26, నవంబర్ 2012, సోమవారం

ఫినిక్స్,పోనిక్స్ Phoenix Bird


ఫినిక్స్ పక్షి
            

        ఫినిక్స్ పక్షిని స్వర్గ లోకపు పక్షి అని,స్వర్గ లోకపు దేవత అని అంటారు.ఈ పక్షి ముఖ్యంగా కుటుంబంలోని మహిళలు కోరుకున్న మరియు మనసులో తలచుకున్న ఆలోచనలను తీరుస్తుంది అని ప్రతీతి.
         ఫినిక్స్ పక్షి వ్యాపార,ఉద్యోగ,వృత్తి,కుటుంబ విషయాలలో అదృష్టాన్ని కలిగిస్తుంది.ఆశ్చర్యమైన విజయావకాశాలను కలిగిస్తుంది.

5, నవంబర్ 2012, సోమవారం

కస్తూరి(Musk)


శుక్రగ్రహ దోష నివారణకు కస్తూరి
జాతకచక్రంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారికి వివాహం తొందరగా కాక పోవటం,వివాహ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్ట పోవటం,వివాహం అయిన తరువాత దంపతుల మద్య విభేదాలు,వాహన సౌఖ్యత లేకపోవటం జరుగుతుంది.శుక్రగ్రహ దోష నివారణకు కస్తూరి ని పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోవచ్చును.

ఎర్రటి జాకెట్టు గుడ్డలో ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని ఉంచిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వదు.ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు కస్తూరిని వెంట తీసుకొని వెళ్తే సమయం వృధా కాకుండా పనులు పూర్తవుతాయి.కస్తూరి లోపల ఉండే పొడిని గంధంతోపాటు నుదుట ధరించిన నరదృష్టి ఉండదు.మరియు దృష్టి లోపాలు (కంటి లోపాలు )ఉండవు. 

4, నవంబర్ 2012, ఆదివారం

జ్యోతిష్యంలో శని గ్రహం యొక్క వివరణ, కారకత్వం,వ్యాధులు,వృత్తులు వ్యాపారాలు,పరిహారాలు(రెమిడీస్) .

శని గ్రహం యొక్కరూపము

శని నీల కాంతి కలిగిన మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు కలవాడు. ధనుర్భాణాలు, శూలం ధరించిన వాడు. కాకిని వాహనంగా చేసుకున్న వాడు. శనికి నిదానంగా సూర్యుడిని చుట్టి వస్తాడు కనుక మందుడు అని పిలుస్తారు. పంగు, సౌరి అను ఇతర నామాలు ఉన్నాయి. సూర్యుడికి ఛాయాదేవికి కలిగిన పుత్రుడు. మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్ధశి నాడు ధనిష్ఠా నక్షత్రంలో విభవానామ సంవత్సరంలో జన్మించాడు. శనిభగవానుడి సోదరి యమున, సోదరుడు యముడు, భార్య జ్యేష్టాదేవి. సూర్యుడి భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సజ్ఞాదేవి సూర్యుడి తాపం భరించ లేక తనకు ప్రతిగా ఛాయాదేవిని సృష్టించి పుట్టింటికి వెళ్ళిన సమయంలో శని జన్మించాడు. తరువాత కాలంలో సూర్యుడిని చేరిన సజ్ఞాదేవి శనిని సరిగా చూడని కారణంగా శని ఆమెను కాలితో తన్నాడు. ఆకారణంగా శనిని ఆమె శపించంగా శనికి మందగమనం ప్రాప్తించింది.

3, నవంబర్ 2012, శనివారం

లక్ష్మీకారక గవ్వలు

లక్ష్మీ కారక గవ్వలు
         గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. లక్ష్మీకారక గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి.శంఖాలకు ఏవిదమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉంది.
           గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు.ఇంకా అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం అమలులో ఉంది.దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది .గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్మకం .

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...