9, జూన్ 2016, గురువారం

కక్ష్యా అష్టకవర్గు


కక్ష్యా అష్టకవర్గు

అష్టకవర్గులో కక్ష్యా క్రమాన్ని అనుసరించి గోచారంలో గ్రహాల ఫలితాలను సూక్ష్మ పరిశీలన ద్వారా అంచనా వేయుటకు కక్ష్యా అష్టకవర్గు ఎంతగానో ఉపయోగపడుతుంది.

కక్ష్యాక్రమం :- శ్లో:- మందమారేజ్య భూపుత్ర సూర్య శుక్రేందుజేందవ్: శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర కక్ష్యాక్రమం వారాలుగా ఏర్పాడతాయి.

రాశి ప్రమాణం 30° కలదు. సప్తగ్రహాలు మరియు లగ్నం కలిపి మొత్తం 8 భిన్నాష్టక వర్గులు ఉంటాయి. 30° రాశి ప్రమాణాన్ని 8 చేత భాగించగా 3°- 45' నిమిషాల ప్రమాణం. ఒక్కొక్క కక్ష్యా ప్రమాణం 3°- 45' నిమిషాల ప్రమాణం ఉంటుంది. అంటే ఒక్కొక్క రాశిని 8 భాగాలుగా చేస్తే ఒక్కొక్క కక్ష్య 3°- 45' నిమిషాల ప్రమాణం ఉంటుంది. గ్రహాలు గోచారంలో ఈ కక్ష్యా భాగాలలో బిందువు ఇచ్చినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తాయి. బిందువులు లేనప్పుడు చెడు ఫలితాలను ఇస్తుంది.


గ్రహాలు గోచారంలో సంచరిస్తున్నప్పుడు రాశిని 8 కక్ష్యాభాగాలుగా చేసినప్పుడు ఒక్కొక్క గ్రహం కక్ష్యలలో వేరు వేరుగా కొన్ని రోజులు లేదా కొంత సమయం వరకు ఉంటాయి.

ఉదా:- సూర్యుడు ఒక రాశిలో 30° లను 30 రోజులలో దాటగలడు. రోజుకు ఒక డిగ్రీ చొప్పున కదులుతుంటాడు. అంటే ఒక్కొక్క కక్ష్యలో సుమారుగా 3 రోజుల 8 గంటలు ఉంటాడు.

గురువు ఒక రాశిలో 30° లను దాటటానికి 12 నెలలు లేదా 360 రోజుల సమయం పడుతుంది. ఈ 360 రోజులను 8 కక్ష్యా భాగాలకు పంచితే ఒక్కొక్క కక్ష్యలో గురువు 45 రోజులు ఉంటాడు.

ప్రతి గ్రహం గోచారంలో సంచరిస్తున్నప్పుడు మొదటి కక్ష్యాక్రమంలో శని కక్ష్య ఉంటుంది. తరువాత గురు కక్ష్య, కుజ కక్ష్య , రవి కక్ష్య, శుక్ర కక్ష్య, బుధ కక్ష్య, చంద్ర కక్ష్యలలో సంచారం చేస్తుంటాయి. ఈ విధంగా 8 కక్ష్యలలోనూ గ్రహాలు శుభ బిందువులను ఇచ్చినప్పుడు శుభ ఫలితాలను ఇస్తాయి. గోచారంలో గ్రహాలు సంచారం చేసే కక్ష్యలో కనీసం 4 శుభ బిందువులు ఇచ్చిన శుభఫలితాలు వస్తాయి. అంతకంటే తక్కువ ఉంటే అశుభ ఫలితాలు వస్తాయి. అదే విధంగా గోచారంలో గ్రహాలకి కక్ష్యా క్రమంలోని గ్రహాలకి శత్రు, మిత్రత్వం అనే అంశాలను పరిశీలించి సూక్ష్మ ఫలితాలను గుర్తించవచ్చును.


2 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...