30, ఏప్రిల్ 2021, శుక్రవారం

నక్షత్రాలలో రోగారంభం - రోగం ఉండే రోజులు.

కృత్తికాసు యదా కశ్చిజ్జ్వరాది ప్రతిపద్యతే

నవరాత్రం తదాపీడా త్రిరాత్రం రోహిణీషుచ

మృగశీర్షే పంచరాత్ర మార్ద్రా ప్రాణ భయం తధా

పునర్వ సూచ పుస్యశ్చ సప్తరాత్రం విధీయతే

నవరాత్రం తధా శ్రేషాః శ్మశానంతం మఘాసుచ

ద్వేమాసౌ ఫల్గునీచైవ హోత్తరాసు త్రిపంచకమ్

హస్తేన జాయతే పక్షం చిత్తాచైవార్ధమాసకమ్

మాసద్వయం తధా స్వాతీ విశాఖే పంచ వింశతిః

అనూరాధ దశ ప్రోక్తా జ్యేష్ఠా చైవార్ధా మాసకమ్

మూలేచ జాయతే మోక్షః పూర్వాషాడ స్త్రీ పంచకమ్

ఉత్తరే దినా వింశత్యా ద్వేమాసౌ శ్రావణే తధా

ధనిష్ఠాయా మర్ధమాసో వారుణేచ దశాహకమ్

పూర్వాభాద్ర పడేమోక్ష ఉత్తరాసు త్రిపంచకమ్

రేవతీ సప్తరాత్రంచ హ్యాహోరాత్రం తధాశ్వినీ

భరణీ తత్ క్షణేనైవ మరణంటు నసంశయః

8, ఏప్రిల్ 2021, గురువారం

నామ నక్షత్రం తెలుసుకునే పద్దతి

నామ నక్షత్రం తెలుసుకునే పద్దతి

జ్యోతిష ఫలితాలకొరకు సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు.. ఎవరిది ఏ నక్షత్రము. ఏరాశి అని అడుగు తుంటారు. ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోడానికి రెండు పద్దతులున్నాయి.

1. జన్మ నక్షత్రము. 2. నామ నక్షత్రము. జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసు కోవడము. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి. ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి.

శ్లోకము:-దేశజ్వరే గ్రామ గృహ ప్రవేశే, సేవాను, యుడ్డె, వ్వవహార, కారయే ద్యూతేషు, దానేషుచ నామ రాశిః యాత్రా వివాహ దిషు జన్మ రాశిః||

అనగా దేశ సంభందమైన, అనారోగ్య విషయం, గ్రామ ప్రవేశము, గృహ ప్రవేశము, యుద్ధ ప్రారంభానికి మొదలగు విషయాలకు నామ నక్షత్రాన్ని, యాత్రలకు వెళ్ళేటప్పుడు, వివాహము మొదలగు విషయములలో జన్మ నక్షత్రాన్ని చూడాలని పై శ్లోకంలో నిర్దేశించారు.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...