29, జనవరి 2014, బుధవారం

వాస్తు భగవాన్ (Vaastu Bhagavan)

వాస్తుదోష నివారణకు "వాస్తు భగవాన్" పోస్టర్
వాస్తు విషయంలో దిశలు, అంటే దిక్కులు చాలా ప్రధానమైనవి.......

‘దుర్జనం ప్రథమం వందే’ అని పెద్దలు చెప్పిన హితవు. అంటే దుర్మార్గునికి ముందుగా నమస్కరించాలట. అంటే చెడు చేయకుండా ఉండేందుకు, అలాగే వాస్తులో హానికారక దిశలైన నైరుతి, వాయవ్యాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ‘నైరుతీ పాప రాక్షసీ’ అనీ, వాయవ్యం ‘చరకీపూతనా విదారే’ అని చెప్పారు. నైరుతికి ‘నిబ్బుతి’ దిక్పాలకుడు - రాహువు గ్రహము అధిపతులు - అలాగే వాయవ్యానికి ‘వాయువు’ దిక్పాలకుడు ‘కేతువు’ గ్రహము అధిపతులు. రాహు కేతువులు పాప గ్రహాలు .



వాయవ్య దిశలో ఉన్న కైబర్, ఖోలాన్ కనుమల ద్వారానే మహమ్మద్ గజనీ, మహమ్మద్ ఘోరీ, ఛెంగిజ్‌ఖాన్, తైమూరు, బాబర్ మొదలైన వారంతా మన దేశం మీదకు దండయాత్ర చేశారు. ‘క్రూర రూపిణే కేతవే’ అని కేతువునకు పేరు. ‘రౌద్రం రుణాత్మకం ఘోరం’ అని కేతువును వేదాలు వర్ణించాయి.

మహాభారత యుద్ధానికి మూల కారకుడు గాంధార దేశాధీశుడైన శకుని అన్న వాస్తవాన్ని కాదనగలమా? నాటి గాంధార దేశమే నేటి ఆఫ్గనిస్తాన్. ఇప్పటికీ తాలిబన్లు, ఉగ్రవాదులూ ఆ దిశ నుండే మనకు చిక్కులు కల్పిస్తున్నారు కదా. పాకిస్తాన్ కూడా అదే దిశ కదా. అందుకే వాయవ్య దిశ వాస్తులో ప్రమాదకరమైన దానిగా చెప్పి, వాయవ్యం ఎత్తుగా ఉండాలని చెప్పారు. ఎత్తుగా ఉంటే అవతలి భాగం పల్లంగా ఉంటుంది కనుక చెడు శక్తిని రాకుండా ఉన్నత భాగం అడ్డుకుంటుంది.

శ్రీమద్రామాయణంలో కూడా శ్రీరామచంద్ర మూర్తి సాగరునిపై కోపంతో ధనుస్సులు ఎక్కుపెట్టగా, సముద్రుడు శరణు గోరతాడు. అప్పుడు శ్రీరాముడు, ఎక్కుపెట్టిన బాణం వృధా పోదు. ఎవరి మీద ప్రయోగించమంటావు అంటే నైరుతి దిశలో సముద్ర రాక్షసులున్నారు. వారిపైన ప్రయోగించండి అంటాడు. అంటే నైరుతి దిశ ప్రమాదకారి దిశ. అందుకే నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశలు ఉన్నతంగా ఉండాలని వాస్తు శాస్త్రం నిర్దేశిస్తుంది. ఉన్నతంగా ఉంటే అవతలి వైపు నుండి వచ్చే చెడు ప్రభావాన్ని అడ్డుకోవటం జరుగుతుంది.

మిగతా దిశల్లో-
‘ఇంద్రేచ శుభదం’ తూర్పు శుభప్రదం.
‘యమేచీ శుభదం’ దక్షిణం కూడా.
శుభప్రదమే అయితే పల్లంగా ఉండకూడదు. మలయ పర్వతాలు (నల్లమల కొండలు) నుండి వచ్చే గాలి ఆరోగ్యకరం.
‘మాష మాత్రంతు ఈశాన్యం శుభం’ అంటే మినపగింజ ప్రమాణమైనా ఈశాన్యం పెరగాలి.
‘వ్రీహి మాత్రంతు ఆగ్నేయం’ ‘తిలమాత్రం తు నైరుతీ, వాయవ్యం’ ‘దోషప్రదం’ - అంటే బియ్యపు గింజ ప్రమాణం ఆగ్నేయం కాని, నువ్వుగింజ ప్రమాణం నైరుతి, వాయవ్య దిశలుగానీ పెరిగితే అశుభాన్ని కలిగిస్తాయి. అందుకే వాస్తు నిర్ణయంలో దిక్కులను నిర్ణయించటం దిక్సూచీ సహాయంతో నిర్ణయించాలి.


Poster Cost=50=00.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...