Astroexperts |
ఈ కారణంగానే కొన్ని సాలగ్రామాలు విష్ణు సంబంధిత చిహ్నాలతోను ... మరి కొన్ని శివసంబంధమైన చిహ్నాలతోను కనిపిస్తుంటాయి. దేవాలయాలలో ప్రధాన మూర్తులతో సమానంగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాయి. సాలగ్రామాలు వివిధ ఆకారాల్లో చిన్నవిగా .. పెద్దవిగా .. నలుపు రంగులోను ... తెలుపు రంగులోను దర్శనమిస్తుంటాయి. అయితే వీటిలో 'కూర్మ సాలగ్రామం'ఎంతో ప్రత్యేకమైనదిగా ... అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది.
ఇది చూడటానికి 'తాబేలు' ఆకారంలో చిన్నదిగా వుంటుంది. ఈ కారణంగానే దీనిని కూర్మ సాలగ్రామమని అంటుంటారు. ఇది కూడా గండకీ నదీ ప్రవాహంలోనే చాలా అరుదుగా లభిస్తుంటుంది. అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ సాలగ్రామం నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటుందని చెబుతుంటారు. అందువల్ల దీనిని నీటి పాత్రలోనే ఉంచాలని అంటారు.
కూర్మ సాలగ్రామం ఉంచిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక రకాలైన వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ఈ సాలగ్రామాన్ని పూజా మందిరంలో వుంచి పూజించడం వలన, సాక్షాత్తు విష్ణుమూర్తిని సేవించిన ఫలితం దక్కుతుంది. నిత్యం ఈ సాలగ్రామానికి నియమ నిష్టలతో పూజాభిషేకాలు నిర్వహించిన వారికి సంపదలు పెరుగుతాయనీ, సకల శుభాలు జరుగుతాయని అంటారు.కూర్మ సాలగ్రామం ఉన్న షాపు వ్యాపారం దినదినాభివృద్ది ఛెందుతుంది.కూర్మ సాలగ్రామం ఉన్న ఇంటిలో ఎటువంటి కుటుంబ సమస్యలు ఉండవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి