ఔషద ఆకులు (Sage Leaves)
సాల్వియా
జాతికి చెందిన తులసి మరియు పుదీనా కుటుంబానికి చెందిన సువాసన, సుగంధ ద్రవ్యాలకు మరియు సాంప్రదాయ
మూలికా ఔశదంగా ఈ ఆకులు ఉపయోగపడుతున్నాయి. సేజ్ అనే ఈ మూలిక ఆకులు ఈజిప్షియన్, రోమన్, గ్రీకు,
అమెరికన్ వైద్య సాంప్రదాయంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. భారత దేశంలోని కొన్ని జాతుల వారు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించేవారు.
కొండ ప్రాంతంలో జీవించే కొన్ని జాతుల వారు హాని కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్ క్రిముల నుండి ఉపశమనం పొందటానికి ఈ ఆకులను ఎండబెట్టి ధూపం వేసి శరీరాన్ని హానికర క్రిముల నుండి రక్షించుకునేవారు. అంతే కాక శరీరంలో కలిగే అనేక రకాల నొప్పులకు ఈ ఆకులు ఉపశమనం కలిగిస్తాయని నమ్మేవారు.