24, ఆగస్టు 2015, సోమవారం

గ్రహాలు అవస్ధలు



గ్రహాలు అవస్ధలు

శ్లో;-దీప్తాస్స్వస్ధో ముదిత శ్శాన్త శ్శక్తోని పీడితో భీతః
    వికలః ఖలశ్చకధితో నవ ప్రకారో గ్రహౌహరినా!


దీప్తావస్ధ,స్వస్ధావస్ధ,ముధితావస్ధ,శాంతావస్ధ,శాక్తావస్ధ,పీడావస్ధ,భీతావస్ధ,వికలావస్ధ,ఖలావస్ధ,దీనావస్ధ అను పది అవస్ధలలో రవ్వాది గ్రహములు ఏదో ఒక అవస్ధ పొందుదురు.

1)దీప్తావస్ధ:-గ్రహాలు ఉచ్చక్షేత్రంలో ఉంటే పొందే అవస్ధ. దీప్తావస్ధ యందున్న గ్రహం యొక్క దశలలో కీర్తి ప్రతిష్ఠలు,సకల సంపదలు కలుగును.

2)స్వస్ధావస్ధ:-గ్రహాలు స్వస్ధానంలో ఉన్నచో పొందే అవస్ధ.స్వస్ధానం యందున్న గ్రహం యొక్క దశలలో ధనం,సుఖాలు,సౌఖ్యాలు, కలుగును.

3)ముధితావస్ధ:-గ్రహాలు మిత్రక్షేత్రమందున్నప్పుడు పొందే అవస్ధ.ముధితావస్ధ యందున్న గ్రహం యొక్క దశలలో దనము,భోగాలు,రాజయోగాలు కలుగును.

4)శాంతావస్ధ:-గ్రహాలు సమక్షేత్రంలోను,శుభవర్గు యందున్న గ్రహం పొందే అవస్ధ. శాంతావస్ధ యందున్న గ్రహం యొక్క దశలలో శాంతము,సుఖము,భోగాలు,ధనం,విద్యార్జన,పరోపకార బుద్ధి,దర్మబుద్ధి కలుగును.

5)శాక్తావస్ధ:-గ్రహాలు వక్రించినప్పుడు పొందే అవస్ధ.గ్రహాలు వక్రత్వమును వీడి రుజుగతి యందున్నప్పుడు పొందే అవస్ధ.శాక్తావస్ధ యందున్న గ్రహం మూడవ వంతు,లేదా నాల్గవ వంతు బలం కలిగి తనకి సంబందించిన ఫలితాలను క్రమక్రమంగా ఇచ్చేదరు.శాక్తావస్ధ రవిచంద్రులకు ,రాహు కేతువులకు ప్రాప్తించదు. భోగాలు కీర్తిని పొందుతారు.

6)పీడావస్ధ:-గ్రహాలకు వేధ కలిగిన,గ్రహ యుద్ధమునందు ఓడిపోయినను రాశ్యాంతరమునందు ఉన్నను ఈ అవస్ధ కలుగును.కార్యహాని,వ్యతిరేకత,ఆటంకాలు,భాలు,రోగం,శత్రుభాదలు,,బందువులు దూరమగును.

7)దీనావస్ధ:-గ్రహాలు శత్రుక్షేత్రం లో ఉన్నప్పుడు,అధి శత్రు గ్రహముల యొక్క రాశులయందున్నప్పుడు  పొందే అవస్ధ. మరియు పనులలో ఆటంకాలు,శత్రుత్వము పొందగలరు.

8)ఖలావస్ధ:-గ్రహాలు నీచ క్షేత్రంలో ,శత్రు నవాంశ నందు,పాప షడ్వర్గుల యందు ఉన్నప్పుడు ఈ అవస్ధ పొందును.కలహాలు,నష్టాలు కలిగించును.

9)బీతావస్ధ:-గ్రహాలు అతిచారం,నీచ నవాంశ (గ్రహాలు రాశిచక్రంలో ఉచ్ఛలో ఉండి నవాంశ చక్రంలో నీచలో ఉన్నప్పుడు)పొందే అవస్ధ.బీతావస్ధ పొందిన గ్రహ దశలో దన నష్టము,దరిద్రం,కలుగును.


10)వికలావస్ధ:-గ్రహాలు అస్తంగత్వం పొందినప్పుడు ఏర్పడే అవస్ధ. వికలావస్ధ పొందిన గ్రహా దశలలో అశాంతి,అస్ధిరత్వము,రోగాభివృద్ధి కలుగును.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...