21, జూన్ 2016, మంగళవారం

స్పటిక గణపతి (Crystal Ganesh)


స్పటిక గణపతి

               ఏ పూజకు అయినా, ఏ కార్యక్రమము అయినా తొలుత  ఆరాదించేది  గణ నాధుడునే. గణనాధుడుకు పూజ చేసి ప్రారంభము చేస్తే ఎటువంటి విఘ్నాలు  లేకుండా విజయము లభిస్తుంది అని నమ్మకం. వినాయకుడు నర ముఖముతోనే  జన్మించారు. కానీ గజాసురుడు అనే రాక్షసుడుకి, ముఖ భాగము గజము క్రింది భాగము నరుడు అయిన రూపము కల వాని  చేతి లోనే  మరణించాలని  వరము ఉండడముతో ఈశ్వరుడు, నర ముఖము  తొలగించి గజముఖముతో ప్రాణ ప్రతిష్ట చేసారుట. ఆ తరువాత వినాయకుడు ఆ రాక్షసుడిని సంహరించారుట.

          లోకకల్యాణము కొరకు తన తలను తీసివేసి, ఏనుగు తలను ధరించారు కనుక  సుముఖము అన్నారు. ఏ ముఖము  ప్రసన్నముగా,  సంతోషముగా, లోక హితము  కోరుతుందో,  ప్రేమగా  ఉంటుందో ఆ ముఖము “సుముఖము” అని, కావున ఉదయాన్నే నిద్ర లేవగానే స్పటిక వినాయకుని ముఖమును చూసి  “ఓం శ్రీ స్పటిక మహా గణాధిపతి యై నమః” అని నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది అని అంటారు.


స్పటిక గణపతి అన్ని స్టోన్ గణపతులలో ఉత్తమమైన గణపతి. స్పటికం శుక్రగ్రహ ప్రతీక. కుటుంబంలో బార్య భర్తల మద్య అన్యోన్నత, సుఖ సంతోషాలు కలగాలన్న, అపోహలు తొలగి పోవాలన్న శుక్ర గ్రహ ప్రతీక అయిన స్పటిక గణపతిని పూజించాలి. వినాయకుడు విఘ్నాలకు ప్రసిద్ధి. పనులలో విఘ్నాలు కలుగుతున్న స్పటిక గణపతిని పూజించాలి. శుక్రుడు వివాహ కారకుడు. వివాహంలో ఆటంకాలు కలుగుతున్న, దంపతులమద్య సఖ్యత లేకున్నా స్పటిక గణపతిని పూజించాలి.

         శుక్రవారం ఉదయం స్నాన అనంతరం స్పటిక గణపతిని గంగాజలంతో శుద్ది చేసి  పూజా మందిరంలో తెల్లని వస్త్రం పరచి దానిపైన స్పటిక గణపతిని ప్రతిష్ఠించి  ధూప దీప నైవేద్య అనంతరం ఆకర్షణకు వశీకరణకు కారకుడైన శుక్రగ్రహ కారకమైన స్పటిక గణపతిని  “ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవశమానాయ స్వాహా”  అనే మంత్రంతో పూజ చేసి ఇంట్లో గాని వ్యాపార సంస్ధలలో గాని ప్రతిష్ఠించిన జనాకర్షణ, వ్యాపారభివృద్ధి, దంపతుల మద్య అన్యోన్నత చేకూరతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...