23, జనవరి 2018, మంగళవారం

బుధగ్రహ దోష నివారణకు బ్యాంబు ట్రీ (వెదురు చెట్టు)

బుధగ్రహ దోష నివారణకు బ్యాంబు ట్రీ (వెదురు చెట్టు)

బ్యాంబుట్రీ దీనినే వెదురు చెట్టు అని కూడ అంటారు. ఇది ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. ఇది మన నవగ్రహాలలో బుధ గ్రహానికి చెందినది. బుధుడు వ్యాపారవృద్ధి కారకుడు కావటం వలన ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది. వ్యాపార సంస్థలలో నరథిష్టికి, ఆకర్షణకు, వ్యాపారభివృథ్థికి చాలా మంచిది.విద్యకి, వాక్ శుద్ధికి బుధుడు కారకుడు. పిల్లలు చదువుకునే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు, చదువుపై శ్రద్ద, సరియైన సమయంలో (పరీక్ష సమయములలో) గుర్తుకు వచ్చే ఆలోచనలు (క్రియేటివిటి). మంచి వాక్ ఫటిమ కలిగి భావ ప్రకటన చేయగలడు. వెదురు మొక్క పెరుగుదలను ప్రత్యక్షంగా చూడటం వలన మనలో కూడ జీవితంలో ఉన్నత స్ధాయికి ఎదగాలనే భావన కలుగుతుంది.ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా, వీధిపోటు ఉన్న ఇంటిలో సింహాద్వారానికి ఎదురుగా ఉంచితే వీథిపోటు, చిన్న చిన్న వాస్తు దోషాలు నరదృష్టి, కనుదృష్టి, చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించి మంచి అన్యోన్నత, ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు సుఖశాంతులు, థనాభివృద్దితో ఇల్లు కళకళ లాడుతుంది.

అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ వెదురు మొక్కలు రకరకాల ఆకృతులలో రూపొందించిన గాజు, మట్టి పాత్రలలో ఉంచి తూర్పు, ఉత్తర, ఈశాన్య దిక్కుల యందు ఉంచి అప్పుడప్పుడు నీటిని మారుస్తూ ఉండాలి. పిల్లల చేత వెదురుమొక్క ఆకులపై నీటిని చిలకరించే విధంగా చేయటం వలన స్ఫురణ శక్తి పెరిగి, విద్యా సంబంధ విషయాలలో మంచి పోటీతత్వంతో ఉన్నత చదువులు అభ్యసించటానికి వెదురు చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది.

వెదురు మొక్కలను గృహాలకంరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ‘ఇండరో మొక్కలుగా’ పెంచుకుంటున్నారు. ‘వెదురు మొక్కలను’ లక్కీ ప్లాంట్స్‌గా అభివర్ణించుకుంటున్న పలువురు ఈ మొక్కలను ఇళ్లలో పెంచితే ‘ధన బలం’ పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఈ సంస్కృతి అలా అలా వ్యాపించటంతో ఇళ్లలోనే కాదు ఆఫీసుల్లోనూ, దుకాణ సముదాయాల్లో ఎక్కడ చూసిన ఈ మొక్కలే దర్శనమిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...