1, జులై 2017, శనివారం

సాయన పద్ధతిలో శని సంచార ఫలితాలు

సాయన పద్ధతిలో శని సంచార ఫలితాలు

పరాశర పద్ధతిలో చంద్ర రాశిని ఆధారంగా చేసుకొని గోచార ఫలితాలను చూస్తారు. సాయన పద్ధతిలో రవి ఉన్న రాశిని ఆధారంగా చేసుకొని గోచార ఫలితాలను చూస్తారు. రవి ఉన్న రాశిని  సాయన పద్ధతి ఆధారంగా నిర్ణయించాలి. రాశి, భావ కారకత్వాల ఆధారంగా ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు జన్మరాశికి ఏ భావంలో ఉంటాయో ఆ భావాలకు ప్రాదాన్యం ఉంటుంది.

వివిధ బావాలలో శని సంచారం జరుగుతున్నప్పుడు ఆ బావాలకు సంబందించిన వ్యవహారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. చేసే ప్రతి పనిలో ఏకాగ్రత, జాగ్రత్త, సహనం, అధికశ్రమ, భద్రత అవసరం పడతాయి. పనులలో ఆటంకాలు, ఆలస్యం ఏర్పడతాయి. శుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు శుభఫలితాలను పొందవచ్చును. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు వైఫల్యం, ఆరాటం, ఆవేదన, కష్ట నష్టాలు సంభవిస్తాయి. శని గోచారంలో అధికంగా రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచారం చేయటం వలన దీర్ఘకాలికమైన ఫలితాలు ఉంటాయి.


సూర్యరాశిలో శని సంచారం చేయటం వలన వ్యక్తిగత భాద్యతలు పెరుగుతాయి. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు తరచుగా అనారోగ్యాలు కలుగుతుంటాయి. ప్రతి చిన్న విషయాలకు అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది.

సూర్య రాశికి ద్వితీయ స్ధానంలో శని సంచారం చేయటం వలన భూ, గృహాది స్ధిరాస్తుల విషయంలో బాధ్యతలు పెరుగుతాయి. ధనాన్ని వృదాగా ఖర్చు పెట్టకుండా పొదుపుగా ఉంటారు. ఆస్తులు కూడ పెడుతారు. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు ఆర్ధిక సమస్యలు ఏర్పడతాయి.

సూర్య రాశికి తృతీయ స్ధానంలో శని సంచారం చేయటం వలన విద్యా సంబంద విషయాలలో, సోదరీ సోదరుల విషయాలలో బాధ్యతలు పెరుగుతాయి. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు కొన్ని రకాల విషాద సంఘటనలు, ప్రమాదాలు సంభవిస్తాయి.

సూర్య రాశికి చతుర్ధ స్ధానంలో శని సంచారం చేయటం వలన కుటుంబ బాధ్యతలను పెంచుతుంది. స్ధిరాస్తుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు వయో వృద్ధులైన తల్లి తండ్రుల లేదా వయో వృద్ధులైన బందువుల ఆరోగ్య విషయాలు ఆందోళన కలిగిస్తాయి.

సూర్య రాశికి పంచమ స్ధానంలో శని సంచారం చేయటం వలన అనుబంధాలు బలపడతాయి. సంతాన విషయంలో బాధ్యతలు పెరుగుతాయి. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు కొన్ని విషయాలలో చిక్కులు, నష్టాలు సంభవిస్తాయి.

సూర్య రాశికి షష్టమ స్ధానంలో శని సంచారం చేయటం వలన ఉద్యోగ, వ్యవసాయ, వైద్య, పారిశ్రామిక రంగాలలో బాధ్యతలు పెరుగుతాయి. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు ఉద్యోగ, పోటీతత్వ విషయాలలో సమస్యలు ఏర్పడతాయి.

సూర్య రాశికి సప్తమ స్ధానంలో శని సంచారం చేయటం వలన వివాహా యత్నాలు ఆలస్యం ఐన సంసార బాధ్యతలు ఏర్పడతాయి. దీర్ఘకాలికమైన ఒప్పందాలు ఏర్పడతాయి. గురువుల, పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు వైవాహిక భాగస్వామ్య విషయాలలోను, వ్యాపార బాగస్వామి విషయాలలోనూ అపోహలు సమస్యలు ఏర్పడతాయి.

సూర్య రాశికి అష్టమ స్ధానంలో శని సంచారం చేయటం వలన విషాద సంఘటనలు జరుగును. ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు దీర్ఘకాలం సమస్యలు పీడిస్తాయి.

సూర్య రాశికి నవమ స్ధానంలో శని సంచారం చేయటం వలన ఉన్నత విద్యా రంగాలలో బాధ్యతలు అధికమవుతాయి. వీటిలో సమస్యలు ఏర్పడతాయి. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు విదేశీ వ్యవహారాలలో చిక్కులు ఉంటాయి.

సూర్య రాశికి దశమ స్ధానంలో శని సంచారం చేయటం వలన అధికారం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలలో బాధ్యతలు ఏర్పడతాయి. అశుభదృష్టి, యుతి వలన అధికార పతనం కలగవచ్చు. వీటిలో సమస్యలు, ఆటంకాలు ఎక్కువవుతాయి.

సూర్య రాశికి ఏకాదశ స్ధానంలో శని సంచారం చేయటం వలన బంధు మిత్రుల బాధ్యతలు పెరుగుతాయి. అశుభదృష్టి, యుతి వలన వీరి బాధ్యతల వలన ధన నష్టం కలగచ్చు.

సూర్య రాశికి వ్యయ స్ధానంలో శని సంచారం చేయటం వలన ఆరోగ్యం మందగిస్తుంది. సమయం వృధా అవుతుంది. విశ్రాంతి లోపిస్తుంది. నిద్ర సరిగా ఉండదు. అశుభ దృష్టి, సంయోగం ఏర్పడినప్పుడు ధన నష్టం కలగచ్చు.

2 వ్యాఖ్యలు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...