11, అక్టోబర్ 2014, శనివారం

నల్ల పసుపు (Black turmeric) (Black Haldi)

శనిగ్రహ దోష నివారణకు నల్ల పసుపు 

జాతకంలో శనిగ్రహ దోష నివారణకు నల్ల పసుపు చాలా బాగ ఉపయోగ పడుతుంది. నల్ల పసుపు అనేక దుష్ప్రభావాలను అరికడుతుంది.నల్లపసుపు ని "కృష్ణ హరిద్ర"అని అంటారు.
నల్లపసుపు తాంత్రిక విధానంలో ధనవృద్ధి కారక వస్తువుగా ఉపయోగపడుతుంది.నల్ల పసుపు తాంత్రిక, వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన పసుపు. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ మరియు నేపాల్ లోను లభిస్తుంది. 


నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన నిషా, నిషి, రజిని, రాత్రి మొక్క నల్ల పసుపేనని భావిస్తారు.దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది., పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాలీ హాల్దీ అని పిలుస్తారు. కాలీ అంటే నలుపు ఆని అర్ధం. అందుకే ఈ రకం పసుపుకి నల్లపసుపు అని పేరు వచ్చింది. ఆంగ్లంలో నల్ల పసుపును "Black Turmeric" అని అంటారు.

దృష్టి దోషాలు ... గ్రహపీడలు ... తాంత్రిక సంబంధమైన ప్రయోగాల వలన నానా ఇబ్బందులు పడుతున్న వారు, నల్ల పసుపు కొమ్మును గింజలుగా చేసి మాలగా కట్టి, సాంబ్రాణితో ధూపం వేసి ధరిస్తే ఫలితం వుంటుంది. రెండు ... మూడు నల్ల పసుపు కొమ్ములను సిందూరం రంగు గుడ్డలో కట్టి, ప్రధాన ద్వారం పైన కట్టడం వలన దుష్టగ్రహాల బారి నుంచి బయట పడవచ్చు. అయితే ప్రతిరోజు ఇంట్లో పూజ అయ్యాక ప్రవేశ ద్వారానికి కట్టిన పసుపు కొమ్ములకు ధూపం చూపించవలసి వుంటుంది.

నల్లపసుపు దుంపను జేబులో పెట్టుకున్నా, గుమ్మానికి వ్రేలాడదీసినా దుష్టశక్తులు వెళ్ళిపోతాయని, భారతదేశంలో చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా నల్లపసుపు దుంపను తాంత్రిక విద్యల్లో వాడతారు. వశీకరణ చర్యలకు తాంత్రికులు నల్ల పసుపు ను ఆవు మూత్రంతో పేస్టులా చేసి దానిని నుదుటికి కుంకుమ వలె పెట్టుకుంటారు. నల్లపసుపుని చూర్ణం చేసి కొద్దిగా పాలతో వేసుకొని తాగినచో శనిగ్రహ దోష నివారణతోపాటు దీర్ఘకాల అనారోగ్యాలు నివారణ అవుతాయి.నల్లపసుపు కొమ్ము పొడిని తాయిత్తులలో ఉంచి దరించిన శనిగ్రహ భాదననుండి విముక్తి కలుగుతుంది.నల్లపసుపు కొమ్మును పొడి చేసి చందనంతో కలిపి నుదుట ధరించిన నరదృష్టి ఉండదు.

నల్లపసుపు దుంపను నలగ్గొట్టి రసాన్ని పార్శపు నొప్పికి, కడుపులో అపానవాయువులకు, దెబ్బలకు వాడతారు. కడుపునొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో నల్ల పసుపు పొడిని కలిపి ఇస్తారు; జ్వరం, గ్యాస్ ఇబ్బంది ఉన్నప్పుడు దుంప రసాన్ని త్రాగిస్తారు, దెబ్బలకు దుంప పేస్టుని వ్రాస్తారు. దగ్గు, ఆస్తమా నుండి ఉపశమనం పొందేందుకు రాత్రి వేళ పడుకునే ముందు నల్ల పసుపు దుంపను తింటారు. వరిబీజాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రపరచి నల్లపసుపు పేస్టును వ్రాసి దానిపై తమలపాకులు కడతారు. 

నల్ల పసుపు కొమ్ముని శనివారం రోజు పూజ చేసుకొని బీరువాలోగానీ,గళ్ళాపెట్టెలో గాని ఉంచిన దనాభివృద్ధి ఉండును.నల్ల పసుపును ఇంటి గుమ్మానికి గాని,షాపు గుమ్మానికి గాని ఎర్రటి గుడ్డలో కట్టి వ్రేలాడదీసిన ఎటువంటి దుష్ట శక్తులు దరిచేరవు. పసుపు కొమ్మును ఒక మంచి రోజున ఇంటికి తీసుకు వచ్చి పూజలో ఉంచాలి. ఆ తరువాత ఉపయోగించడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది. ఈనల్లపసుపు శని గ్రహ దోషాల వలన వచ్చే దుష్ప్రభావాలను అరికట్టి దీర్ఘకాళిక భాదలను తగ్గిస్తూ ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించే మహిమను కలిగి వుంటుంది. ఇక దుష్ట గ్రహాల కారణంగా కలిగే బాధల నుంచి విముక్తి కలిగించడంలో ఇది ప్రధానపాత్రను పోషిస్తుంది.

 నల్ల పసుపు కొమ్ము:-100Grms:-100.00
 
  పై నల్ల పసుపు కొమ్ము కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

3 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...