పసుపు కేరువా మాల
రుద్రాక్ష మాల మాదిరిగానే, పసుపు కేరువా మాలను కూడా పరమ పవిత్రమైందిగా భావిస్తారు. పసుపు కేరువామాల చేపట్టిన పనిలో విజయం చేకూరుస్తుంది. గణపతికి ఈ కేరువా మాల అంటే మహా ఇష్టం.
పార్వతీదేవి నలుగుపిండితో గణపతిని రూపొందించిన సంగతి మనకు తెలుసు. నలుగుపిండి పసుపే కదా!. కనుక పార్వతీదేవికీ, గణపతికీ కూడా పసుపు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పసుపు కేరువా మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
1)శక్తికి ప్రతిరూపమైన కేరువామాల ఇంట్లో ఉంటే పార్వతీ, గణేశులను ఇంట్లో ప్రతిష్టించు కున్నట్టే.
2)పసుపు కేరువామాల జపాన్ని ఏదైనా మంచిరోజు చూసుకుని మొదలుపెట్టడం మంచిది. అక్షయ తృతీయ రోజు అయితే మరీ ఉత్తమం.
3)కేరువామాలను చేతిలో ఉంచుకుని “ఓం గ్లౌం గణపతయే నమః” అని స్మరిస్తూ పూజిస్తే తలపెట్టిన పనిలో ఎలాంటి విఘ్నాలూ ఏర్పడవు. పసుపు కేరువామాలతో విజయం సొంతమౌతుంది.
4)కేరువామాల ఒక్కో పూసనూ తిప్పుతూ “ఓం గ్లౌం గణపతయే నమః” మంత్రాన్ని 108 సార్లు జపిస్తే గొప్ప మానసిక ప్రశాంతత లభిస్తుంది.
5)పసుపు కేరువామాలను తరచూ కడగడం వల్ల దాని మెరుగు, సొగసు తగ్గిపోతుంది. అందువల్ల జపం చేసేముందు సంకల్ప సిద్ధితో ఈ మాలపై మంత్రోదకాన్ని చిలకరిస్తే సరి. శుద్ధి చేసినట్లూ అవుతుంది, ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది.
6)జపం పూర్తయిన తర్వాత కేరువా మాలను తీసి ఎక్కడో పెట్టకూడదు. పసుపు కేరువామాలను పూజా మందిరంలో, దేవుడి వద్దనే ఉంచాలి.
7)జాతకచక్రంలో గురు గ్రహా దోషం ఉన్న వారు కేరువమాలతో జపం చేస్తే గురుగ్రహ దోషం నివారణ అవుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి