31, అక్టోబర్ 2014, శుక్రవారం

లాపిస్ లాజులి స్టోన్ (Lapis Lazuli )

శనిగ్రహ దోష నివారణకు "లాపిస్ లాజులి స్టోన్" (Lapis Lazuli ) శివలింగం....

నిత్య జీవితంలో కొన్ని నియమాలు పాటిస్తే శని గ్రహ దోషం నుండి విముక్తి పొందవచ్చు.జైమిని సిద్ధాంతంలో శని మహాదశలలో,ఏల్నాటి శని,అష్టమశని ,అర్ధాష్టమ శని జరిగేటప్పుడు ఎవరి వ్యాపకాలలో వారు ఉంటే శని ఏమి చేయడు.ఇతరుల పనులలో అనవసరంగా తలదూర్చటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.


చేస్తున్న వృత్తిని వదిలేసి కొత్త వృత్తిని చేస్తున్న ఇబ్బందులు ఎదుర్కొంటారు.శని దోషం త్వరగా ప్రసరించేది మాలిన్యంగా ఉన్న పరిసర ప్రదేశాలు.కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాన్ని పరిశుబ్రంగా ఉంచుకోవాలి.ఒకరి చెప్పులు మరొకరు దరించిన శని దోషం నుండి విముక్తి పొందలేరు.

ఒకరోజు దరించిన దుస్తులు మరొకరోజు ధరించటం వలన కూడ శని గ్రహ ప్రభావాన్ని ఎదుర్కోనవలసి ఉంటుంది.పగలు నిద్రా సామాగ్రి వాడటం వలన కూడ శని గ్రహ ప్రభావాన్ని ఎదుర్కోనవలసి ఉంటుంది. పగలు నిద్రపోవటం,పగలు మంచంపైన గంటల తరబడి కుర్చోవటం నిద్రపోవటం,శని గ్రహ దోష ప్రభావాన్ని ఎదుర్కోనవలసి ఉంటుంది.

రాత్రులందు తలకి తైలం రాసుకొని నిద్రించటం వలన కూడ శని గ్రహ దోషం నుండి విముక్తి పొందలేరు. ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడకూడదు.తోలుతో చేసిన వస్తువులు,ఇనుము, ఇనుముతో చేసిన వస్తువులు ఉచితంగా తీసుకోరాదు.బయట తిరిగివచ్చిన చెప్పులతో ఇంటిలో కలియ తిరగటం వలన శనిగ్రహ దుష్ట ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చెప్పులు,చదువుకునే పుస్తకాలను విసిరికొట్టటం మంచిది కాదు.

నల్ల చీమలను చంపటం,అనాదలు,నిరుపేదవాళ్ళను,శ్రామికులను,ముసలివాళ్ళను,మానసిక వికలాంగులను దుర్భాషలాడటం,హింసించటం వలన కూడా శని ఆగ్రహానికి పాత్రులవుతారు. చేతిగోళ్ళు నోటితో కొరుక్కోవటం ,నువ్వులనూనె,నువ్వులు అప్పుగా తీసుకోవటం వలన కూడ శనిగ్రహ దుష్ట ప్రభావానికి గురవుతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...