22, జనవరి 2018, సోమవారం

సూర్యభగవానుడి దోష నివారణకు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన

సూర్యభగవానుడి దోష నివారణకు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన  

జాతకంలో రవి నీచలో (తులారాశిలో) ఉండి ఎటువంటి శుభ గ్రహ ద్రుష్టి లేకుండా ఉంటే అనారోగ్య సమస్యలు, ఎదుటి వారిని లెక్కచేయకపోవటం, ప్రతి ఒక్కరు తనమాటే వినాలనుకోవటం, తన అడుగు జాడలలో నడవాలనుకోవటం వంటి స్వార్ధ భావాలు కలిగి ఉంటారు. ఇలాంటి వారు ఆదివారం రోజు సూర్యోదయం నుండి ఒక గంట లోపు తెల్లజిల్లేడు వత్తులతో దీపం వెలిగించి ఆదిత్య హృదయ పారాయణ చేయటం వలన రవి నీచలో ఉండటం వలన కలుగు దోషాలు తొలగిపోతాయి.
సూర్యుడు జాతకంలో పంచమ స్ధానంలో ఉండటం వలన బాలారిష్ట దోషం ఏర్పడుతుంది. దీని వలన చిన్నతనంలోనే అనారోగ్యాలు కలగటం జరుగుతుంది. సంతాన దోషం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోను సరైన నిర్ణయం తీసుకోలేరు.  పిల్లలతో విభేదాలు ఉండటం జరుగుతుంది. ఈ దోష నివారణకు ఏదైన ఒక రవి హోరలో కనీసం వారానికి 3 సార్లు తెల్లజిల్లేడు వత్తులతో దీపాన్ని వెలిగించి సూర్య అష్టోత్తర శతనామావళి జపించటం ద్వారా బాలారిష్ట దోషలు తొలగిపోతాయి.

రవి, రాహువులు జాతక చక్రంలో 10 డిగ్రీల లోపు కలసి ఉన్న గ్రహణ దోషంగా చెబుతారు. వీరిద్దరు నవమ స్ధానంలో ఉన్న పితృదోషంగా, పంచమంలో కలసి ఉన్న నాగ దోషంగా పరిగణిస్తారు. జాతకంలో రవి, రాహువులు కలసి ఉండటం వలన మానసికమైన ఒడిదుడుకులు, ఎప్పుడు చికాకులు, అధికారుల ఒత్తిడి, తన గురించి ప్రతి ఒక్కరు తప్పుగా అర్ధం చేసుకోవటం జరుగుతుంది. నవమస్ధానంలో రవి, రాహువులు కలసి ఉండటం వలన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం, తండ్రితో విభేదాలు, తండ్రి గౌరవాలకు భంగం కలిగించటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రవి, రాహువులు పంచమంలో ఉండటం వలన సంతాన దోషం, సంతానానికి అనారోగ్య సమస్యలు కలగటం జరుగుతుంది. ఈ దోష నివారణకు ఆదివారం రాహుకాలంలో తెల్లజిల్లేడు వత్తులతో దీపం వెలిగించి సూర్య కవచ సోత్రాన్ని పఠించటం ద్వార గ్రహణ దోష ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది.

తూర్పు దిక్కు దోషం ఉన్న ఇల్లు గాని వ్యాపార సంస్ధల యందు గాని ఉన్నప్పుడు తనని ఇంట్లో వాళ్ళు సరిగా అర్ధం చేసుకోలేక పోవటం, దీర్ఘకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం, గౌరవాలకు భంగం కలగటం జరుగుతుంది. వ్యాపార సంస్ధలో తూర్పు దిక్కు దోషం ఉన్నప్పుడు పరిష్కారం కాని సమస్యలు, జనాకర్షణ లేకపోవటం, నిత్యం గొడవలు జరగటం వంటి సమస్యలు కలుగుతాయి. వాస్తు దోష నివారణకు నిత్యం తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తూ సూర్య భగవానుడి ద్వాదశ నామాలు పఠించటం ద్వారా వాస్తుదోష నివారణ కలుగుతుంది.

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...