13, జులై 2017, గురువారం

గురుగ్రహ దోష నివారణకు "సిట్రిన్ స్టోన్ ట్రీ"

గురుగ్రహ దోష నివారణకు "సిట్రిన్ స్టోన్ ట్రీ"

సిట్రిన్ స్టోన్ ట్రీని ఇంటిలో గాని ఆపీసు,వ్యాపార సంస్ధలలో గాని తూర్పు ఈశాన్య దిక్కుల యందు టేబుల్ పైన గాని,షోకేష్ నందు గాని ఉంచాలి.పిల్లలు చదువుకునే టేబుల్ పైన ఉంచిన చదువులో ఏకాగ్రత ఉంటుంది.

జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో సంతాన సౌఖ్యత లేక పోవటం,కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట,నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట,ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం,షుగర్,క్యాన్సర్,మూత్ర రోగాలు,పెద్ద పొట్టతో కలిగిన దేహం,పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం,గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.


రోగం వస్తే తొందరగా తగ్గదు.లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, నియంతగా ప్రవర్తించుట,బృహస్పతి అనుగ్రహం ఉంటే మంచి విద్యాజ్ఞానం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన విజ్ఞానమే. కేంద్రాధిపత్యం వచ్చిన బృహస్పతి బహుదోషి. ఈయన మారక స్థానంలో ఉంటే వెంటనే మారకం చేస్తారు అని శాస్త్ర వచనం. అలాగే జన్మ లగ్నంలో మూడవ ఇంట బృహస్పతి ఉంటే అది బాలారిష్టం. మిగిలిన గ్రహ బాలారిష్టముల కంటే గురువుతో వచ్చే బాలారిష్టములు అత్యంత ప్రమాదకరమయినవి. కారణం ఆయన దేహ కారకుడు. దేహపుష్టికి కారకుడు .గోచార ఫలితాంశ నిర్ణయంలో కూడా గురువు ప్రభావం అధికంగా ఉంటుంది. ఏలినాటి శని నడుచుచున్ననూ గురుచారం బాగుంటే కాలం బాగా నడచును.

గురువు మేధావి వర్గానికి ప్రతీక, గురువు ప్రభావం అధికంగా గల వ్యక్తులు మేధావులవుతారు. అతి మేధావుల చరిత్రలు పరిశీలిస్తే వారి ప్రవర్తన బహు చిత్రంగా ఉంటుంది. తమ టెలిఫోను నెంబరు తామే మర్చిపోవడం, తాము అన్నం తిన్నారో లేదో తమకే గుర్తుండకపోవడం, తమ ఇంటి అడ్రస్‌ తమకు తెలియక ఫోన్‌ చేసి కనుక్కోవడం మొదలైన చిత్రవిచిత్రాలు చేస్తారు. మహా మేధావులు అతిస్వల్ప విషయములలో ఏమరపాటు కలిగి ఉండడానికి కారణం వారు ఆలోచించే ధోరణిలో అతిగా ఏకాగ్రత కలిగి తాము ఏ నూతనాంశమును కనుగొంటున్నారో దాన్ని తప్ప మిగిలిన అంశాలను పట్టించుకోకపోవడమే. నిజానికి అన్ని విషయాలూ పట్టించుకుంటే ఒక విషయంలో ఏకాగ్రత కలిగి ఉండడం అసంభవమే.

ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పారాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శిం చుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.గురు గ్రహ దోషనివారణకు పసుపు రంగు స్టోన్ నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును. పసుపు కొమ్ము గణపతిని, పసుపు రంగు స్టోన్ గణపతిని పూజిస్తే చాలా మంచిది. పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు ఇంద్రుడిని పూజించేవారు, ప్రస్తుతం సాయిబాబా, దత్తత్రేయ, హయగ్రీవుడిని పూజిస్తున్నారు

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...