9, జూన్ 2017, శుక్రవారం

నైధనతార పరిశీలన

నైధనతార పరిశీలన

ప్రస్తుతం ఈ చిన్న ముహూర్తం చూడాలన్న తారాబలం చూడటం సర్వసాధారణం. తారాబాలం చంద్ర బలం చూడకుండా ముహూర్త నిర్ణయం చేయం. తారలు 9. జన్మతార నుండి పరమమైత్ర తార.

శ్లో:- జన్మన్యర్కో హిమకరసుతః సైంహికేయో సురేద్యః
కేతుశ్ఛంద్రో దినకరసుతః భార్గవో భూమిపుత్రః

జన్మతారకి అధిపతి సూర్యుడు, సంపత్తారకి అధిపతి బుధుడు, విపత్తారకు అధిపతి రాహువు, క్షేమతారకి అధిపతి గురువు, ప్రత్యక్ తారకు అధిపతి కేతువు, సాధన తారకు అధిపతి చంద్రుడు, నైధనతారకు అధిపతి శని, మిత్రతారకు అధిపతి శుక్రుడు, పరమమైత్ర తారకు అధిపతి కుజుడు.

సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార ఈ నాలుగు తారాలకు అధిపతులు, వాహనాలు శుభులే కావటం వలన అన్నీ శుభకర్మలకు వీటిని వాడతాము. పరమమైత్ర తారకు అధిపతి, వాహనం చెడ్డవి అయిన "పరమమైత్రే లాభంచ" అను నానుడచే వాడుతూ ఉంటాము. తారలు బాగలేనప్పుడు వాటికి దానములు చెప్పబడినవి. ఆయా దానములు ఇచ్చి చెప్పిన ఘడియలు విడచి వాడుతాము. అలాగే నైధనతారకు స్వర్ణదానం చేసి ఆరోజు శుభకార్యం చేయవచ్చు అంటారు. కానీ కొందరు “నైధనం నిధనం” మృత్యుప్రదమని వాడుటలేదు. వధువు నక్షత్రం నుండి వరుని నక్షత్రం 7 వదైన ఎడల వధువుకు 6 మాసాలలో వైధవ్యం వచ్చునని కొంతమంది వాడుటలేదు. జన్మతారకు అధిపతి రవి, నైధనతారకు అధిపతి శని. వీరువురికి పరమ శతృత్వం కావున శుభకార్యాలు ఆచరించటంలేదు. “నైధానం సర్వత్ర వర్జయేత్” అని కొందరు జ్యోతిష్యవేత్తలు ఏమాత్రం ఒప్పుకొనుటలేదు.


భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్రాలలో జన్మించినవారు శుక్రదశలో జన్మిస్తారు. వారికి పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు నైధన తారలు అవుతాయి. అలాంటప్పుడు ఆ నక్షత్రాలలో ఏ శుభకార్యాలు చేయకూడదు. కాలామృతంలో వధువు నక్షత్రానికి ఏడవ నక్షత్రం వరునితో వివాహం నిషేదించాడు. గ్రంధంలో ఉన్న విషయాలు అనుభవంలో సరిపోతున్నవో లేదో చూడాలి. “శాస్త్రాత్ దృఢిర్బలీయసీ” శాస్త్రం కన్నా అనుభవం బలీయమైనది.

అనుభవ పూర్వకంగా కొంతమంది జ్యోతిష్యవేత్తలు భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్ర జాతకులకు పుష్యమి అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములు శుభకార్యాలకు ముహూర్తములు నిర్ణయించి పెట్టినప్పుడు అందరూ క్షేమంగా ఉన్నారు. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలవారికి కూడా నైధనతార దోషయుక్తం కాదు. ఎందుకనగా బుధ, శుక్ర, శనులకు మిత్రత్వం వలన నైధనతార చెడ్డ చేయడు. అదే విధంగా భరణి, పుబ్బ, పూర్వాషాడ నక్షత్ర వధువు జాతకులకు పుష్యమి అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులైన వరులతో వివాహం చేయవచ్చును.        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...