17, ఏప్రిల్ 2017, సోమవారం

గ్రహాలు - వక్రత్వం

గ్రహాలు - వక్రత్వం

గ్రహాలు కొన్నాళ్ళు వేగంగాను, కొన్నాళ్ళు స్తంభనలోను, కొన్నాళ్ళు వక్రంగా సంచరించును. భూమితో పాటు గ్రహాలన్నీ సూర్యుని చుట్టు తిరుగుచున్నవి. గ్రహాలు సూర్యుని చుట్టు తిరుగుతున్నప్పుడు సూర్యుని అవతలకి వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్నవారికి గ్రహాలు కనిపించవు.  ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ వాటి వాటి కక్ష్యల్లో తిరుగుతుంటాయి. భూమి కూడా తన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి వాస్తవంలో ఏ గ్రహానికి వక్రగతి గాని, ఇతర గతులు గాని ఉండవు. కానీ భూమి మీద ఉన్న పరిశీలకుడు ఒక గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒకొక్కసారి ఆ గ్రహం ముందుకు వెళ్ళినట్లు, ఒకొక్కసారి వెనుకకు వెళ్ళినట్లు, ఒకొక్కసారి కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది.


ఒక గ్రహం ముందుకు వెళ్ళినట్లు కనపడే స్ధితిని ఋజుగతి అంటారు. ఒక గ్రహం వెనుకకు వెళ్ళినట్లు కనపడే స్ధితిని వక్రం లేదా వక్రగతి అంటారు. ఒక గ్రహం వక్రగతిలో ఉన్నదంటే అది భూమికంటే వెనుక ప్రయాణిస్తుందన్న మాట. గ్రహం తానున్న రాశి నుండి గాని, నక్షత్ర పాదం నుండి వెనుకకు పోవటాన్ని వక్రం అంటారు. పాపగ్రహాలకు వక్రగమనం కలిగినచో మిక్కిలి పాప ఫలితాన్ని, శుభగ్రహాలకు వక్రగమనం కలిగినచో సకల శుభ ఫలితాన్ని ఇస్తారు.గురువు వక్రించినప్పుడు అదే రాశి ఫలితాన్ని, మిగతా గ్రహాలు వక్రించినప్పుడు వెనుక రాశి ఫలితాన్ని ఇస్తాయి. బుధ, శుక్రులు స్పీడ్ ప్లానెట్స్. బూమి కంటే ఎక్కువ వేగం కలిగి ఉన్నందున ఈ గ్రహాలను రవి దాటి పోవలసిన అవసరం లేకుండా బుధ, శుక్రులే రవిని దాటి వెళ్ళి ఆ తరువాత వేగం తగ్గి వక్రం పొందుతారు.

బుధుడు రవిని దాటి 28º ముందుకు వెళ్ళి క్రమంగా వేగం తగ్గి 22º దూరంలో వక్రిస్తాడు. ఆయా రాశులను బట్టి 14º దూరంలో కూడా వక్రించును.వక్రించినప్పుడు బుధుడు గరిష్టంగా 16 º 30 నిమిషాలు వెనుకకు వెళ్తుంది. బుధుడి వక్ర గతి కాలం 24 రోజులు.

శుక్రుడు రవిని దాటి 48º ముందుకు వెళ్ళి క్రమంగా వేగం తగ్గి 29º దూరంలో వక్రిస్తాడు. వక్రించినప్పుడు శుక్రుడు గరిష్టంగా 16 º 30 నిమిషాలు వెనుకకు వెళ్తుంది. శుక్రుని వక్ర గతి కాలం 42 రోజులు.

కుజుడిని దాటి రవి 4 రాశుల 11º ముందుకు వెళ్ళగానే కుజుడు వక్రిస్తాడు. వక్రించినప్పుడు కుజుడు గరిష్టంగా 10 º 30 నిమిషాలు వెనుకకు వెళ్తుంది. కుజిని వక్ర గతి కాలం 80 రోజులు.

 గురువుని దాటి రవి 3 రాశుల 24 º ముందుకు వెళ్ళగానే గురువు వక్రిస్తాడు. వక్రించినప్పుడు గురువు గరిష్టంగా 10 º 00 నిమిషాలు వెనుకకు వెళ్తుంది. గురుని వక్ర గతి కాలం 240 రోజులు.

శనిని దాటి రవి 3 రాశుల 19 º ముందుకు వెళ్ళగానే శని వక్రిస్తాడు. వక్రించినప్పుడు శని గరిష్టంగా 06 º 58 నిమిషాలు వెనుకకు వెళ్తుంది. శని వక్ర గతి కాలం 140 రోజులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...