10, డిసెంబర్ 2014, బుధవారం

శివలింగ సాలగ్రామం(Sivalinga Saligramam)

శివలింగ సాలగ్రామం

'సాలగ్రామం' సాక్షత్ విష్ణుస్వరూపం.దీనిని అభిషేకించిన పుణ్యజలాన్ని ప్రోక్షించుకుంటే సర్వపాపాలు నశిస్తాయి.సర్వరోగాలు నశించి,సకలసంపదలు లభిస్తాయి.సర్వశుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషివాక్కు.విష్ణుభగవానుడు ‘సాలగ్రామం’ అనేరాయిరుపాన్ని ధరించడం వెనుక అనేక కధలున్నాయి.అందులో ముఖ్యమైనది బృందకథ. 


కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనేరాక్షసుడిని పెళ్ళాడుతుంది.ఆమె మహాపతివ్రత. కానీ,జలంధరుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరిని పీడిస్తుంటాడు.అతను ఎంతవరకు వెళ్ళాడంటే, ఒకానొకప్పుడు శివునిరూపంలో వెళ్ళి పార్వతీదేవిని మోసగించబోతాడు.అందుకు కోపగించిన పార్వతీదేవి విష్ణువును సమీపించి బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది.బృంద పాతివ్రత్య భంగం సకల లోకాలకు అవసరం కూడా.ఎందుకంటే ఆమెకి ఆభంగం కలిగితేనే జలంధరుని అంతం జరుగుతుంది.సకల లోకాల క్షేమంకోరి విష్ణుభగవానుడు జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు.అనంతరం తన నిజరూపాన్ని ప్రకటిస్తాడు.జరిగిన మోసానికి నివ్వెరపోయిన బృంద విష్ణుమూర్తిని శిలగా మారతావని శపిస్తుంది.అలా శ్రీవిష్ణుభగవానుడు సాలగ్రామరూపాన్ని ధరించాల్సి వచ్చిందని కథ. సాలగ్రామశిలలు గండకీనదిలో లభిస్తుంటాయి.

సాలగ్రమంపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఇందులో ముఖ్యమైనది లింగ(శివ) సాలగ్రామం.లింగ సాలగ్రామం సాక్షాత్తు శివ స్వరూపం.లింగ సాలగ్రామం లోపల ఒక శిల మెరుస్తూ కణుపులు కలిగి ఊర్ధ్వ ముఖం సన్నగాను అదోముఖం పెద్దగాను,కొన్ని సమానంగాను ఉంటాయి. శివ లింగ సాలగ్రామన్ని ఆవుపాలతోగానీ, పంచామృతంతో గానీ శుద్ధిచేసి, రుద్రాక్షధారణ చేసేటప్పుడు చేసే నియమాలతో సాలగ్రామాన్నిపూజించాలి.

సాలగ్రామం ఉన్న ప్రదేశంలో స్నానంచేసినా, దానంచేసినా కాశీక్షేత్రంలో చెసిన స్నాన, దానాలకంటే నూరురెట్లుఫలితం కలుగుతుందనేది ఋషివాక్కు. శివ లింగ సాలగ్రామ శిలకు షోడశోపచార పూజచెస్తే అన్నికల్పాంతాల వరకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. శివ లింగ సాలగ్రామ పూజచేస్తే శివకేశవులను పూజించిన ఫలితం కలుగుతుంది.మంత్రాలేమి తెలియకపోయినప్పటికీ భక్తివిశ్వాసాలతో శివ లింగ సాలగ్రామం పూజనుచెస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.సర్వపాపహరంచేసేది, సర్వకష్టాల నుంచి రక్షించేది సాలగ్రామం. 

శివ లింగ సాలిగ్రామం గూర్చి అగ్ని, బ్రహ్మాండ, గరుడ, స్కంద, వరాహ పురాణాలలో వివరణ వున్నది. పంచాయతనపూజలో శ్రీశంకరాచార్య, సాలిగ్రామం పూజ శివ, విష్ణువులకు, సూర్యునికి స్పటికం, ధాతు యంత్రాన్ని శక్తిని, గణపతికి స్క్వేర్‌ రూపంలోని ఎర్రటి రాయిని పూజించమన్నారు.సాలిగ్రామాలను గృహాలలో పూజలు చేస్తే ఆయింటికి ఆయురారోగ్య, సిరిసంపదలను, సుఖ సంతోషాలను కలుగ జేస్తాయిని ప్రతీతి.

శ్లో;-సాలగ్రామ శిలా వారీ పాప హారీ విశేషతః.
ఆజన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే.
ప్రథమం కార్య సిద్ధిశ్చ - ద్వితీయం జ్ఞానమేవచ
తృతీయం మోక్షమాప్నోతి. ఏవం తీర్థః త్రిభిస్త్రిభిః


అనే శ్లోకం చెప్పుకుంటూ ముమ్మారు ఆ జల పానం సేవించాలి. శివ లింగ సాలిగ్రామ శిలకు అభిషేకము చేసినప్పుడు ఆ సాలిగ్రామ తీర్థమును మనము సేవించినట్లైతే అది పాపములను హరించును.జన్మాదిగా చేసినపాప పరిహారమునకు ప్రాయశ్చిత్తము. ఒకసారి పానము చేసినట్లైతే శరీరశిద్ధి కలుగుతుంది. రెండవపర్యాయము పానము చేసినట్లైతే జ్ఞానము ప్రాప్తిస్తుంది. మూడవ పర్యాయము పానము చేసినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుంది.
శివలింగ సాలగ్రామం:-3500.00 Small Size,7000.00 Big Size.
  పై  శివలింగ సాలగ్రామం
  కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...