18, అక్టోబర్ 2014, శనివారం

సాలగ్రామమాల (Salagramamala)

శనిగ్రహ దోష నివారణకు " సాలగ్రామమాల "

సాలగ్రామాలకి హిందూమతంలో బారీ ప్రాముఖ్యత కలిగివుంది. సాలగ్రామాలు నేపాల్ లోని ముక్తినాధ్ నందు గల “కాలగండకి”నది నందు లభిస్తాయి. ఈ నదినే “కృష్ణ గండకి” అని కూడ పిలుస్తారు.సాలగ్రామాలు నలుపు రంగులో మాత్రమే లభిస్తాయి.వ్రిందా అనే మహిళ శాపం వలన సాలగ్రామాలు నలుపు రంగును కలిగి ఉన్నాయి అని పురాణాలలో ప్రస్తావించారు.


శనిగ్రహ దోషానికి సాలగ్రామమాలను ధరించిన శనిగ్రహ భాదల నుండి ఉపశమనం కలుగుతుంది. సాలగ్రామమలను,కాపర్,ఇత్తడి,వెండి,బంగారం తీగతో అల్లించుకొని శివాలయంలో శనివారం రోజు అభిషేకించి మెడలో దరించాలి.సాలగ్రామమలను చాలా పవిత్రంగా చూసుకోవాలి.సాలగ్రామమాలను రాత్రి నిద్రించే ముందు తీసివేసి ఉదయం స్నానం చేసిన తరువాత ధరించాలి.రాత్రి పూట తీసివేసిన సాలగ్రామమాలను నీటిలో ఉంచాలి.

సాలగ్రామమాలను మాంసాహారం తినే సమయమందు,మద్యం సేవించునప్పుడు,శ్మశాన సందర్శనప్పుడు ధరించరాదు.సాలగ్రామమాలను దరించినవారు శని మహాదశ ,ఎల్నాటిశని,అష్టమశని,అర్ధాష్టమశని భాదలనుండి విముక్తి పొందుతారు.

శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలు కూడా వున్నట్టు.

వింశోత్తరీ దశా విధానంలో శని దశ 19సంవత్సరాలు ఉంటుంది. అతి పెద్ద దశ అయినశుక్ర దశ తరువాత ఇదే ఇన్నిఏళ్ళు ఉండే దశ.సామాన్యంగా శని దశ అంటే మనకు భయం ఉంటుంది. 

సహజ జ్యోతిష్య చక్రంలో (Natural Zodiac) ఈయనకు 10,11 స్థానములు అయిన మకరం కుంభం స్వక్షేత్రములు. కనుక కర్మ, లాభ స్థానముల కారకత్వములు ఈయనకు ఉంటాయి. అనుభవించాల్సిన కర్మను అనుభవింప జేయటం, ఇవ్వ వలసిన లాభములను ఇవ్వటం చేస్తాడు.ఈయన యొక్క సహజ లక్షణాలైన బద్ధకం, సోమరితనం, పనులు కాకపోవటం, నిరాశా నిస్పృహలు, నరాల, ఎముకల రోగాలు, పెద్దల మరణాలు,చికాకులు, అంగ వైకల్యం కలగటం, ఏక్సిడేంట్లు కావటం మొదలైనవి జరుగుతాయి. చర రాశులకు 11 స్థానం బాధకస్థానం గనుక ఈయన దశ సాధారణంగా అనేక బాధలను ఇస్తుంది. 

గోచార రీత్యా, జనన కాల చంద్ర స్థితికి శని ప్రస్తుతం సంచారంచేస్తున్న ఇంటిని బట్టి ఫలితములు ఉంటాయి. ఇందులో ముఖ్యముగా చూడవలసినది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని. లగ్న చంద్రునికి12,1,2 స్థానాలలో శని సంచారమే ఏలినాటి శని. శని సంచారం ఒక్కొక్కరాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటుంది కనుక ఈ మూడు స్థానాలకు కలిపి ఏడున్నర ఏళ్ళు ఉంటుంది.

ఏలినాటి శని 12 లో సంచరిస్తున్నపుడు అనవసర ఖర్చులు, రోగాలు, ఆస్పత్రి లో చేరటం,నిరాశ, ఆధ్యాత్మిక చింతన పెరగటం, ఎడమ కంటికి రోగం, తల్లి మరణం, పని కలసి రాకపోవటం ఉంటాయి.
చంద్రుని మీదికి వచ్చినపుడు, మానసిక ఆందోళన, భయం, తల్లికి ప్రాణగండం లేక మరణం, మాత్రు సంబంధ బంధువుల మరణాలు, భార్యకు ఆరోగ్యభంగం, చేసే వృత్తిలో ఆటంకాలు, చికాకులు, తన ఆరోగ్యం దెబ్బ తినటం జరుగుతాయి.

రెండవ స్థానంలో కొచ్చినపుడు కుటుంబ చికాకులు, కుడి కంటికి రోగం,అతివాగుడు వల్ల ప్రమాదాలు, లేక మాట్లాడ వలసిన చోట మాట రాకపోవటం, భోజన సౌఖ్యం కొరత, జీర్ణాశయ బాధలు, కుటుంబంలో మరణాలు ఉంటాయి. కనుకనే ఏలినాటి శని అంటే జనులలో భయం ఉంటుంది.

అర్ధాష్టమ శని జరుగు తున్నపుడు విద్య లో ఆటంకాలు, గుండెజబ్బులు, ప్రయాణంలో ప్రమాదాలు, తల్లి మరణం,స్ధిరాస్తి విషయాలలో ఇబ్బందులు. మొదలైనవి ఉంటాయి.

అష్టమ శని జరిగే టపుడు: పనులు సర్వ నాశనం కావటం, ప్రతిపనిలోనూ నష్టం, స్వమరణం, కోర్టు చిక్కులు, ప్రత్యర్థుల దాడులు, దీర్ఘరోగాలు మొదలైనవి ఉంటాయి.

శని దశ ఒక జాతకానికి చెడు చేసేదిగా ఉండి, ఆ దశలో ఏలినాటి శని వస్తే ఆ జాతకుడుపడే బాధలు ఆ దేవుని కెరుక. ఏ గ్రహ శాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, జపాదులను చిత్తశుద్ధితో చేయడం మంచిది. దేవతామూర్తులకు, సద్భ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారాలు చేసినట్లైతే కొంతమేరకు దోషప్రవృత్తి తగ్గవచ్చు.
సాలగ్రామమాల :-2500.00.

  పై  సాలగ్రామమాల  కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...