28, ఏప్రిల్ 2017, శుక్రవారం

వృషభ లగ్నములో లగ్నస్థ నవగ్రహముల యొక్క ఫలితములు

వృషభ లగ్నములో లగ్నస్థ నవగ్రహముల యొక్క ఫలితములు

రాశి చక్రములో రెండవ రాశి వృషభము. మీ కుండలిలో లగ్న భావములో ఈ రాశి వుండిన ఎడల మీ లగ్నము వృషభముగా చెప్పబడును. మీ లగ్నముతో బాటు మొదటి స్థానములో ఏ గ్రహమైతే వున్నదో అది మీ లగ్నమును ప్రభావితము చేయును.
వృషభ లగ్నములో లగ్నస్థ సూర్యుడు

ఈ లగ్నములో సూర్యుడు కారక గ్రహము మరియు చతుర్ధాధిపతి కాగలడు . లగ్న భావములో సూర్యుడు వారి శత్రువైన శుక్రుని రాశిలో స్థితిలో వుండి శుభ ఫలితములలో లోపములను కలిగించును. తల్లి దండ్రుల నుండి వీరికి సామాన్య సుఖము లభించును. ప్రభుత్వ రంగము నుండి కూడా వీరికి సామాన్యముగా వుండును. సప్తమ బావములో సూర్యుని దృష్టి వుండుట కారణముగా జీవిత బాగస్వామితో మతబేదములు దాంపత్య జీవితములో అశాంతి కష్టములు కలుగును. ద్విపత్నీ యోగమును కూడా కలిగించును. ఉద్యోగములో అస్థిరత్వము మరియు సహోద్యోగులతో సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. ఈ లగ్నములో ప్రధమ బావములో సూర్యుడు వుండుట కారణముగా చాలా తక్కువ వయస్సులోనే తలవెండ్రుకలు రాలిపోవును.

వృషభ లగ్నములో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు ఈ లగ్నములో ఉచ్చ స్ధితిలో వుండుట కారణముగా ఇది సాదారణముగా ఉత్తమ ఫలితములను ఇచ్చును. లగ్నస్థ చంద్రుని ప్రభావము కారణముగా మనోభలము మరియు ఆత్మ భలము ఎల్లప్పుడూ వుండును. బంధు మిత్రుల నుండి సమ్యోగము మరియు సుఖము ప్రాప్తించగలదు. మాట్లాడే పద్దతి మధురతతో కూడినదై వుండును. చంద్రుడు పూర్ణ దృష్టి నుండి సప్తమ బావమును చూస్తున్నాడు. చంద్రుని ఈ దృష్టి జీవిత బాగస్వామి విషయములో ఉత్తమ పరిణామ దాయకముగా వుండును. జీవిత భాగస్వామి అందముగాను మరియు ఆకర్షణీయముగాను వుండును. వైవాహిక జీవితము సామాన్య రూపముగా సుఖ మయముగా వుండును. ఆర్ధిక స్థితి బాగుండును.


వృషభ లగ్నములో లగ్నస్థ కుజుడు

వృషభ లగ్నము యొక్క కుండలిలో కుజుడు సప్తమాదిపతి మరియు ద్వాదదశాదిపతిగా వుండును.  ఈ లగ్నము సామాన్యముగా వుండును. ప్రధమ బావములో వున్న కుజుడు ఆకర్షణీయమైన మరియు అందమైన శరీరమును ప్రదానించును. వీటి ప్రభావము వలన వ్యక్తి గౌరవనీయకముగా వుండును. ఆత్మవిశ్వాసము అధికముగా వుండును. ఈ లగ్నములో కుజుడు సప్తమాదిపతి మరియు ద్వాదశమాదిపతిగా వుండుట వలన సహొద్యోగుల నుండి మరియు ఉద్యోగము నుండి లాభము కలుగును. దేశ విదేశములు వెల్లే అవకాశములు కలుగవచ్చును. లగ్నములో స్థితిలో వున్న కుజుని దృష్టి   చతుర్ధ బావముపై వుండును. దాని ప్రబావము కారణముగా భూమి, భవనము, వాహనము మరియు తల్లి యొక్క సుఖములలో లోపము ఏర్పడగలదు. సప్తమ బావములో ధృష్టి సంబందము వుండుట కారణముగా వైవాహిక జీవితములో వొడిదుడుకులు వుండును. వీరికి సంతానము మరియు భార్య కారణముగా కష్టములు ఏర్పడును. దెబ్బ తగులుట మరియు రక్త వికారమునకు అవకాశములు వున్నవి. వీరికి ఖర్చుల స్థితిని కూడా ఎదుర్కొనవలసి వుండును.

వృషభ లగ్నములో లగ్నస్థ బుధుడు

బుధుడు వృషభ లగ్నము యొక్క కుండలిలో యోగకారక గ్రహముగా వుండును. ఈ లగ్నములో ద్వితీయాదిపతి మరియు పంచమాదిపతిగా వుండి శుభపరిణామములు కలిగించును. ప్రధమ బావములోని బుధుడు బుద్ధివంతునిగాను మరియు ధనవంతునిగాను చేయును. వీరికి వ్యాపారములో మంచి సఫలత లభించును. లగ్నస్థ బుధుడు వినోద స్వబావము గల వ్యక్తిత్వమును ప్రదానించును. ఇటువంటి వ్యక్తి జీవితమును ఆనందముగా మరియు ఉల్లాసముగా జీవించవలననే కోరిక కలిగి వుండెదరు. వీరికి ప్రభుత్వ పక్షము నుండి అనుకూలత లబించగలదు. జీవిత భాగస్వామి యొక్క సందర్బములో బుధుడు మంగళకారిగా వుండును. లగ్నస్థ బుధుడు అందమైన మరియు బుద్దివంతుడైన జీవిత భాగస్వామిని ప్రదానించును. వ్యాపారము మరియు ఉద్యోగ రంగములో లాభములను కలిగించును. బాగస్వామ్యకత్వము చాలా ఎక్కువ ఫలదాయకముగా వుండును.

వృషభ లగ్నములో లగ్నస్థ గురువు

గురువు వృషభ లగ్నములో  అష్టమ మరియు ఏకాదశ బావము యొక్క అధిపతి కాగలడు. శత్రు గ్రహము యొక్క రాశిలో స్థితిలో వున్న గురువు బలహీన ఫలితములను ఇచ్చును. వ్యక్తికి ఆరోగ్య సంబంద సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును. జీవనోపాయ విషయములో సమస్యలను ఎదుర్కొన వలసి వుండును. వీరికి మానసిక సమస్యలను కూడా ఎదుర్కొనవలసి వుండును. పరిశ్రమకు తగ్గ ప్రతిఫలము లభించుట కష్టము. లగ్నములో స్థితిలో వున్న గురువు పంచమ, సప్తమ మరియు నవమ బావమును చూస్తున్నాడు. గురువు యొక్క ఈ దృష్టి కారణముగా వ్యక్తి యొక్క బాగ్యము బలహీనముగా వుండును. గురువు వీరికి ఙ్ఞానము, సంతానము మరియు ధర్మమును ప్రభావితము చేయును. సప్తమ బావములో గురువు యొక్క దృష్టి వుండుట కారణముగా వైవాహిక జీవితములో జీవిత భాగస్వామి నుండి అనుకూల పరిణామములు లభించవు.

వృషభ లగ్నములో లగ్నస్థ శుక్రుడు

శుక్రుడు వృషభ లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతి మరియు షష్టమాదిపతిగా వుండును. లగ్నస్థముగా వుండి వ్యక్తిని అందముగాను మరియు ఆకర్షణీయముగాను చేయును. ఇది వ్యక్తికి ఆత్మ భలమును మరియు ఆత్మ విశ్వాసమును ప్రదానించును. షష్టమాదిపతి శుక్రుడు రోగములను, వ్యాదులను ఇచ్చును. శుక్ర దశ యొక్క సమయములో ఆరోగ్యములో వొడిదుడుకులు వుండగలవు. ప్రధమ బావములో స్థితిలో వున్న శుక్రుడు సప్తమ బావమును చూస్తున్నాడు దానివలన బౌతిక సుఖము లభించగలదు. వైవాహిక జీవితము ప్రేమపూరితముగా వుండును. ఉద్యోగములో ఉత్తమత వుండును. బ్యాగస్వామి మరియు మిత్రుల సమ్యోగము లభించగలదు.

వృషభ లగ్నములో లగ్నస్థ శని

వృషభ లగ్నము యొక్క కుండలిలో శని నవమ మరియు దశమ బావము యొక్క అధిపతిగా వుండును. ఈ రాశి శని యొక్క మిత్ర రాశి. ఈ రాశిలో శని యోగకారక గ్రహము కాగలడు. లగ్నములో వృషభ రాశిలో వున్న శని వ్యక్తిని అత్యదిక పరిశ్రమ మరియు కార్యకుశలత కలవాడుగా చేయును. శారీరకముగా అలసిపోయి పుష్టిత్వము ఇచ్చును. ప్రభుత్వ రంగము నుండి మరియు తండ్రి నుండి సమ్యోగమును మరియు లాభమును ప్రదానించును. ప్రధమ బావములో స్థితిలో వున్న శని యొక్క దృష్టి తృతీయ, సప్తమ మరియు దశమ బావముపై వుండును. వీరు బాగ్యోదయము జన్మస్థానము నుండి దూరముగా కలుగును. మెట్టింటి వారి నుండి లాభము ప్రాప్తించును. జీవిత భాగస్వామి నుండి సమ్యోగము ప్రాప్తించును. శని యొక్క దృష్టి వలన వైవాహిక జీవితములో విల్లంఘములు ఏర్పడును మరియు బంధు మిత్రుల నుండి సమ్యోగము లభించదు.

వృషభ లగ్నములో లగ్నస్థ రాహువు

రాహువు వృషభ లగ్నము యొక్క కుండలిలో ప్రధమ బావములో స్థితిలో వుండుట కారణముగా రాహువు యొక్క గోచర కాలములో ఆరోగ్య సంబందమైన సమస్యలను ఎదుర్కొనవలసి వుండును. రాహువు కార్యములలో బాదను కలిగించును మరియు అవరోదములను శృష్టించును. లగ్నస్థ రాహువు వ్యక్తిని గుప్త విద్యలలో పారంగితునిగా చేయును. ఈ బావములో స్థితిలో వున్న రాహువు వైవాహిక జీవితమును కల్యాణ పూరితముగా చేయును. 

వృషభ లగ్నములో లగ్నస్థ కేతువు

వృషభ లగ్నము యొక్క కుండలిలో లగ్న బావములో స్థితిలో వున్న కేతువు వ్యక్తిని అల్పశిక్షను కలిగిన ఆశావాదిగా చేయును. దానితో పాటు పరిశ్రమించే వ్యక్తిగా చేయును. వారి పరిశ్రమ మరియు లగ్నము కారణముగా అసంభవ పనులను కూడా సంభవకరమైనవిగా చేయును. వీరి పరిశ్రమి అయినప్పటికీ వీరిలో సాహస లోపము కలిగి వుండును. స్వతహాగా విచారణ చేసి వీరి పనులను పూర్తిచేయుట కఠినకరముగా వుండును. జూదము, లాటరీ మరియు పందెములపై వీరి ధనము నష్టము కలుగును.


గ్రహముల యొక్క ఫలితములు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...