరా శంఖు

"హీరా శంఖు" లు చాలా అరుదుగా లభిస్తాయి. హీరా శంఖునే ‘పహాడి శంఖు’ అని కూడా అంటారు. ఈశంఖు కొన్ని మిలియన్ సంవ త్సరాలకు శిల రూపంలోకి మారి నవరత్నాలు అంతర్గతంగా పొందు పరచనట్టుగా ఉంటుంది. హీరాశంఖు దక్షిణావృత శంఖుతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. హీరా శంఖుని పూజించే వారికి మంచి భవిష్యత్, అదృష్టం కలసి వస్తాయి. పర్వత ప్రాంతాలలో సహజసిద్ధంగా లభిస్తుంది. హీరా శంఖును పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం తో పాటు, ఊహించనంత ఐశ్వర్యం కలుగుతాయి. ఇది పైకి కనపడటానికి సాదారణంగా ఉన్న లోపల నవరత్న కాంతులతో వజ్రం వలె సహజ సిద్ధంగా మెరుస్తూ ఉంటుంది.

3, ఏప్రిల్ 2016, ఆదివారం

అధ్యాత్మిక దైవిక వస్తువులు గ్రంధం

అదృష్టం, ఆరోగ్యం, అభివృద్ధి, ఐశ్వర్యం, కీర్తిపతిష్టలను అనుగ్రహించే “అధ్యాత్మిక దైవిక వస్తువులు”
శ్రీ "షిర్డి సాయినాధుని" కృపాకటాక్షాలతో "బ్రహ్మశ్రీ దైవజ్ఞ లక్కావఝ్జుల సుబ్రమణ్య సిద్ధాంతి" గారి ఆశీర్వచనాలతో, రచయితలను గౌరవాలతో మంత్రముగ్ధులను చేసే "మోహన్ పబ్లిషర్స్" అధినేత ఆకుల రామచంద్రరావు గారి సహకారంతో "నేరెళ్ళ రాజశేఖర్" అను నేను శ్రీ సాయి జ్యోతిష్య కేంద్రం అనే మా సంస్ధ తరుపున అనేక గ్రంధాలలో దాగి ఉన్న, అనుభవ పూర్వకంగా తెలుసుకున్న “ఆధ్యాత్మిక దైవిక వస్తువులు” అనే దైవిక వస్తువుల రహస్యాలను విశదీకరించు గ్రంధం రచించటం జరిగింది.

23, మార్చి 2016, బుధవారం

కుబేర దీపం

కుబేర దీపం

జాతకచక్రంలో బుధుడు మీనరాశిలో నీచలో ఉన్న, అస్తంగత్వం చెందిన, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న శుభగ్రహ దృష్టి లేని శత్రు స్ధానాలలో ఉన్న తెలివితేటలు తక్కువగా ఉండటం, చదువులో రాణించలేక పోవటం, వ్యాపారంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కోవటం, తన మనసులోని భావాలను బయటకు వ్యక్త పరచలేక పోవటం, ఇతరుల దగ్గర ఏది మాట్లాడిన తప్పుగా అర్ధం చేసుకోవటం. బుద్ధి నిలకడ లేకపోవటం, చర్మవ్యాదులు, ఫిట్స్, నరాల బలహీనత, చెవుడు, నపుంశకత్వం, నిద్ర పట్టక పోవటం జరుగుతుంది. ఇలాంటి వారు పచ్చ కర్పూరంతో కుబేర దీపాన్ని వెలిగిస్తే బుధగ్రహ దోషాలను తొలగించుకోవచ్చును.

వాస్తు శాస్త్రం రీత్యా ఉత్తరం దిక్కు బుధుడికి చెందిన దిక్కు అని, ఉత్తరం కుబేర స్ధానంగా భావిస్తారు. ఉత్తర దిక్కు వాస్తు దోషాలు ఉన్నవారికి ఎప్పుడు చేతిలో డబ్బు నిలవక పోవటం, మానసికంగా ఎప్పుడు సమస్యలను ఎదుర్కోవటం జరుగుతుంది. డబ్బు లేక దుర్భర పరిస్ధితి అనుభవిస్తున్న వారు పచ్చ కర్పూరంతో కుబేర దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించాలి.

గ్రహ గతులు సమగ్ర పరిశీలన

గ్రహ గతులు సమగ్ర పరిశీలన

భూమి పైన ఉండి గ్రహాలను పరిశీలించినప్పుడు కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన గతులు (చలనాలు) ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చలనాలు అన్నీ తారాగ్రహాలకు మాత్రమే ఉంటాయి. తారాగ్రహాలంటే తారల్లాగా కనబడే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శనిగ్రహాలు. రవి, చంద్ర గ్రహాలు బింబగ్రహాలు. వీటికి ఋజుగతి మాత్రమే ఉంటుంది. రాహు, కేతువులు ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటాయి. మిగిలిన ఐదు తారాగ్రహాలకు మాత్రమే ప్రత్యేకమైన గతులు ఉంటాయి.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...