శనిగ్రహ దోష నివారణకు నల్ల పసుపు జాతకంలో శనిగ్రహ దోష నివారణకు నల్ల పసుపు చాలా బాగ ఉపయోగ పడుతుంది. నల్ల పసుపు అనేక దుష్ప్రభావాలను అరికడుతుంది.నల్లపసుపు ని "కృష్ణ హరిద్ర"అని అంటారు.
నల్లపసుపు తాంత్రిక విధానంలో ధనవృద్ధి కారక వస్తువుగా ఉపయోగపడుతుంది.నల్ల పసుపు తాంత్రిక, వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన పసుపు. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ మరియు నేపాల్ లోను లభిస్తుంది.



