28, డిసెంబర్ 2017, గురువారం

గ్రహాలు కలుగజేయు వాత, పిత్త, కఫ, సన్నిపాత లక్షణాలు

గ్రహాలు కలుగజేయు వాత, పిత్త, కఫ, సన్నిపాత లక్షణాలు 

రవి గ్రహం:- గ్రీష్మ ఋతువులో  పిత్తం ఎక్కువగా వాతం అల్పంగా ఉంటుంది.
చంద్ర గ్రహం:- వర్ష ఋతువులో వాతం అధికంగా కఫం అల్పంగా ఉంటుంది.
కుజ గ్రహం :- గ్రీష్మ ఋతువులో  పిత్తం ఎక్కువగా ఉంటుంది.
బుధుడు :- శరత్ ఋతువులో వాత, పిత్త, కఫ లక్షణాలు కలిగి ఉంటాయి.
గురువు :- హేమంత ఋతువులో కఫం అధికంగా వాతం అల్పంగా ఉంటుంది.
శుక్రుడు :- వసంత ఋతువులో వాతం అధికంగా కఫం అల్పంగా ఉంటుంది.
శని గ్రహం :- శిశిర ఋతువులో వాతం అధికంగా పిత్తం అల్పంగా ఉంటుంది. 


రవి కుజులు దుస్ధానాలలో ఉన్నప్పుడూ ఏర్పడే అధిక వేడి ద్వార కలిగే రోగాలు పిత్త సంబంధమైనవి. చంద్ర, శుక్రులు దుస్ధానాలలో ఉన్నప్పుడూ ఏర్పడే రోగాలు నీటి సంబంద రోగాలు, బొబ్బలు, శరీరం ఉబ్బుట, శిరస్సులో నీరు పట్టుట వాత సంబంధమైనవి. శని దుస్ధానాలలో ఉన్నప్పుడూ వాత, పిత్త రోగాలు కలుగును. బుధుడు దుస్ధానాలలో ఉన్నప్పుడూ మెదడు వాపు రోగాలు కలుగును. గురువు దుస్ధానాలలో ఉన్నప్పుడూ కఫ రోగాలు కలుగును. ఈ  రోగాలు ఆయా గ్రహాలకు సంబందించిన ఋతువులలో బయటపడతాయి. 

వాత లక్షణాలు :- ఎప్పుడు నవ్వటం, తరచుగా చప్పట్లు చరచటం, గట్టిగా మాట్లాడటం, బిగ్గరగా ఏడ్వటం, కాళ్ళు తరచుగా ఆడించటం, చేతులు ముడుచుకోవటం, శరీరం రాగి రంగులో ఉండటం సున్నితంగా కృశించి పోవుట, తిన్న బోజనం అరిగిన తరువాత కలత చెందటం జరుగుతుంది. 

పిత్త లక్షణాలు :- అందరిని ద్వేషించటం, అసంగతంగా ప్రవర్తించటం, అందరితో క్రోదంగా ప్రవర్తించటం, అసభ్యంగా మాట్లాడటం, తరచుగా ఏదో ఒకటి తినటం, త్రాగటం, అధికంగా కోపం తెచ్చుకోవటం, శరీరం పసుపు వర్ణం కలిగి వేడిగా ఉండటం జరుగుతుంది. 

కఫ లక్షణాలు :- ఏకాంతంగా గడపాలనుకోవటం, స్త్రీలను కోరుకోవటం, అందరిని అసహ్యించుకోవటం, నిద్ర తక్కువగా ఉండటం, నోటిలో ఉమ్మి ఎక్కువగా ఊరి కింద పడటం, చేతి వేళ్ళు పేలుసుగా తెల్లగా మారటం జరుగుతుంది. 

సన్నిపాత లక్షణాలు :- పై మూడు లక్షణాలు కలసి మిశ్రమ రోగాలు కలుగుతాయి. ఇవి తగ్గటం కష్టం. 

వాత, పిత్త, కఫ దోషాలను ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాల ద్వారాను, ఔషదాల ద్వారాను నివారించుకోవచ్చును. సన్నిపాత లక్షణాలు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాల ద్వారానే కాకుండా జప, హోమ, తర్పణాల ద్వారా నివారించుకోవచ్చును. 

గురువు లగ్నం నందు శని సప్తమం నందు ఉన్నప్పుడూ, గురువు లగ్నం నందు కుజుడు సప్తమం నందు ఉన్నప్పుడూ, శని లగ్నం నందు కుజుడు 5, 7, 9 స్ధానాలలో ఉన్నప్పుడు, చంద్ర, బుధులు కలసి లగ్నం నందు ఉన్నప్పుడూ, క్షీణ చంద్రుడు పాపగ్రహాలతో కలసి 1, 5, 8, 9 స్ధానాలలో ఉన్నప్పుడూ, క్షీణ చంద్రుడు మరియు శని ద్వాదశంలో ఉన్నప్పుడూ, గుళిక పాపగ్రహంతో కలసి సప్తమం నందు ఉన్నప్పుడూ, బుధుడు 3, 6, 8, 12 స్ధానాలలో పాప గ్రహాలతో కలసి ఉన్నప్పుడూ పై లక్షణాలు ఏర్పడతాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...