29, జులై 2015, బుధవారం

జాతకం పరిశీలించటం

జాతకం పరిశీలించటం

ఏ వ్యక్తి జాతకాన్ని అయిన పరిశీలన చేసేటప్పుడు జాతక చక్రంలోని గ్రహాలు పరిశీలించాలి.

1)ఉదయించే సమయానికి సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో అదే ఉదయ లగ్నం అవుతుంది.
సూర్యుడు ఉన్న రాశిలో లగ్నమున్న సుమారుగా సూర్యోదయ కాలం.
సూర్యుడికి 7 వ రాశిలో లగ్నమున్న సూర్యాస్తమయ కాలం.
సూర్యుడికి 4 వ రాశిలో లగ్నమున్న మిట్ట మద్యాన్నం.
సూర్యుడికి 10 వ రాశిలో లగ్నమున్న అర్ధరాత్రి అవుతుంది కాబట్టి గమనించాలి.2)సూర్యుడు జనవరి 14 నుండి ఫిబ్రవరి 15 వరకు మకర రాశిలో ఉంటాడు.ఈ విధంగా మనం పరిశీలించే జాతక చక్రం ఏ నెల,తేదీ గమనించి దాని ప్రకారం సూర్యుడు సరియైన రాశిలో ఉన్నాడో లేదో గమనించాలి.

3)సూర్యుడి నుండి బుధుడు 27° ,శుక్రుడు 45° మించి పోలేరు కాబట్టి ఇది గమనించాలి.

4)వక్రించిన గ్రహాలకు బలం ఎక్కువ కాబట్టి వక్రస్ధితిని గమనించాలి.వక్రించిన గ్రహాలు పూర్వ రాశి ఫలితాలనే ఇస్తాయి.గురువు మాత్రం ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ఫలితాన్నే ఇస్తాడు.
బుడుడు రవి నుండి ముందుకు వెళ్ళి 22° లలో వక్రించును.ఆయా రాసులను బట్టి 14° దూరంలో కూడా వక్రించును.
శుక్రుడు రవి నుండి ముందుకు వెళ్ళి  29°లలో వక్రించును.
కుజుడిని దాటి సూర్యుడు 4 రాశుల 11° ముందుకు వెళ్ళగానే కుజుడు వక్రించును.
గురువును దాటి సూర్యుడు 3 రాశుల 24° ముందుకు వెళ్ళగానే గురువు వక్రించును.
శనిని దాటి సూర్యుడు 3 రాశుల 19° ముందుకు వెళ్ళగానే శని గ్రహం వక్రించును.

5)గ్రహాలు వక్రించినపుడు కంటే అస్తంగతుడైనప్పుడు బలహీనులు.
బుదుడు సూర్యునికి ముందు ,వెనుక 14° దూరంలో అస్తంగత్వం పొందుతాడు.
శుక్రుడు సూర్యునికి ముందు వెనుక 10° దూరంలో అస్తంగత్వం పొందుతారు.
కుజుడు సూర్యునికి ముందు వెనుక 17° దూరంలో అస్తగత్వం పొందుతారు.
గురువు సూర్యునికి ముందు వెనుక 11° దూరంలో అస్తగత్వం పొందుతారు.
శనిగ్రహం సూర్యునికి ముందు వెనుక 15° దూరంలో అస్తగత్వం పొందుతారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...