15, ఆగస్టు 2015, శనివారం

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు (తెలుగు మాసములు) :

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.

ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).

6, ఆగస్టు 2015, గురువారం

నవగ్రహ దోషములు- పరిహారాలు

నవగ్రహ దోషములు- పరిహారాలు

మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబం ధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విము క్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివా రు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు.

సూర్యుడు: ఎవరి జాతకంలో అయితే రవి బల హీనంగా ఉంటా డో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధు లు, తండ్రి తరుపు బంధు వులతో పడకపోవు ట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొ నేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమ స్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పా రాయణం, గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారప దార్థ ములు దానం చేయు ట. తండ్రి గారిని లేదా తండ్రితో సమా నమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.

5, ఆగస్టు 2015, బుధవారం

గ్రహాలు-సంయోగం



గ్రహాలు-సంయోగం

ఒక రాశిలో గాని,ఒక బావంలో గాని రెండు గ్రహాలు కలసినప్పుడు గ్రహ సంయోగమవుతుంది.రెండు గ్రహాల మద్య అవది లేనప్పుడు (దూరం) వాటి ప్రభావం విశేషంగా ఉంటుంది.ఆ రెండు గ్రహాల స్వభావం,కారకత్వం,రాశితత్వం అవి ఏ భావాలకు ఆదిపత్యం వహించాయో ఆ భావాలు,ఏ భావంలో కలిసాయో ఆ భావానికి చెందిన విషయాలపై ప్రభావం చూపిస్తాయి.

1, ఆగస్టు 2015, శనివారం

గ్రహాలు ఉచ్చ నీచలు



గ్రహాలు ఉచ్చ నీచలు 

గ్రహాలు ఉచ్చ స్ధానాలు
మేషరాశిలో సూర్యుడు 10° పరమోచ్చ.
వృషభరాశిలో చంద్రుడు 3° పరమోచ్చ.
మకరరాశిలో కుజుడు 28° పరమోచ్చ.
కన్యరాశిలో బుధుడు 15° పరమోచ్చ.
కర్కాటకరాశిలో గురువు 5° పరమోచ్చ.
మీనరాశిలో శుక్రుడు 27° పరమోచ్చ
తులారాశిలో శని 20° పరమోచ్చ

29, జులై 2015, బుధవారం

జాతకం పరిశీలించటం

జాతకం పరిశీలించటం

ఏ వ్యక్తి జాతకాన్ని అయిన పరిశీలన చేసేటప్పుడు జాతక చక్రంలోని గ్రహాలు పరిశీలించాలి.

1)ఉదయించే సమయానికి సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో అదే ఉదయ లగ్నం అవుతుంది.
సూర్యుడు ఉన్న రాశిలో లగ్నమున్న సుమారుగా సూర్యోదయ కాలం.
సూర్యుడికి 7 వ రాశిలో లగ్నమున్న సూర్యాస్తమయ కాలం.
సూర్యుడికి 4 వ రాశిలో లగ్నమున్న మిట్ట మద్యాన్నం.
సూర్యుడికి 10 వ రాశిలో లగ్నమున్న అర్ధరాత్రి అవుతుంది కాబట్టి గమనించాలి.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...