27, జనవరి 2018, శనివారం

డోలన విద్య (Dowsing Pendulum)

డోలన విద్య (Dowsing Pendulum)
డౌజింగ్ పెండ్యూలమ్ అనగా డోలన విద్య అంటారు. ఈ డోలనవిద్య అత్యంత అరుదైనది మరియు క్లిష్టమైనది. పెండ్యులాన్ని డోలకం అని కూడా అంటారు. డోలకాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చును. 1)పెండ్యూలమ్ పైన దారంతో కట్టబడి ఉండటం. 2)డోలకం మద్య భాగం చివర ఉండే కొన కంటే లావుగా ఉండటం. 3)డోలకం చివర సన్నగా ఉండటం. డోలకాన్ని వెండి, ఇత్తడి, రాగి, కర్ర, స్పటికం ఇంకా అనేక రకాలుగా తయారుచేస్తారు.
డోలనం దాని యొక్క ప్రక్రియ :-

మానవుని షట్చక్రములలో మూడు చక్రములు మాత్రమే డోలన విద్యకు సంబందించినవి. అవి:-
1)ఆజ్ఞాచక్రము:- ఆజ్ఞాచక్రం మనస్సును నియంత్రించి తద్వారా యోచనలను మెదడు నుండి ఆలోచనలను స్వీకరిస్తుంది.
2)విశుద్ధచక్రము :- శరీరభాగాన్ని ఉత్తేజపరిచి శక్తిని అధోభాగానికి పంపుతుంది.
3)అనాహత చక్రం :- ఈ చక్రం నుండి శక్తి ప్రధానంగా చేతులకు ప్రసారమవుతుంది. ఈ మూడు చక్రాలనుండి వచ్చిన శక్తి చేతిలోకి వచ్చిన పిమ్మట బొటన, చూపుడు వ్రేళ్ళకు అందించే విధంగా అభ్యాసము చేయవలెను.

బ్రోటనవేలు అగ్నికి, చూపుడువేలు వాయువుకు సంబందించినది. మనస్సునందు ఆలోచనలు పుడుతాయి. మెదడు మనస్సు యొక్క తరంగాలను గ్రహించి మనకు ఆతరంగాల యొక్క భావములను విశ్లేషణ చేస్తుంది. మనుషులు బయటకు మాట్లాడటమే కాక మనస్సు నందు కూడా మాట్లాడగలరు. ఆ క్షణకాలమందు ఆలోచనల యొక్క శక్తిని బట్టి తగిన జవాబును శోధించి పట్టుకొని డోలకానికి అందజేసి, ఆ జవాబుకు తగినట్లుగా డోలకం గమన నిర్ధేశనం చేస్తుంది. దీని వలన ఒక ప్రత్యేకమైన భాష డోలకానికి ఏర్పడింది. ఆడోలకం యొక్క కదలికల వలన డోలకం వేసే డౌజర్ మనలకు సమాధానాన్ని తెలియజేస్తాడు. దీనినే డౌజింగ్ అని డోలన విద్య అని అంటారు.

డౌజింగ్ యొక్క నియమాలు:- డోలకమును ఉపయోగించి డౌజింగ్ చేయునప్పుడు పాదములను తప్పనిసరిగా నీటితో శుభ్రం చేయవలెను.
డౌజింగ్ చేయుటకు సూర్యోదయ సమయమున మాత్రమే చేయవలెను. సూర్యాస్తమయ సమయములలో డౌజింగ్ చేయరాదు. డోలకానికి నల్లని సిల్కు దారమును మాత్రమే ఉపయోగించవలెను. దారమునకు ముడివేసి ముడిని తేలికగా కుడిచేతి యొక్క చూపుడు, బొటన వ్రేళ్ళ మధ్యయందు పట్టుకొని భగవంతుణ్ణి మనస్సునందు తలచుకొని డౌజింగ్ చేయటం ప్రారంభించాలి. చూపుడు, బ్రోటన వ్రేళ్ళతో పట్టుకొన్నప్పుడు మిగతా వ్రేళ్ళన్ని ఈ రెండు వ్రేళ్ళకు తగలకుండా ఎడంగా ఉండాలి.

డోలకాన్ని చవితి, అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిధులలో చేసిన సరియైన గైడెన్స్ ని ఇవ్వలేదు. ఎందుకంటే ఈ తిధులయందు భూమిపై చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావము మిక్కిలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి డోలకం చంద్రుని యొక్క ఆకర్షణ శక్తికి లోనయి సరియైన ఫలితాలను ఇవ్వజాలదు. డౌజింగ్ చేయునప్పుడు ఎడమ చేతిలో చిన్న అయస్కాంతమును పట్టుకొనవలెను. ఎందుకనగా డోలకం భూమి యొక్క గురుత్వాకర్షణకు లోనవకుండా ఉండటానికి.


డౌజింగ్ ధనసంపాదన నిమిత్తం చేయరాదు. చెడు ఉద్దేశంతోను, ఎవరికి కీడు చేసే తలంపుతోనూ ఉపయోగించరాదు. డౌజింగ్ కు డౌజింగ్ పిరమిడ్ పెట్టెను ఉపయోగిస్తే చాలా మంచిది. భోజనము చేసిన తరువాత డౌజింగ్ చేయరాదు. కనీసము నాలుగు గంటలు తదుపరి చేయవలెను.

డోలకాన్ని ముందుగా ఒక ప్రశ్న వేయవలెను. అది ఏమనగా “నేను ప్రశ్నించబోయే వాటికి సమాధానమిస్తావా దయచేసి తెలియపరుచు అని అడిగిన పిమ్మట డోలకము యొక్క కదలికలను బట్టి అభిప్రాయాలను గ్రహించవలెను. అప్రదక్షిణంగా(ఆంతి ఛ్లొచ్క్ విసె) లేదా అడ్డంగా ఊగిన యెడల దాని అర్ధము లేదు, కాదు అని, ప్రదక్షిణంగా(ఛ్లొచ్క్ విసె) లేదా నిలువుగా ఊగినచో దాని అర్ధము అవును అని గ్రహించవలెను. అవును అని చెబితేనే తరువాతి ప్రశ్న అడగవలెను. కాదు అని చెప్పినచో అరగంట తరువాత తిరిగి ప్రశ్నించాలి.

డోలకానికి కావలసిన వస్తువులు:- డోలకాన్ని స్పటికం, ఇత్తడి, రాగి, చెక్క మొదలగు వాటితో చేసిన దానిని ఒకటి స్వీకరించవలెను. డోలకాన్ని నల్లని సిల్కు దారంతో ఉంచాలి. డోలకం చివర మొన తేలి ఉండాలి. చిన్న అయస్కాంతాన్ని ఎడమచేతిలో ఉంచుకోవాలి. పిరమిడ్ తో చేయబడిన డౌజింగ్ బాక్స్ ని సిద్ధం చేసుకోవాలి.

రాగి రేకు లేదా చెక్క లేదా అట్టముక్క లేదా కాగితం మీద గాని అర్ధచంద్రాకారపు వృత్తాన్నిగీసుకోవలెను. ఈ అర్ధచంద్రాకారపు వృత్తంలో మనము తెలుసుకోదలచిన అంశాన్ని గాని లేదా వ్యక్తి యొక్క పోటో లేదా వస్తువును ఉంచి నాలుగయిదు ఆప్షన్స్ ఉంచిన ఎడల సరియైన దాన్ని ఎంచుకోవచ్చును.

డౌజింగ్ ద్వారా తెలుసుకొనే ముఖ్యవిషయాలు:- డౌజింగ్ చేయు వ్యక్తి ముందుగా కొన్ని మనకు తెలిసిన చిన్న అంశాలపై డౌజింగ్ వేసుకోవాలి.(ఉదా:- సూర్యుడు ఉదయాన్నే ఏ దిక్కున ఉదయిస్తాడు. పాలు ఏ రంగులో ఉంటాయి.) ఇవి మనకు తెలిసిన అంశాలు. ఈ అంశాలకు డౌజింగ్ సరియైన సమాదానాన్ని ఇస్తే సరియైన డౌజర్ గా గుర్తింపు లభించినట్టే.

జాతకము లేనివారికి, జ్యోతిష్యవాస్తు విషయములకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఇది జవాబులను ఇస్తుంది. డోలకం ద్వారా ముహూర్తాలను నిర్ణయించ కూడదు. నీది నిక్షేపాలను తెలుపదు.

ఇల్లు, స్ధలములు నాపేరు మీద కొనుగోలు చేయవచ్చా లేదా, ఇంటి సింహాద్వారం ఏ దిశయందు ఉండాలి. ఇంటికి ఏ రంగు వేయాలి. ఇంటిలో ఏ దిక్కున వాస్తు దోషం ఉన్నది. ఇంటి లోపల భూగరర్బంలో శల్యములు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. గృహానికి నరదృష్టి, నెగిటివ్ ఉన్నది లేనిది తెలుసుకోవచ్చును. మనిషికి అనారోగ్యం ఎన్ని రోజులకు తగ్గుతుంది. అనారోగ్యం ఏ అవయవమునందు ఉన్నది. అనారోగ్య నివారణకు యునాని, ఆయుర్వేదం, అల్లోపతీ, హోమియోపతి ఈ నాల్గింటిలో ఏ ఔషదము రోగ నివారణకు ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చును.

జ్యోతిష్య సంబందంగా జాతకచక్రంలో ఏ గ్రహం, ఏ నక్షత్రం, ఏ భావం అనుకూలంగా లేవో తెలుసుకోవచ్చును. చేతికి ఏ రత్నం ధరించాలి. ఏ దేవతామూర్తికి పూజ చేయాలి. పేరు ఏ అక్షరంతో ప్రారంభం కావాలో తెలుసు కోవచ్చు. జాతకునికి నరదృష్టి ఉన్నది లేనిది తెలుసుకోవచ్చును. ఏ రోజు ఉపవాసం చేస్తే మంచిది. ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించటం మంచిది. జన్మించిన సంవత్సరం, నెల, తేది, సమయం సరియైనదో కాదో తెలుసుకోవచ్చును. ఏ వృత్తిలో రాణిస్తారు. ఏ సంవత్సర వివాహం చేసుకొంటే మంచిది. వచ్చిన సంబందం చేసుకోవచ్చా లేదా, ప్రధమ సంతానం ఎవరు అనే ముఖ్య విషయాలను ఈ డౌజింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...