15, ఆగస్టు 2015, శనివారం

యోగి-సహయోగి-అవయోగి



యోగి-సహయోగి-అవయోగి 

ప్రతి లగ్నమునకు శుభ,పాప,యోగకారక మరియు మారక గ్రహములు గ్రహముల ఆదిపత్యముపై నిర్ణయింపబడినవి.ఇవికాక యోగి,అవయోగి,సహయోగి గ్రహములు కలవు.యోగి,సహయోగి గ్రహములు శుభగ్రహములు,అవయోగి గ్రహములు పాప గ్రహములు.వీటి దశ అంతర్ధశలలో  శుభ మరియు అశుభ ఫలితాలు ఇస్తాయి.

జాతకచక్రంలోని సూర్య చంద్ర స్పుటములకు 3 రాశుల 3 డిగ్రీల 20 నిమిషాలు(పుష్యమి) కలపవలెను.అలా కలుపగా వచ్చు మొత్తం 360 డిగ్రీలకంటే ఎక్కువ ఉన్న 360 తీసివేయవలెను.అలా చేయకావచ్చిన డిగ్రీలు యోగబిందువగును.


ఆ డిగ్రీలలో ఏ నక్షత్రం కలదో ఆ నక్షత్రాధిపతి (వింశోత్తరి)యోగ గ్రహమగును.యోగ బిందువు ఏ రాశిలో కలదో ఆ రాశ్యాదిపతి సహయోగి అగును.ప్రతి యోగికి ఒక అవయోగి కలడు. యోగ గ్రహమునకు ఏ గ్రహము అవయోగ గ్రహామో పట్టిక ద్వారా తెలుసుకోవచ్చును.
 
లగ్నాధిపతి లేక దమాధిపతి లేక పూర్ణ యోగ కారక గ్రహము (ఆదిపత్యముచే)లేక దశ,అంతర్ధశ నాధులతో యోగిగ్రహమునకు సంబందమున్న శుభ ఫలితమునిచ్చును.అవయోగి గ్రహముతో యుతి చెందిన యోగిగ్రహము తన శుభత్వమును కోల్పోవును.యోగిగ్రహము సహాయోగిగ్రహముతో సంబంధము కలిగి ఉన్న ఎక్కువ శుభయోగ ఫలితములిచ్చును.యోగ గ్రహం గోచారంలో పాపగ్ర ప్రభావం కలిగిన శుభ ఫలితములనీయజాలదు.

రవ్యాది నవగ్రహములు వింశోత్తరి దశాక్రమములో మూడు భాగాలుగా విభజింపడినవి.

కేతు        శుక్ర        రవి
చంద్ర       కుజ        రాహు
గురు       శని         బుధ 

కేతు,చంద్ర,గురులు ఒక జట్టు,శుక్ర,కుజ,నులు ఒక జట్టు,రవి,రాహు,బుధులు ఒక జట్టుగా విభజించిరి.ఒక జట్టులోని ఒక గ్రహం యోగి గ్రహమైన అదే జట్టులోని ఇతర రెండు గ్రహములు కూడా యోగిగ్రహ లక్షణములు కలిగి ఉండును.

యోగి గ్రహము దగ్ధరాసులలో గాని షష్ఠ అష్టమ వ్యయభావాలలో  భావాలలో ఉండరాదు.అట్లున్న యోగిగ్రహం తన కారకత్వములను కోల్పోవును.సహయోగి అవయోగి అయిన శుభ ఫలితములనీయజాలడు.అవయోగి గ్రహము షష్ఠ అష్టమ వ్యయభావాలలో ఉన్న లేక అస్తంగత్వం చెందిన గ్రహ యుద్ధంలో ఓడిపోయిన వక్రించి వెనుక రాశిలో ఉన్న దగ్ధరాశిలో ఉన్న శుభపలితములనిచ్చును.అనగా అవయోగి గ్రహమునకు బలము ఉండరాదు. శుభ భావాలలో ఉండరాదు.

ఉదాహరణ:-జాతకచక్రంలో జనన తిధి శుక్ల చవితి .చవితి తిధికి వృషభము,కుంభము దగ్ధ రాశులు అగును.

రవి స్ఫుటం 5 రాశుల 18 డిగ్రీల 57 నిమిషాలు.
చంద్ర స్ఫుటం 7 రాశుల 5 డిగ్రీల 14 నిమిషాలు.
స్ధిర స్ఫుటం 3 రాశుల 3 డిగ్రీల 20 నిమిషాలు
మొత్తం 15 రాశుల 27 డిగ్రీల 31 నిమిషాలు.

360 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి తీసివేయగా 3 రాశుల 27 డిగ్రీల 31 నిమిషాలు. ఈ స్ఫుటం కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రములో ఉన్నది.ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు.బుధుడు యోగి గ్రహమగును. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉంది కాబట్టి చంద్రుడు సహయోగి గ్రహమగును.బుదుడికి కుజుడు అవయోగి గ్రహమగును.

కావున పై జాతకచక్రం ప్రకారం జాతకమునకు 3 రాశుల 27 డిగ్రీల 31 నిమిషాలు యోగ బిందువు అగును.బుధుడు యోగి గ్రహం,చంద్రుడు సహయోగి గ్రహం,కుజుడు అవయోగి గ్రహం.రవి,రాహు,బుధలు ఒకే జట్టులోని గ్రహములగుటచే రవి బుధలు కూడా యోగి గ్రహములవలే ఫలితములనిచ్చును.
 
యోగి గ్రహం               అవయోగి గ్రహం
సూర్యుడు                  శని
చంద్ర                       బుధ
కుజ                        కేతు
బుధ                       కుజ
గురు                       రవి
శుక్ర                        గురు
శని                         శుక్ర
రాహు                      శుక్ర
కేతు                        రాహు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...