13, అక్టోబర్ 2014, సోమవారం

సన్ స్టోన్ శివలింగం(Sun Stone Shiva Lingam)

సన్ స్టోన్ శివలింగం

శనిగ్రహం వలన కలుగు ఆలస్య వివాహమునకు హరితాలికా వ్రతం....

శనిగ్రహం వలన కలుగు ఆలస్య వివాహమునకు సన్ స్టోన్ శివలింగంతో (సైకత లింగం) హరితాలికా వ్రతం చేసిన యెడల వివాహ ఆలస్య ప్రభావము తగ్గిపోవును.

సప్తమ బావము వివాహము మరియు జీవిత బాగస్వామి యొక్క భావముగా చెప్పబడుతున్నది. సప్తమాదిపతి శని అయిన సప్తమస్ధానాన్ని శని చూస్తున్న కొన్ని సందర్బాలలో వివాహము ఆలస్యముగా జరుగును. మరియు కలహములతో గృహస్థ జీవనము అశాంతిగా వుండును.
సప్తమ బావములో శని నీచ పట్టి వుండిన ఎడల వ్యక్తి కామ ప్రేరితుడై ఎవరో ఒకరితో అనగా తన కన్న వయస్సులో చాలా పెద్దవారితో కూడా వివాహము చేసుకొనెదరు. సప్తమ శని మరియు దానితో పాటు యుతి కలిగించు చున్నగ్రహములు వివాహము మరియు గృహస్థ జీవితమునకు శుభ కారకముగా వుండవు.
శని ఎవరి జన్మకుండలిలో అయితే ఆరవ బావములో వుండునో మరియు అష్టమములో సప్తమాదిపతి బలహీనముగా వుండిన లేదా పాప పీడితమైన ఎడల కూడా వారి వివాహములో చాలా బాధలు కలుగగలవు. ఏ స్త్రీకి అయినను వివాహములో శని గ్రహ కారణముగా ఆలస్యం కలుగుతున్నవో వారు “హరితాలికా వ్రతము”ను చేపట్టవలెను మరియు శని భగవానుని పూజించవలెను. పురుషులకు కూడా శని దేవుని ఉపాసనము వలన లాభము కలుగును మరియు వారి వివాహము తొందరగా జరుగును.
హరితాలికా వ్రత కధ
కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది - ‘‘స్వామీ! తక్కువ శ్రమతో, ధర్మాచరణతో ఎవరు నిను భక్తిశ్రద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవౌతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక, జగవూత్పభువైన మీరు నాకు యే తపోదాన వ్రతమాచరించుటచే లభించారు’’ అని అడిగింది. ప్రసన్నవదనంతో పరమశివుడు ‘‘దేవీ! వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతమొకటున్నది. దాన్నెవరాచరించినా నేను వారికి వశుడనైతాను. ఈ వ్రతాన్నాచరించినవారు సర్వపాప విముక్తులవుతారు. ‘‘దేవీ! నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహా వ్రతాన్ని ఎలా ఆచరించావో చెబుతాను. విను!’ అన్నాడు.
భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచుచేత కప్పబడి బహుసుందరమైన హిమవత్పర్వతము కలదు. హిమవంతుడా ప్రాంతానికి ప్రభువు. నీవాతని కూతురువు. చిన్నతనం నుంచే శివభక్తురాలవు. యుక్తవయసు వస్తున్న నీకు వరుడెవరగునా?యని హిమవంతుడాలోచించగా, త్రిలోక సంచారి నారద మునీశ్వరులొకనాడు మీ తండ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్య పాద్యాలందించి మీ తండ్రి నిను చూపి, ఈ కన్యనెవరికిచ్చి వివాహం చేయవచ్చును, తగిన వరుడెవరని నారదుని అడిగినాడు. వెంటనే నారదుడు ‘ఓ గిరిరాజా! నీ కన్యారత్నమున కన్నివిధముల యోగ్యమైనవాడు బ్రహ్మాదిదేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చానన్నాడు’. సంతోషంతో హిమవంతుడు మునీందరా ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నినుపంపాడు కనుక గౌరవించి, అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపుమన్నాడు. నారదుడందుకంగీకరించి బయలుదేరాడు.
హిమవంతుడానందంతో భార్యాపిల్లలకావిషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి ‘ఓ పుత్రీ! గరడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని’ తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్లి పొర్లిపొర్లి దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనసా పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకుని స్నేహితురాలికొక ఉపాయం చెప్పింది. నీ త్రండి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వనప్రాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి, ఏడ్చి మూర్ఛిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీభక్తికి మెచ్చి సైకత లింగాన్ని (ఇసుక) ,(సన్ స్టోన్) చేసుకొని పూజిస్తున్న నీకు నేను ప్రసన్నుడైనాను.
చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని ‘‘హరితాలిక వ్రతం’’ అంటారు. ఆరోజు శివరాత్రివలె ఉపవసించి, రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని “సన్ స్టోన్” లింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి’’ అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు. 16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథులు ముళ్లు వేసి తోరానికి గ్రంథిపూజచేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...