26, డిసెంబర్ 2015, శనివారం

మహామృత్యుంజయ యంత్ర లాకెట్

మహామృత్యుంజయ యంత్ర లాకెట్

మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రం. దీనినే త్రయంబక మంత్రము, రుద్ర మంత్రము, మృత సంజీవని మంత్రము అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కోసం జపిస్తారు.

ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఊర్వారుకమివ బంధనాత్‌ మృత్యోర్ముక్షీయ మామృతాత్‌

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.


ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు.

మార్కండేయ కృతం స్తోత్రం య: పఠేత్‌ శివసన్నిధౌ |
తస్య మృత్యుభయం నాస్తి న అగ్నిచోరభయం క్వచిత్‌ || ౨౦ ||

శతావృతం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశనమ్‌ |
శుచిర్భూత్వా పఠేత్‌ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్‌ || ౨౧ ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్‌ |
జన్మమృత్యు జరారోగై: పీడితం కర్మబంధనై: || ౨౨ ||

తావకస్త్వద్గతప్రాణస్త్వ చ్చిత్తోఽహం సదా మృడ |
ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యమమం జపేత్‌ || ౨౩ ||

నమ: శివాయ సాంబాయ హరయే పరమాత్మనే |
ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమ: || ౨౪ ||

|| ఇతీ శ్రీ మార్కండేయపురాణే మహా మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్‌ ||

మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...