26, ఆగస్టు 2015, బుధవారం

పాచక,బోదక,కారక,వేదక యోగాలుపాచక,బోదక,కారక,వేదక యోగాలు 

జాతకునికి ఈ సప్త గ్రహాలు అయా దశల యందు ఈ యోగాలు కలుగజేయును.పాచకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చు ఫలములను ప్రకాశింపజేయును..భోదకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చే ఫలములను బోదపరచేవాడగును.కారకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చు ఫలములను చేయించేవాడగును.వేదకయోగం పొందిన గ్రహం యొక్క దశలో వారిచ్చు శుభ ఫలములను నాశనము చేయువాడు అగును.


పాచక యోగం:-సూర్యునికి 6 వ స్ధానంలో శని ఉన్న,చంద్రునికి 5 వస్ధానంలో శుక్రుడు,కుజుడికి 2 వస్ధానంలో సూర్యుడు,బుధుడికి 2 వస్ధానంలో చంద్రుడు,గురువుకి 6 వ స్ధానంలో శని,శుక్రునికి 2 వస్ధానంలో బుధుడు,శనికి 3 వ స్ధానంలో శుక్రుడు ఉన్న పాచక యోగం అంటారు.ఈ యోగ జాతకులు ధన లాభం,భూలాభం,ధైర్య సాహసాలు,దేహ సౌఖ్యాలు,అదికారాలు కలిగి ఉంటారు.

బోదక యోగం:-సూర్యునికి 7 వ స్ధానంలో కుజుడు, చంద్రునికి 9 వస్ధానంలో కుజుడు, కుజుడికి 6 వస్ధానంలో చంద్రుడు, బుధుడికి 4 వస్ధానంలో గురువు, గురువుకి 8 వ స్ధానంలో కుజుడు, శుక్రునికి 6 వస్ధానంలో సూర్యుడు, శనికి 11 వ స్ధానంలో చంద్రుడు ఉన్న భోదక యోగం అవుతుంది.ఈ యోగ జాతకులు ధన దాన్యాలు,కీర్తి ప్రతిష్ఠలు, భక్తి,విద్యా ప్రావీణ్యం కలిగి ఉంటారు.

కారక యోగం:- సూర్యునికి 9 వ స్ధానంలో గురువు, చంద్రునికి 11 వస్ధానంలో శని,కుజునికి 11 వస్ధానంలో శని,బుధునికి 5 వస్ధానంలో శుక్రుడు,గురువుకి 7 వ స్ధానంలో చంద్రుడు,శుక్రునికి 12 వ స్ధానంలో గురువు,శనికి 6 వ స్ధానంలో గురువు ఉన్న కారకయోగం అంటారు.యోగ జాతకులు మిత్రగ్రహాలతో కూడినప్పుడు మంచి ఫలితాన్ని,శత్రుగ్రహాలతో కూడినప్పుడు దుష్ట ఫలితాన్ని ,కొంతకాలం భాగ్యవంతులుగాను,కొంతకాలం దారిద్ర్యపు జీవితాన్ని అనుభవించేవారుగాను,శత్రు భయం,చోరభయం,కుటుంబ కలహాలు కలిగి ఉంటారు.

వేదక యోగం:-సూర్యునికి 11 వస్ధానంలో శుక్రుడు,చంద్రునికి 3 వ స్ధానంలో సూర్యుడు,కుజునికి 12 వస్ధానంలో బుధుడు,బుధునికి 3 వస్ధానంలో కుజుడు,గురువునికి 12 వస్ధానంలో సూర్యుడు,శుక్రునికి 4 వస్ధానంలో శని,శనికి 7 వస్ధానంలో కుజుడు ఉన్న వేధక యోగం అవుతుంది.ఈ యోగ జాతకులు మిత్రగ్రహాలతో కూడినప్పుడు మంచి ఫలితాన్ని,శత్రుగ్రహాలతో కూడినప్పుడు దుష్ట ఫలితాన్ని ఇస్తారు.అధిక దన వ్యయం చేయువారుగాను,శత్రు భాధలు,రుణభాధలు,అగ్ని ప్రమాదాలు,అవమానాలు,అధికారుల వేదింపులు,వైరాగ్యము,స్ధాన చలనం, కలిగి ఉంటారు.  


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...