1, ఆగస్టు 2015, శనివారం

గ్రహాలు ఉచ్చ నీచలు



గ్రహాలు ఉచ్చ నీచలు 

గ్రహాలు ఉచ్చ స్ధానాలు
మేషరాశిలో సూర్యుడు 10° పరమోచ్చ.
వృషభరాశిలో చంద్రుడు 3° పరమోచ్చ.
మకరరాశిలో కుజుడు 28° పరమోచ్చ.
కన్యరాశిలో బుధుడు 15° పరమోచ్చ.
కర్కాటకరాశిలో గురువు 5° పరమోచ్చ.
మీనరాశిలో శుక్రుడు 27° పరమోచ్చ
తులారాశిలో శని 20° పరమోచ్చ


గ్రహాలు నీచ స్ధానాలు
తులారాశిలో సూర్యుడు 10° పరమనీచ
వృశ్చికరాశిలో చంద్రుడు ° పరమనీచ
కర్కాటకరాశిలో కుజుడు 28° పరమనీచ
మీనరాశిలో బుధుడు 15° పరమనీచ
మకరరాశిలో గురువు 5° పరమనీచ
కన్యారాశిలో శుక్రుడు  27° పరమనీచ
మేషరాశిలో శని  20° పరమనీచ.

ఉచ్చస్ధానంలో ఉన్న గ్రహాలు ఆదర్శానికి,నీచ స్ధానంలో ఉన్న గ్రహాలు స్వార్ధానికి సంకేతాలు.ఏ గ్రహామైనను తన నీచరాశిని వదలి ఉచ్చరాశికి పోవుచున్నప్పుడు ఆ గ్రహం ఆరోహణ గ్రహం అనబడును. 

ఏ గ్రహామైనను తన ఉచ్చరాశిని వదలి నీచరాశికి పోవుచున్నప్పుడు ఆ గ్రహం ఆవరోహణ గ్రహం అనబడును.ఆరోహణ గ్రహములు క్రమక్రమముగా బలవంతులై శుభ ఫలములు ఇచ్చేదరు.
అవరోహణ గ్రహములు రాశి క్రమమున బలహీనులై అశుభ ఫలితాలను ఇచ్చేదరు.గ్రహాలు తమ నీచ స్ధానము లగాయితు మూడురాశులు దాటిన తరువాతనే శుభ ఫలములు ఇచ్చేదరు.

చంద్రుడు అమావాస్య తరువాత తిధి క్రమముగా శుక్ల పక్షమున ఆరోహణ గ్రహముగాను,బహుళపక్షంలో తిధి తరువాత తిధి చొప్పున అవరోహణ గ్రహమగును.
గ్రహాలు ఆరోహణ దశలో మంచి ఫలితాలను ఇస్తాయి.గ్రహాలు అవరోహణ దశలో మంచి ఫలితాలను ఇవ్వలేవు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...