రాహు, కేతు దోష నివారణకు “సులేమని స్టోన్”
సులేమని స్టోన్ నే “ఈవిల్ ఐ స్టోన్” అని, నరదృష్టి స్టోన్ అని పిలుస్తారు. సులేమని స్టోన్ ముఖ్యంగా రాహు కేతువుల యొక్క చెడు ప్రభావాలను తొలగించటానికి ఉపయోగిస్తారు. సులేమని స్టోన్ నలుపు వర్ణం కలిగి తెల్ల చారలు కలిగి ఉంటుంది. ఇతర వర్ణాలలో కూడా సులేమాన్ లభించిన నలుపు వర్ణంతో కలసిన తెలుపు చారలు ఉన్న దానికే ఎక్కువ ప్రాదాన్యత కలిగి ఉంది.
జాతకంలో ఎవరికైనా రాహువు పాప గ్రహాలతో కలసి లగ్నంలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేనప్పుడు ఇతరుల ప్రలోభాలకు లొంగిపోయే అవకాశాలు ఉండటమే కాకుండా నరదృష్టి ప్రభావం కలిగి ఉంటారు. ఈ దోష నివారణకు సులేమని స్టోన్ మెడలో ధరించటం గాని, ఉంగరంగా ధరించటం గాని చేస్తే రాహు, కేతు ప్రభావం నుండి తప్పించుకోవచ్చును.
సులేమని స్టోన్ నీటిలో ఉంచి ఆ స్టోన్ కలిగిన నీటిని సూర్యరశ్మిలో ఒక గంట ఉంచి తరువాత ఆ నీటిని స్వీకరించిన అంతర్గత అనారోగ్యాలు సైతం నివారింపబడతాయి. ఆ నీటిని జుట్టుకు రాసుకోవటం వలన తెల్ల జుట్టు, చుండ్రు సమస్యలను నివారిస్తుంది. ఆ నీటిని శరీరానికి రాసుకోవటం వలన చర్మ వ్యాదులు, గోళ్ళ సమస్యలు, నరాల సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
కంటి సమస్యలు ఉన్నవారు ఈ నీటిని కంటికి తడిగుడ్డతో రాసుకోవటం వలన కంటి సమస్యలు ఉండవు. నరదృష్టి ప్రభావం వలన తరచుగా వ్యాపారంలో నష్టం వస్తున్న వారు సులేమని ధరించవచ్చును. పిల్లలకు చదువులో అశ్రద్ధ ఉన్న, ఆటంకాలు ఉన్న సులేమని ధరించవచ్చును.
జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని పంచమంలో గాని ఉండి శుభగ్రహ దృష్టి రహితంగా ఉన్నప్పుడు సంతాన దోషాన్ని కలిగిస్తాడు. కేతువు వ్యయంలో ఉన్న రాహువు నవమంలో ఉన్న పితృదోషం మరియు బాలారిష్ట దోషాలు ఉంటాయి. ఇవి పిల్లలలో 12 సంవత్సరాల వరకు ప్రభావం చూపిస్తాయి.
బాలారిష్ట దోషం వలన నరదృష్టి ప్రభావం అధికంగా ఉండటం. తొందరగా నిద్రపోకపోవటం, నిద్రలో ఉలిక్కి పడి లేవటం జరుగుతుంది. ఇలాంటి దోషాల నివారణకు పిల్లలకు గాని పెద్ద వాళ్ళకు గాని సులేమని స్టోన్ మెడలో ధరింపజేయటం వలన రాహు కేతు ప్రభావం నుండి ఉపశమనం కలుగుతుంది.
జాతకంలో రాహు, కేతు ప్రభావం ఉన్నా లేకపోయిన తరచుగా ప్రతికూల ఆలోచనలు చేస్తూ ఉన్న, ఆత్మవిశ్వాసం లోపిస్తున్న, చెడు వ్యామోహాలకు లొంగిపోతున్న, మానసిక ప్రశాంతత లేకపోయిన, భవిష్యత్ గురించి ఒకటే ఆందోళన కలిగి ఉన్న, ప్రతి చిన్న విషయాలకు ఆందోళన కలుగుతున్న, తరచుగా మోసపోతున్న, చెడు కలల నుండి రక్షణ కొరకు సులేమని స్టోన్ ధరించటం ఎంతో మంచిది.
కేతువు మనిషిని తప్పుద్రోవ పట్టించటం లోనూ, రాహువు లేని విషయాన్ని ఉన్నట్టుగా బ్రమింపజేయటంలోను ప్రాదాన్యత కలిగి ఉంటారు. ఇలాంటి వాటిని నిరోదించటానికి సులేమని స్టోన్ ఉపయోగపడుతుంది.
Excellent and very useful information sir,thank you so much for the great awareness article and about atone
రిప్లయితొలగించండిSir...very useful information. ..thanks a lot...great personality. .
రిప్లయితొలగించండి