24, అక్టోబర్ 2014, శుక్రవారం

తులసిమాల(Tulasi Mala)

తులసిమాల....

తులసి మాలలో అత్యంత శ్రేష్టమైనవి వ్రిందావన్ (బృందావన్) తులసి .ఈ తులసి శ్రీ కృష్ణుని జన్మస్థానమైన మధుర పట్టణంలోని నిదివన్ మరియు సేవా కుంజ్ అను రెండు వనములందు లభించును.

జాతకచక్రంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు తులసిమాలతో జపం చేయటంగాని,మెడలో దరించటంగాని చేస్తే శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు.రామతులసి శుక్రగ్రహ దోషాలు పోవటానికి,కృష్ణతులసి శని గ్రహ దోషాలు పోవటానికి మెడలో దరిస్తారు.


కార్తీకమాసం ... పరమ పవిత్రమైన మాసంగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తులసిని పూజించడం వలన ... తులసిదళాలతో శ్రీమహావిష్ణువును అర్చించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. తులసిని పూజించడం వలన ... తులసిదళాలతో స్వామివారిని సేవించడం వలన ఎంతటి ఫలితం లభిస్తుందో, తులసిమాలను ధరించడం వలన కూడా అంతే ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.

లక్ష్మీనారాయణులు తులసిని ఆశ్రయించి ఉంటారు. అందువలన తులసిమాలను ధరించినవారిపై వాళ్ల కృపాకటాక్షాలు ఉంటాయని అంటారు. సాధారణంగా ఈ మాసంలో దైవారాధన ... దీక్షధారణ ... జపతపాలు ... ఎక్కువగా జరుగుతూ వుంటాయి. కార్తీకమాసంలో దీక్షలు చేపట్టేవాళ్లు ... జపాలు చేసుకునేవాళ్లు 'తులసిమాల'ను తీసుకుంటూ వుంటారు. జపం చేసుకునేందుకు ... కంఠహారంగాను తులసిమాలను ఉపయోగిస్తూ ఉంటారు.కార్తీకమాసంలో శివలింగాలకు పూజచేసే వారు శివలింగాలకు అలంకరణగా రుద్రాక్షమాలను,తులసి మాలను వాడతారు.

తులసిమాలను ధరించడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది ... ఆ ప్రశాంతత కారణంగా భగవంతుడి పాదాలపై దృష్టి నిలుస్తుంది. అంతే కాకుండా అనారోగ్యాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయి ... సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అనేక దోషాలను దూరంచేసి .. భగవంతుడిపట్ల మనసు నిలిచేలా చేసి .. తలపెట్టిన దైవకార్యాలు ఫలించేలా చేసి పుణ్యఫలాలను అందించడంలో తులసిమాల ప్రధానమైన పాత్రను పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

తులసి మాల :-50.00,బృందావన్ తులసి మాల:-250.00

  పై  తులసి మాల  కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...